'డబుల్ బెడ్ రూం ఇళ్లు ఆరు ఇళ్లతో సమానం'
హైదరాబాద్: తాము ఇచ్చే ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు ఇళ్లతో సమానం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశంలోనే ఓ కొత్త ప్రయోగం డబుల్ బెడ్ రూం ఇళ్లు అని అన్నారు. ఆదివారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం తెలిపే అంశంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాల స్పందనకు ఆయన ధీటుగా సమాధానం ఇస్తూ పలు పథకాలను ప్రస్తావించారు.
అందులో భాగంగా డబుల్ బెడ్ రూం ఇళ్లపై మాట్లాడారు. తొలిదశలో 60 వేల ఇళ్లు మంజూరు చేశామని, ముందో వెనుకో అవి ప్రారంభంకావడం మాత్రం ఖాయం అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో పేదలు ఆత్మగౌరవంతో బతకాలని అన్నారు. బ్యాంకులతో లింక్ పెడితే అవి లోన్ లు ఇవ్వవని, తామే 100శాతం ఖర్చు పెట్టి ఇళ్లు కట్టి ఇచ్చేందుకు నిర్ణయించామని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్ చేస్తారని, గ్రామాల ఎంపిక తాము చేస్తామని అన్నారు. తప్పుగా లబ్దిదారులను ఎంపిక చేస్తే అధికారిని తొలగిస్తామని అన్నారు.