Live Updates:
లోక్‌సభలో నీట్ అంశంపై నిరనసకు దిగిన విపక్షాలు
నీట్‌పై పార్లమెంట్‌లో మాటల మంటలు
పేపర్ లీకేజీలో ప్రభుత్వం రికార్డు సృష్టించిందంటూ విపక్షా ఫైర్
- పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య: ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ
- ఈ సమస్య మూలాల నుంచి పెకిలించాలి.
- డబ్బులు ఉన్నవాళ్లు విద్యావ్యవస్థనే కొనేస్తున్నారు.
- విద్యార్థులు జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడటం తగదు.
- విద్యాశాఖమంత్రి తనను తప్ప అందిరినీ తప్పు పడుతున్నారు.
దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు: అఖిలేష్ యాదవ్
- రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్
- పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ జరుపుతోంది.
- నీట్‌పై తాము ఏమి దాచటం లేదు.
- నీట్ పరీక్షను యూపీఏ ప్రభుత్వమే తీసుకు వచ్చింది.
- విద్యా వ్యవస్థను రాహుల్ గాంధీ తప్పుపట్టడం దారుణం
రాజ్యసభ ప్యానెల్ వైస్‌ఛైర్మన్‌గా అయోధ్య రామిరెడ్డి
- రాజ్యసభ ప్యానెల్ వైస్‌ఛైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి నియామకం
- రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ పునర్వ్యవస్థీకరణ
- ప్యానెల్ వైస్ ఛైర్మన్ హోదాలో సభా కార్యక్రమాలను నిర్వహించనున్న అయోధ్య రామిరెడ్డి
- రాజ్యసభలో నూతన ప్యానెల్‌ను ప్రకటించిన జగదీప్ ధన్కడ్.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి
- పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మీడియా మాట్లాడారు.
- ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాం. అమృతకాలంలో ఇదొక అద్భుతమైన బడ్జెట్.
- 2047 నాటికి వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దుతాం. మూడోసారి అధికారంలోకి రావటం సంతోషకరం.
- ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం: ప్రధాని మోదీ
బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. రేపు (మంగళవారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నీట్ లీకేజీ, కన్వర్ యాత్ర, రైల్వే ప్రమాదం అంశాలపై ప్రశ్నించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
ఏపీలో శాంతి భద్రతలు క్షీణించిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్‌సీపీ నిరసనకు దిగుతోంది. 45 రోజుల చంద్రబాబు పాలనలో 31 రాజకీయ హత్యలు జరిగిన వైనంపై వైఎస్సార్‌సీపీ అఖిలపక్షంలో గళం విప్పింది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆల్ పార్టీ మీటింగ్‌లో వైఎస్సార్‌సీపీ కోరిగా.. టీడీపీ సైలెంగా ఉండిపోయింది. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏఐ డీప్ ఫేక్, పౌరసత్వ సవరణ చట్టం, రిటైర్డ్ న్యాయమూర్తులు రాజకీయాల్లోకి రావడం సహ పలు అంశాలపై 23 బిల్లులు ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment