
ప్రజాస్వామ్య స్ఫూర్తితో చర్చించాలి
రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో అన్ని పార్టీల సభ్యులూ ఆయా అంశాలపై ప్రజాస్వామ్య స్ఫూర్తితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో అన్ని పార్టీల సభ్యులూ ఆయా అంశాలపై ప్రజాస్వామ్య స్ఫూర్తితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల తొలి భాగం చాలా ఫలవంతంగా జరిగిందని, కొన్ని ముఖ్యమైన చట్టాలు ఆమోదం పొందాయని పేర్కొన్నారు. ఈసారి కూడా అలాగే జరుగుతుందని ఆశిస్తున్నట్లు ప్రధాని చెప్పారు.