తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 10 నుంచి ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ, మండలి సమావేశాలు అదే రోజు ఉదయం 10గంటలకు ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 10 నుంచి ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ, మండలి సమావేశాలు అదే రోజు ఉదయం 10గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శనివారం ఒక అధికారిక ప్రకటన విడుదలైంది.
తొలి రోజు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. 11న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంతో ఆ రోజు సమావేశాలు ముగిస్తారు. 13న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సుమారు 15రోజులపాటు సమావేశాలు జరిగే అవకాశముంది.