హైదరాబాద్: ఈ నెల 27 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. శుక్రవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ నరసింహన్ ప్రసంగం అనంతరం రేపటికి వాయిదా పడ్డాయి. అనంతరం బీఏసీ సమావేశంలో సభ నిర్వహణపై చర్చించారు.
శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఆదివారం అసెంబ్లీకి సెలవు. ఈ నెల 13న సభలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 15, 16 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఈ నెల 25 సభలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజులు జరపాలని బీఏసీ సమావేశంలో విపక్షాలు డిమాండ్ చేయగా, గత సమావేశాల్లోనే అన్ని అంశాలు చర్చించామంటూ పాలకపక్షం వ్యతిరేకించింది.
27 వరకు తెలంగాణ అసెంబ్లీ.. 13న బడ్జెట్
Published Fri, Mar 10 2017 12:38 PM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM
Advertisement