టీటీడీపీ ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు | seats alots in telangana assembly | Sakshi
Sakshi News home page

టీటీడీపీ ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు

Published Fri, Mar 11 2016 10:42 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

టీటీడీపీ ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు - Sakshi

టీటీడీపీ ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు

తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సీట్ల కేటాయింపు పూర్తయింది. టీ టీడీపీ ఎమ్మెల్యేలకు ఆరు బ్లాకుల్లో సీట్లను కేటాయించారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సీట్ల కేటాయింపు పూర్తయింది. టీ టీడీపీ ఎమ్మెల్యేలకు ఆరు బ్లాకుల్లో సీట్లను కేటాయించారు. బ్లాక్ 1 ఐదో వరుసలో మంచి రెడ్డి కిషన్ రెడ్డి, బ్లాక్ 2 నాలుగో వరుసలో మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి, బ్లాక్ 3 మొదటి వరుసలో తలసాని శ్రీనివాస్ యాదవ్కు సీట్లు కేటాయించారు.

ఇక, అదే బ్లాక్ 3లోనే రెండో వరుసలో ఎర్రబెల్లి దయాకర్ రావు, సాయన్న, నాలుగో వరసలో రాజేందర్ రెడ్డికి సీటు కేటాయించారు. బ్లాక్ 4 మూడో వరుసలో ధర్మారెడ్డి, ఆరెపుడి గాంధీ, మాగంటి గోపినాథ్, నాలుగో వరుసలో వివేకానంద, బ్లాక్ 5 రెండో వరుసలో ప్రకాశ్ గౌడ్కు సీట్లను కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement