తెలంగాణ శాసనసభ, శాసనమండలి రేపటికి(సోమవారానికి) వాయిదా పడ్డాయి.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలి రేపటికి(సోమవారానికి) వాయిదా పడ్డాయి. గవర్నర్ నరసింహన్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆదివారం ఉభయ సభలు ఆమోదించాయి. రేపు అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
అసెంబ్లీ ముగిసి స్పీకర్ వెళ్లిపోయినా ఎమ్మెల్యేలు ధర్నా కొనసాగిస్తున్నారు. సభను అర్ధాంతరంగా వాయిదా వేశారని ఆరోపించారు. స్పీకర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు.
త్వరలోనే రెండు వర్సిటీలకు వీసీలను నియమిస్తామని సీఎం కేసీఆర్ శాసనమండలిలో ప్రకటించారు. కరువు భత్యంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.