భగీరథ అనగానే భయంపట్టుకుంటుంది: కేసీఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఆదివారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం తెలిపే అంశంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాల స్పందనకు ఆయన ధీటుగా సమాధానం ఇచ్చారు. గౌరవ సభ్యులు పదేపదే అవే మాటలు చెప్తున్నారు తప్ప కొత్తగా సూచనలు సలహాలు ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వం రాసిన స్క్రిప్టే గవర్నర్ చదువుతారని, పార్టీ మేనిఫెస్టోనే గవర్నర్ ప్రసంగం ఉంటుందని చెప్పారు. కేబినెట్ ఆమోదం తర్వాతే గవర్నర్ ప్రసంగిస్తారని తెలిపారు. కేజీ టూ పీజీ తప్ప ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని అన్నారు. గౌరవ సభ్యులు మాటలు మనల్ని మనమే అవమానించుకున్నట్లు ఉందని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని అలవాటు కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పారు. తొలి కేబినెట్ సమావేశంలోనే తండాలు గ్రామపంచాయతీలుగా చేస్తున్నాం.
ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అని కేసీఆర్ అన్నారు. కోత లేకుండా గ్రామాలకు కూడా విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. రైతులకు తొమ్మిది గంటలు క్వాలిటీ విద్యుత్ ఇస్తున్నామన్నారు. పరిశ్రమలకు కూడా విరామం లేని విద్యుత్ లేదని చెప్పారు. నేడు రాష్ట్రంలో 16శాతం అదనపు విద్యుత్ ఉపయోగిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. మిషన్ భగీరథ అనగానే ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని అన్నారు. నిజంగా గత ప్రభుత్వాలు నీటి ఏర్పాట్లుచేస్తే నేడు మహిళలు బిందెలతో ఎందుకు వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పొలాలు ఎండబెట్టారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో పారిశ్రామిక వేత్తలు రోడ్డుపైకి ధర్నాలు చేశారని అన్నారు.
- 2016 డిసెంబర్ నాటికి ఆరు వేలకు పైగా గ్రామాలు, 12 మున్సిపాలిటీలకు మంచి నీరు ఇస్తాం
- పదేళ్లు మెయింటెన్స్ బాధ్యత వారికి ఇస్తున్నాం
- మేనిఫెస్టోలో లేకపోయిన బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్నాం
- గుత్తా సుఖేందర్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకోవాలని చూశాడు
- విద్యార్థులకు సన్నబియ్యం ఇస్తున్నం
- పెన్షన్లు పెంచినం.. బియ్యం ఆరు కేజీలు చేశాం
- కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ మేనిఫెస్టోలో లేకపోయినా అమలుచేస్తున్నాం
- మేం అధికారంలోకి రాగానే తండాలను గ్రామపంచాయితీలు చేశాం
- టెండర్లన్నీ ఆన్ లైన్ లో ఉంటాయి.. ఇబ్బందులు ఉండవు
- బంగారు తల్లి పథకం అమలు చేయం
- పంచాయతీ రాజ్కు నిధులు తక్కువ ఇచ్చాం
- ఎయిర్ పోర్ట్కు లింక్ లేకుండా మెట్రో ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీనే..
- మేం అబద్ధాలు చెప్పం. అందుకే ప్రజలు మమ్మల్ని గౌరవిస్తున్నారు
- డబుల్ బెడ్ రూం ఇళ్లు కొత్త ప్రయోగం.
- మేం ఇచ్చే డబుల్ బెడ్ రూం ఇళ్లు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు ఇళ్లతో సమానం
- దేశం మొత్తం కరువొచ్చినా సిద్ధిపేటలో లేకుండా చేశాం