AP Budget 2018-19: Andhra Pradesh Budget Highlights, Live Updates
Sakshi News home page

ఏపీ బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌

Published Thu, Mar 8 2018 11:41 AM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM

AP Budget 2018-19 Highlights - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2018-19కిగాను రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం ఏపీ శాసనసభలో ఉదయం11.30గంటలకు బడ్జెట్‌ ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టారు. 2019లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అతిముఖ్యమైనది కాగా ప్రత్యేక హోదా విషయం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌..

మొత్తం బడ్జెట్‌ రూ.లక్షా 91 వేల 63 కోట్లు
రెవిన్యూ వ్యయం రూ.లక్షా 50 వేల 270కోట్లు
మూలధన వ్యయం రూ.28వేల 671 కోట్లు
ఆర్థిక లోటు అంచనా రూ.24,205 కోట్లు
వృద్ధిరేటు : 10.96శాతం


సంక్షేమ రంగం

  • సాంఘిక సంక్షేమానికి రూ.13,722కోట్లు
  • వెనుకబడిన వైశ్యులకు రూ. 35కోట్లు
  • కాపులకు రూ.వెయ్యి కోట్లు
  • కాపు సామాజిక విద్యార్థులకు రూ.750కోట్లు
  • దూదేకులవారికి కేటాయింపులు.. రూ.40కోట్లు
  • నాయీ బ్రాహ్మణులకు రూ.30కోట్లు
  • వెనుకబడిన తరగతుల సంస్థకు రూ.100కోట్లు
  • వాల్మీకీ బోయిలకు రూ. 50కోట్లు
  • క్రిస్టియన్‌ మైనారిటీలకు రూ.75కోట్లు
  • మహిళా శిశు సంక్షేమానికి రూ.2839
  • గిరిజన సంక్షేమం రూ.250 కోట్లు
  • బీసీ సంక్షేమం రూ.4477కోట్లు
  • కార్మిక ఉపాధి కల్పలనకు రూ.902కోట్లు
  • సామాజిక భద్రతకు రూ.3వేల 29కోట్లు
  • చేనేతల సంక్షేమానికి రూ.250కోట్లు
  • డ్వాక్రా మహిళలకు రూ.1000 కోట్లు
  • చంద్రన్న పెళ్లి కానుకల కింద బీసీలకు, ఎస్సీలకు చెరో రూ.100కోట్లు
  • నీరు చెట్టు పథకానికి రూ.500 కోట్లు

విద్యుత్‌, వ్యవసాయం, సాగునీటి రంగం

  • సాగునీటి రంగానికి రూ.16,978కోట్లు
  • ఇరిగేషన్‌ విభాగం కింద పోలవరానికి రూ.9వేల కోట్లు
  • వ్యవసాయానికి రూ.12వేల 355కోట్లు
  • విద్యుత్‌ రంగానికి రూ.5వేల 52కోట్లు
  • రుణమాఫీకి రూ.4100కోట్లు

పరిశ్రమలు, రవాణా

  • పరిశ్రమలకు రూ.3వేల 78కోట్లు
  • రవాణా రంగానికి రూ.4వేల 653కోట్లు
  • పర్యావరణ రంగానికి రూ.4వేల 899కోట్లు
  • ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు రూ.300కోట్లు
  • రవాణా మరియు రోడ్డు భవనాల శాఖకు రూ.4,653కోట్లు
  • రోడ్ల అభివృద్ధికి రూ.1413 కోట్లు
     

గ్రామీణ, గృహ, పట్టణ రంగాలు

  • గ్రామీణాభివృద్ధికి రూ.20,815కోట్లు
  • పట్టణాభివృద్ధికి రూ.7,740కోట్లు
  • గృహనిర్మాణానికి రూ.3,679కోట్లు
  • గృహ నిర్మాణానికి స్థలం సేకరింపునకు రూ.575కోట్లు
  • మున్సిపల్‌ శాఖకు రూ.7,761కోట్లు
  • మంచినీరు, పారిశుద్ధ్యానికి రూ.2,623కోట్లు
  • విశాఖ చెన్నై కారిడార్‌ రూ.1168కోట్లు
  • స్మార్ట్‌ సిటీలకు రూ.800కోట్లు
  • స్వచ్ఛభారత్‌కు రూ,1450కోట్లు
  • ఆర్టీసీకి రూ.200కోట్లు
  • అమరావతి నిర్మాణానికి రూ.7,741కోట్లు
  • అమృత్‌ పథకానికి రూ.490 కోట్లు

 
విద్యా, వైద్యం, సాంకేతిక రంగం

  • సాధారణ విద్యారంగానికి రూ.24,180కోట్లు
  • సాంకేతిక విద్యకు రూ.818కోట్లు
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ.300 కోట్లు
  • మోడల్‌ స్కూల్స్‌ రూ.377కోట్లు
  • రెసిడెన్షియల్‌ స్కూల్స్‌కు రూ.670కోట్లు
  • నిరుద్యోగ భృతికి రూ.1000 కోట్లు
  • క్రీడలు, యువజన సర్వీసులకు రూ.1,635 కోట్లు
  • వైద్యరంగానికి రూ.8,463కోట్లు
  • సమాచార శాఖకు రూ.224కోట్లు
  • వివిధ విశ్వవిద్యాలయాలకు మౌలిక సదుపాయాలు రూ.20కోట్లు
  • సాంస్కృతిక రంగం రూ.94.98కోట్లు
  • ఎన్టీఆర్‌ వైద్య సేవలు రూ.1000 కోట్లు
  • వ్యవసాయ విశ్వవిద్యాలయం రూ.357కోట్లు
  • మున్సిపల్‌ శాఖకు రూ.7,761కోట్లు
  • ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.200 కోట్లు
  • పారిశ్రామిక వాణిజ్య విభాగానికి రూ.3,075కో్ట్లు
  • ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ కింద రూ.1000కోట్లు

వ్యవసాయ బడ్జెట్‌ రూ.19,070కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement