బడ్జెట్‌ సమావేశాలు.. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా | AP Assembly 2nd Day Budget Session 2024 Updates | Sakshi
Sakshi News home page

AP: రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.. సీఎం జగన్‌ పూర్తి ప్రసంగం

Published Tue, Feb 6 2024 8:11 AM | Last Updated on Tue, Feb 6 2024 7:18 PM

AP Assembly 2nd Day Budget Session 2024  Updates - Sakshi

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్‌ పూర్తి ప్రసంగం

విశ్వసనీయత ఎప్పటికైనా గెలుస్తుంది: సీఎం జగన్‌

  • చంద్రబాబు కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తారు
  • వాగ్దానాలు అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకి లేదు
  • మనసు లేని నాయకుడు.. మోసం చేసే నాయకుడు చంద్రబాబు
  • చేయలేనివి చెప్పకూడదు.. మాట ఇస్తే తప్పకూడదు
  • ఒక్క అబద్ధం ఆడని కారణంగా ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నా
  • అలివి కానీ హామీలిచ్చి వాటి అమల్లో దారుణంగా విఫలమైనందుకు, అన్ని వర్గాల వారిని మోసం చేసినందుకు 2019లో 175 స్థానాల్లో కేవలం 23 స్థానాలు మాత్రమే బాబుకు దక్కాయి.
  • మాట మీద నిలబడ్డాం కాబట్టే ప్రజలు 151 స్థానాలు కట్టబెట్టారు
  • ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు గెలిపించి గుండెల్లో పెట్టుకున్నారు
  • విశ్వసనీయతకు అర్థం జగనే
  • విశ్వసనీయత ఎప్పటికైనా గెలుస్తుంది
  • 99 శాతం హామీలు అమలు చేశాం
  • జరిగిన మంచిపై ప్రతి ఇంటా చర్చ జరగాలి

అలా ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది.. సీఎం జగన్‌

  • ఐదేళ్లలో మ్యానిఫెస్టోలో 99 శాతం హామీలను నిబద్ధతతో అమలు చేశాం. హామీల అమలుపై ప్రజల చేతనే శెభాష్‌ అనిపించాం
  • 2014లో చంద్రబాబు నాయుడు కూటమికి వచ్చిన ఓట్లు, మనకు వచ్చిన ఓట్లు ఎంతని పరిశీలిస్తే
  • ఒక్క శాతం ఓట్లు  మాత్రమే తేడా కనిపిస్తుంది.
  • 46 శాతం వాళ్లకొచ్చాయి. మనకు 45 శాతం వరకూ వచ్చాయి.
  • రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇద్దామని చాలామంది శ్రేయోభిలాషులే సలహా ఇచ్చారు.
  • అయితే చేయలేదని చెప్పకూడదు. మాట ఇస్తే తప్పకూడదని వాళ్లందరికీ చెప్పా
  •  ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా.. ఆ ఒక్క రోజు అధర్మం చేయని కారణంగా ఒక్క శాతం ఓట్ల తేడాతో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.

బాబును నమ్మడం అంటే..

  • సీఎం జగన్‌ నోట మళ్లీ బంగారుకడియం-పులి ప్రస్తావన
  • వాగ్దానాలు అమలు చేసే ఉద్దేశమే ఆయనకు లేదు
  • అమలు చేసిన చరిత్ర అంతకన్నా లేదు
  • రాష్ట్ర ప్రజలకు వినమ్రంగా తెలియజేసేది ఏమిటంటే..
  • బాబు మేనిఫెస్టోను నమ్మడం అంటే బంగారు కడియమిస్తానన్న పులిని నమ్మడమే

సంపద సృష్టించారా.. ఎక్కడ? 

  • రూ.70 వేల కోట్లకే రాష్ట్రం శ్రీలంక అవుతుందని అంటున్న చంద్రబాబు రూ.1.26 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తే ఈనాడు వంటి గోబెల్స్‌ సంస్థలు ‘బాబు సంపద సృష్టిస్తాడు’’ అంటారు.
  • మరి... పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి గతంలో ఏ మేరకు ఆయన సంపద సృష్టించాడో ఒకసారి చూద్దాం...
  • సంపద సృష్టిలో బాబు ట్రాక్‌ రికార్డు...
  • ఆయన ముఖ్యమంత్రి కాక మునుపు వరకూ
  • 1993 వరకూ రాష్ట్రం రెవెన్యూ సర్‌ప్లస్‌
  • ఆ తరువాత ఏ ఏడాదిని తీసుకున్నా (మచ్చుకు పదేళ్లు చూపుతున్నాం) రాష్ట్రం రెవెన్యూ డెఫిషిట్‌
  •  2004లో దివంగత నేత, నాన్నగారు సీఎం అయిన తరువాత మళ్లీ రెవెన్యూ సర్‌ప్లస్‌
  • 2014లో బాబు మళ్లీ ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్లీ రెవెన్యూ డెఫిషిట్‌లోకి వెళ్లిపోయింది,.
  • నిజంగానే బాబు అంత గొప్ప విజనరీ అయితే ఆయన పాలనలో రాస్ట్రం మెరుగుపడి ఉంటే.. ఆయన హయాంలో 
  • దేశం జీడీపీలో మన వాటా 4.47 శాతం.
  •  గత ఐదేళ్లలో 4.82 శాతం భాగస్వామ్యం మనది.
  •  దీన్నిబట్టి చూస్తే ఎవరు సంపద సృష్టించారో స్పష్టంగా తెలుస్తుంది


బాబు వాగ్దానాల ఖర్చెంతంటే.. : సీఎం జగన్‌

  • ప్రజలను  మోసం చేసేందుకే చంద్రబాబు వాగ్ధానాలు ఉంటాయి
  • మనం ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే.. శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు ప్రచారం చేస్తన్నారు
  • చంద్రబాబు కొత్త వాగ్ధానాలకు ఏడాదికి రూ.73 వేల కోట్లు ఖర్చు అవుతుంది
  • ఇప్పటివరకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కలుపుకుంటే రూ.2 లక్షల 26 వేల 140 కోట్లు ఖర్చు అవుతుంది
  • మరి అప్పుడు రాష్ట్రం ఏమవుతుంది?
  • మనం రూ.70 వేల కోట్లకే చాలా కష్టాలు పడుతూంటే బాబు రూ.1.26 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం సాధ్యమేనా?
  • ఇలా మోసం చేయడం, కుట్రలు పన్నడం ధర్మమేనా బాబు!
  • సంపద సృష్టించానని బాబు ప్రతీ మీటింగ్‌లో చెబుతున్నారు
  • చంద్రబాబు సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో రెవెన్యూ లోటు
  • బాబు సంపద సృష్టిస్తే.. రెవెన్యూ లోటు ఎందుకు వస్తుంది?
  • చంద్రబాబు కంటే మన హయాంలోనే ఎక్కువ సంపద సృష్టించాం


ఇదీ తేడా.. సీఎం జగన్‌

  • తల్లికి వందనం అంటూ చంద్రబాబు మరో కొత్త డ్రామా మొదలుపెట్టారు
  • వేరే రాష్ట్రాల్లో ప్రజల్ని ఆకట్టుకున్న వాగ్ధానాల్ని తీసుకొచ్చారు
  • మా హయాంలో ఎవరూ టచ్‌ చేయలని పథకాలు తీసుకొచ్చాం
  • 8 పథకాలకే రూ. 52 వేల కోట్లు ఖర్చు చేశాం
  • 650 వాగ్ధానాలతో గత మేనిఫెస్టో ఇచ్చారు చంద్రబాబు
  • వాటిలో పదిశాతం హామీలే చేశారు

చంద్రబాబు ఇప్పుడు తాజాగా చేస్తున్న ఆరు హామీలను కూడా కలిపితే
    
మహిళా మహా శక్తికి     రూ.36000 కోట్లు
తల్లికి వందనం        రూ.12450 కోట్లు
యువ గళం            రూ.7200 కోట్లు
దీపం పథకం            రూ.4600 కోట్లు
అన్నదాత            రూ.11000 కోట్లు

అన్నీ కలిపితే రూ.73 వేల కోట్లు.

  • వీటికి రద్దు చేయలేని ఎనిమిది పథకాలకు పెడుతున్న ఖర్చు కూడా కలుపు కుంటే మొత్తం 1,26140 వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాలి.

  • డీబీటీ, నాన్‌ డీబీటీలు రెండింటినీ కలిపి తీసుకున్నా రాస్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు మొత్తమ్మీద సంవత్సరానికి 77 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 
  • ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని కొన్ని పథకాలు రద్దు చేయలేదు.
  • పెన్షన్లకు అయ్యే రూ.23600 కోట్లు
  • రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తు    రూ.11,000 ఖర్చు
  • సబ్సిడీ బియ్యం రూ.4600 కోట్లు
  • ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా రూ.4,400 కోట్లు
  • ఫీజ్‌ రీయంబర్స్‌మెంట్‌ రూ.2,800 కోట్లు
  • వసతి దీవెన రూ.2,200 కోట్లు 
  • సంపూర్ణ పోషణ కింద బాలింతలు, గర్భిణులు, ఆరేళ్ల లోపు చిన్నారులకు రూ.2,200 ​కోట్లు
  • గోరుముద్ద కింద పోషకాహారం.. రోజుకో మోనూతో ఇస్తున్నాం - రూ.1,900 కోట్లు
  • ఈ ఎనిమిది పథకాలకు 52,700 కోట్లు ఖర్చు అవుతోంది.
  • వీటిని ఏ ప్రభుత్వం కూడా రద్దు చేయలేవు

బాబు ఏ మేనిఫెస్టో తీసుకున్నా ఇవే మోసాలు: సీఎం జగన్‌

  • ప్రభుత్వం మంచి చేయలేదని నమ్మితే.. ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఏముంది?
  • వీళ్లు ఏ ఒక్కరు కూడా అధికారం అన్నది ప్రజలకు మంచి చేసేందుకు ఉపయోగించుకోవాలని రావడం లేదు.
  • ప్రజలను మోసం చేసేందుకు వీళ్లు దోచుకుని, పంచుకునేందుకు మాత్రమే వీళ్లకు అధికారం కావాలి
  • మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి తొలగించిన ఘనత చంద్రబాబుది
  • పేదలకు మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారు
  • పక్క రాష్ట్రాల్లోని వాగ్ధాలను మేనిఫెస్టోలో పెడుతున్నాడు
  • కనీసం పది శాతం హామీలను కూడా నెరవేర్చలేదు
  • ఏ మేనిఫెస్టో తీసుకున్నా ఇవే మోసాలు కనిపిస్తాయి.
  •  1994, 1999 -2014లో ఇచ్చిన మేనిఫెస్టోల్లోనూ ఇవే మోసాలు కనపడతాయి
  • తొలి సంతకాలు, సామాజిక వర్గాలు, రైతులు, పిల్లలు, అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులకు ఇచ్చిన దాదాపు 655 వాగ్దానాలుచ్చి.. వాటిల్లో పది శాతం కూడా తీర్చకుండా.. మేనిఫెస్టోను మాయం చేశాడంటే పరిస్థితి ఏమిటన్నది ప్రజలు ఆలోచించుకోవాలి
  • ఇలాంటి వ్యక్తిని 2024 ఎన్నికల్లో నమ్మడం కరెక్టేనా అన్నది ప్రజలు ఆలోచించాలి.
  • ఎలాగూ ప్రజలు తమకు అధికారం ఇవ్వరని అనుకుంటన్న చంద్రబాబు గ్యాంబ్లింగ్‌ తరహాలో హామీలిస్తున్నాడు
  • వేర్వేరు రాష్ట్రాల్లోని హామీలను పట్టుకుని పేకాట ఆడటం మొదలుపెట్టాడు

చంద్రబాబు నమ్మే ఫిలాసఫీ ఇదే: సీఎం జగన్‌

  • నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు
  • చంద్రబాబు ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు
  • ఎన్నికల ముందు చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో పెద్ద బుక్‌ తెస్తారు
  • ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుంది
  • ఏ గ్రామానికి వెళ్లినా చంద్రబాబు చేసిందేమీ లేదు
  • చంద్రబాబు పాలన అధ్వాన్నంగా సాగింది

ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి: సీఎం జగన్‌

  • బాబు వయసు 75. రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అయ్యింది. మొదటిసారి సీఎం అయి కూడా 30 ఏళ్లు అవుతోంది.
  • మూడుసార్లు సీఎం అయిన తరువాత కూడా ఇప్పటికి కూడా.. ఫలానా పని చేశా కాబట్టి నాకు ఓటేయండి ఆయన అడగలేకపోతున్నాడు.
  • మరోసారి ఛాన్స్‌ ఇస్తే అది చేస్తా.. ఇది చేస్తా అని మాత్రమే అంటున్నాడు
  • ప్రతి ఒక్కరూ ఈ విషయమై ఆలోచన చేయాలి.
  • బాబు మీ సామాజిక వర్గాలకు చేసిన మేలు ఏమైనా ఉందా? అన్నది కూడా ప్రతి సామాజిక వర్గం కూడా ఆలోచించాలి
  • మేనిఫెస్టో అంటే లావు పుస్తకం పెడతారు వాళ్లు.
  • ప్రతి సామాజిక వర్గానికీ బోలెడన్ని హామీలిస్తాడు.
  • ఎన్నికల తరువాత ఆ మేనిఫెస్టో ఎక్కడికి వెళుతుందో ఎవరికీ తెలియదు. ఆన్‌లైన్‌లోనూ కనిపించదు.

చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చేది.. : సీఎం జగన్‌

  • చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్‌ అయినా గుర్తుకొస్తుందా?
  • బాబు పేరు చెబితే.. ఈనాటికీ గుర్తుకొచ్చేది వెన్నుపోటే
  • చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దైర్యం లేదు
  • చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు
  • చంద్రబాబు ప్రతీ సామాజిక వర్గాన్ని మోసం చేశారు
  • చంద్రబాబు కొత్త కొత్త వాగ్ధానాలతో గారడీ చేస్తున్నారు
  • ఇప్పటికీ చంద్రబాబు ఏం చేశాడో చెప్పి ఓట్లు అడగలేకపోతున్నారు
  • ఇన్ని కుట్రలు, పొత్తులు, కుతంత్రాలు ఎందుకు?

ఆ అవసరం ఏముంది?: సీఎం జగన్‌

  • మనం చేసిన 2,91,000 కోట్ల అప్పును ఒకరు 13 లక్షల కోట్లు అంటారు.. 
  • 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కుటుంబాలకు ఏ మంచి చేయలేదు. ఎక్కడా ఈ విషయాన్ని చెప్పుకోనూ లేడు.
  • ఇటీవలి కాలంలో నేను చేస్తున్న ప్రసంగాల్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నా.
  • పది సంవత్సరాల బ్యాంక్‌ అకౌంట్‌లో బాబు హయాంలో ఒక్క రూపాయి అయినా వారికి చేరిందా అని వాళ్లనే చూసుకోమంటున్నా.
  • అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌ ఉన్నా.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారినా ఎందుకు బాబు హయాంలో ఎక్కువ అప్పులు చేసినా ఎవరికీ లబ్ధి ఎందుకు చేకూర్చలేకపోయారు? 
  •  ఆడబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి చేరాయో ప్రజలు ఆలోచన చేయాలి?
  • ప్రతికూల పరిస్థితుల్లోనూ చిత్తశుద్ధి, పట్టుదల, నిబద్ధతలతో రాష్ట్రంలో రైతన్నలకు, పిల్లలకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, సామాజిక వర్గాల సంక్షేమం కోసం ఎలా అడుగులు ముందుకేసామో చరిత్ర మనల్ని గుర్తుంచుకుంటుంది.
  • కేంద్రం నుంచి ఆశించినంత మేరకు నిధులు రాకపోయినా బాబు చేసిన అప్పులకు వల్లమాలిన వడ్డీ కట్టుకుంటూ.. కోవిడ్‌ కారణంగా ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగినా ఎన్ని కారణాలున్నా.. ఇబ్బందులన్నా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్న లక్ష్యంతో పనిచేశామని,
  • మేనిఫెస్టోలో 97 శాతం హామీలను నెరవేర్చిన పార్టీగా అవతరించాం.
  • ఏ ప్రభుత్వమైనా ఐదేళ్ల పాలనలో ప్రజలకు చెడు చేసిందని కానీ.. మంచి చేయలేదని కానీ, మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయలేదని కానీ ప్రతిపక్షం నమ్మితే.. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది?
  • జాతీయ పార్టీతో, ప్రత్యక్షంగా ఒకరితో, పరోక్షంగా ఇంకొకరితో అవగాహన కుదుర్చుకుని, కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షం ఉందంటే దాని అర్థమేమిటో ఆలోచన చేయాల్సిన అవసరముంది?

ఇంటింటి ఆర్థిక స్థితిని మార్చాం: సీఎం జగన్‌

  • చంద్రబాబు హయాంలో ఏ కుటుంబానికి మంచి జరగలేదు
  • ఆయన హయంలో సంక్షేమ పథకాలు లేవు
  • 14 ఏళ్లు సీఎంగా అనుభవం ఉందని చంద్రబాబు అంటున్నారు
  • రాష్ట్రానికి ప్రజలకు పనికిరాని అనుభవం ఎందుకు?
  • తాను చేయని అభివృద్ధిన తానే చేశానని చం‍ద్రబాబు మాట్లాడడం విడ్డూరం
  • మాకు అనుభవం లేకపోయినా పరిపాలన ఎలా చేయాలో చేసి చూపించాం
  • మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం
  • రూ.2 లక్షల 55 వేల కోట్లు పేదలకు ఇచ్చాం
  • ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే మా తాపత్రయం
  • ఆ ప్రయత్నంలో భాగంగానే ఇంటింటి ఆర్థిక స్థితిని మార్చాం.. పేదలకు అండగా నిలిచాం

చంద్రబాబు ఏనాడూ మంచి చేసింది లేదు: సీఎం జగన్‌

  • కేంద్రం కంటే రెట్టింపు స్థాయిలో బాబు అప్పులు తెచ్చాడు
  • కానీ, ఎక్కువ అప్పులు చేశామని మన మీద అబద్ధాల బ్యాచ్‌ ప్రచారం చేస్తోంది
  • మన హయాంలో కేంద్ర ప్రభుత్వం 6.5 శాతం అప్పులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 5.2 శాతం మాత్రమే
  • ఏ రకంగా చూసినా గత ప్రభుత్వానికి, మనకూ ఎంత వ్యత్యాసముందో చెప్పేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
  • ఈ మాత్రం చేయగలిగామనేందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది
  • జనాలకు మంచి చేశామన్న సంతృప్తి మాకు ఉంది

అంత అప్పుతో మన ప్రయాణం.. : సీఎం జగన్‌

  • విభజన నాటికి రూ.లక్షా 53 వేల కోట్ల అప్పు ఉంటే..
  • చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.4.12 లక్షల కోట్లకు చేరింది.
  • 2019 మే నెల నాటికి 4,12,288 కోట్ల రూపాయలు
  • రూ.4.12 లక్షల కోట్ల అప్పుతో ప్రయాణం ప్రారంభించాం.
  • ఇప్పుడది ఏడు లక్షల కోట్ల పై చిలుకుగా ఉంది.
  • మన హయాంలో ఆర్థిక సంఘం సిఫారసుల కంటే రూ. 366 కోట్లు తక్కువ తీసుకున్నాం
  • ఈనాడు, టీవీ-5, ఆంధ్రజ్యోతి వంటి వాళ్లు మనపై చేసే ఇంకో ఆరోపణ విపరీతంగా అప్పులు చేశారని! హద్దు పద్దూ లేకుండా లక్షల కోట్లు చేసేశారని ఆరోపిస్తూంటారు
  • గ్యారెంటీలతో కలిపి వివిధ సంస్థలు చేసిన అప్పులు.. గ్యారెంటీల్లేని అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే

విభజన నాటికి.. రాష్ట్ర ప్రభుత్వం అప్పు

132000 కోట్లు (రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినవి.. చేసిన అప్పులు కలిపి)

గ్యారెంటీల్లేని ప్రభుత్వ అప్పులు కూడా కలుపుకుంటే మొత్తం అప్పు రూ. 1,53,000 కోట్లు

  • బాబు హయాంలో అప్పులు పెరగింది 21.87 ఏడాదికైతే... మన హయాంలో ఇది 
  • కోవిడ్‌ వల్ల ఆదాయాలు తగ్గినప్పటికీ... ఖర్చులు పెరిగినప్పటికీ.. బటన్‌లు నొక్కినప్పటికీ కూడా బాబు హయాయంలో ఉన్న 21. 87 శాతం అప్పుల పెరుగుదల రేటు ఉంటే మన హయాంలో మాత్రం అది 12.13 శాతం మాత్రమే.
  • అంటే.. అప్పుల పెరుగుదల 12 శాతానికి పరిమితం చేశాం

యెల్లో మీడియా దుష్ఫ్రచారం: సీఎం జగన్‌

  • ఎల్లో మీడియా ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తోంది
  • ఇలాంటి వారిపై మనం యుద్ధం చేస్తున్నాం
  • చంద్రబాబు హయాంలో కంటే.. అభివృద్ధి కోసం అదనంగా మేం అదనంగా ఖర్చు చేస్తున్నాం
  • చంద్రబాబు హయాంలో రూ. 15,227 కోట్లు సగటున ఖర్చు చేస్తే.. మా హయాంలో రూ.17,757 కోట్లు ఖర్చు చేశాం

  • అప్పులపై యెల్లో మీడియా దుష్ఫ్రచారం చేస్తోంది
  • లంచాలు, వివక్ష లేకుండా పారదర్శక పాలన అందించాం
  • రూ.2లక్షల 55 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం
  • నాన్‌ డీబీటీ ద్వారా రూ.లక్షా 76 వేల కోట్లు అందించాం
  • దురదృష్టవశాత్తూ మనకు శత్రువులు ఎక్కువ
  • గోల చేసే వాళ్లు ఎక్కువ.. ఒకే విషయాన్ని మళ్లీమళ్లీ చెబుతూ గందరగోళం సృష్టించే వాళ్లూ ఎక్కువే
  • కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తక్కువని వీరు ఆరోపణలు చేస్తూంటారు. 
  • జగన్‌ కేవలం బటన్‌లు మాత్రమే నొక్కుతూంటారన్నది కూడా అబద్ధం
  • సమర్పించిన అంకెలన్నీ కాగ్‌ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చినవే
  •  కడుతున్న మూడు పోర్టులను కూడా కలుపుకుంటే ఈ మొత్తానికి ఇంకో పన్నెండు వేల కోట్లు చేర్చాల్సి వస్తుంది

ప్రతీ రూపాయి ప్రజలకే: సీఎం జగన్‌

  • రూ.2 లక్షల 55 వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో వేశాం
  • 57 నెలల ప్రయాణంలో ఎక్కడా అవినీతికి తావివ్వలేదు
  • ఎలాంటి వివక్ష లేకుండా ప్రతీ రూపాయి ప్రజలకు చేరుతోంది
  • బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేశాం
  • అయినా ప్రతిపక్షాలు యెల్లో మీడియాతో విష ప్రచారం చేస్తున్నాయి

విభజన నష్టం భారీగానే.. :సీఎం జగన్‌

  • మనది రైతులు, వ్యవసాయంతో కూడిన ఎకానమీ
  • తెలంగాణతో పోలిస్తే ఏపీ ఆదాయం తక్కువ
  • రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టారు
  • విభజన కారణంగా ఏటా రూ.13 వేల కోట్లు నష్టపోయాం
  • ఈ ఐదేళ్లలో లక్ష కోట్ల అదనపు ఆదాయం కోల్పోయాం
  • కనీస చట్టంలోనూ ఆ వెసులుబాటు కల్పించలేదు

ఆ లోటు ఇప్పటికీ వెంటాడుతోంది: సీఎం జగన్‌

  • గత ప్రభుత్వ విధానాల వల్ల కూడా బాగా నష్టం జరిగింది
  • ఆర్థిక వ్యవస్థ కుదేలు అయ్యింది
  • గత ప్రభుత్వ విధానాల వల్ల విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి రంగాలు కుదేలయ్యాయి
  • రైతులను చంద్రబాబు మోసం చేశారు
  • ఐదేళ్లలో చంద్రబాబు రైతులకు రూ.15వేలకోట్లు కూడా ఇవ్వలేదు
  • పొదుపు సంఘాల వడ్డీ కూడా మాఫీ చేయలేదు
  • ప్రతీ రాష్ట్రానికి ఒక ఎకనామిక్‌ పవర్‌ హౌజ్‌ ఉండాలి
  • అలాంటి పవర్‌హౌజ్‌ లేకపోతే  రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవు
  • ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయాం
  • రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోంది
  • రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిపోయింది
  • అందుకే విశాఖ గురించి పదే పదే చెబుతున్నా
  • రాష్ట్రం ఆర్థికంగా ఎదగడానికి పెద్ద పెద్ద నగరాలు అవసరం
  • ఓ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలి

ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించలేదు: సీఎం జగన్‌

  • 2015-19 మధ్య కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా కేవలం 31.5 శాతమే
  • 15వ ఆర్థిక సంఘం 41 శాతం సిఫారసు చేసిన మనకు 31 శాతం మాత్రమే దక్కింది.
  • బాబు హయాంలో 35 శాతం వరకైనా తగ్గింది. మేము అధికారంలోకి వచ్చేటప్పటికీ బాగా తగ్గిపోయాయి. 
  • కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా గత ఐదేళ్లలో..  
  • 2018 - 19లో 32780 వేల కోట్లు వస్తే
  • 2019- 20లో 28000 కోట్లు
  • 2020-21 - 24000 కోట్లకు 
  • 2021-22 - 36 వేల కోట్లు
  • 2023-23లో 38 000 కోట్లకు చేరుకుంది
  • కరోనా కారణంగా రెండు ఆర్థిక సంవత్సరాలు తీవ్రంగా నష్టపోయాం
  • ఆదాయం తగ్గడంతో పాటు ఖర్చులూ పెరిగాయ్‌
  • కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గాయ్‌
  • ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు

ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఐదేళ్లు పాలించాం: సీఎం జగన్‌

  • కరోనా కారణంగా ఆదాయం తగ్గింది
  • మూడేళ్లలో రాష్ట్రం 66 వేల కోట్లు ఆదాయం నష్టపోయింది
  • కోవిడ్‌ మహమ్మారి వల్ల అనూహ్యంగా కొన్ని ఖర్చులు పెరిగిపోయాయి. 
  • ఈ ఐదేళ్లలో చూసిన అనూహ్య పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వాటా (డెవల్యూషన్స్‌) తగ్గిపోవడం ఒకటి. చంద్రబాబు పాలన కాలంతో పోలిస్తే ఈ ఐదేళ్లలో మన రాష్ట్రంతోపాటు అన్ని రాష్ట్రాలకూ తగ్గాయి. 

  • రాష్ట్రానికి అత్యంత కీలకమైన వ్యవసాయం, విద్య, మహిళ సాధికారిత వంటి రంగాలపై గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం, ప్రజలపై ఎంతో తీవ్ర ప్రభావం పడింది
  • ఈ కష్టాలను కూడా ఎదుర్కొని ఐదేళ్లు పాలన సాగించాం
  • కరోనా వల్ల మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు నష్టపోయాయి
  • రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి మనల్ని రెవెన్యూ లోటు వెంటాడుతోంది. అయినా సరే.. ఈ ఐదేళ్లలో సుపరిపాలన అందించగలిగాం.

జూన్‌లో మళ్లీ బడ్జెట్‌ పెడతాం: సీఎం జగన్‌

  • సంప్రదాయం ప్రకారం.. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం ఈ సమావేశాల్లో తెలపనున్నాం  
  • జూన్‌లో కొలువుదీరబోయే మన ప్రభుత్వం.. ఇదే సభలో మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్‌ సమర్పిస్తుంది
  • ఇప్పటిదాకా ఐదు ప్రజా బడ్జెట్‌లు ప్రవేశపెట్టాం 
  • ప్రతిపక్షం వేస్తున్న నిందలు.. వాస్తవాలేంటన్నది ప్రజలకు వివరించబోతున్నాం
  • కఠినమైన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చాం
  • ఈ ఐదు సంవత్సరాల్లో అనూహ్య పరిస్థితులెన్నో చూశాం.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం
  • నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కరోనా లాంటి సంక్షోభం ఎప్పుడూ రాష్ట్రం చవిచూడలేదు
  • గత ప్రభుత్వ పాలన ప్రభావం కూడా రాష్ట్రంపై కనిపించింది
  • ఈ పరిస్థితులన్నీ అధిగమించి గొప్ప పాలన అందించాం

సీఎం జగన్‌ పాలనతో పేదరికం తగ్గింది

  • సీఎం జగన్‌ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగింది
  • సీఎం జగన్‌ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు
  • రూ.2 లక్షల 53 వేల కోట్లు పేదల ఖాతాలో వేశారు
  • సీఎం జగన్‌ పాలనతో పేదరికం తగ్గింది
  • మీకు మంచి జరిగితేనే నాకు అండగా నిలబడండి అని సీఎం జగన్‌ చెప్పారు
  • నాయకత్వం అంటే సీఎం జగన్‌ది
  • నాయకుడికి ఉండాల్సిన లక్షణం చంద్రబాబుకి లేదు
  • ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలో ప్రతిపక్షం ఆలోచిస్తోంది

శాసనసభలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి 

ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ధృడ సంకల్పంతో సీఎం జగన్‌ పనిచేస్తున్నారు: జక్కంపూడి రాజా

  • వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ పేదలకు చేయూత ఇచ్చారు.
  • ఆపై రాజశేఖర్‌రెడ్డి గారి మరణ తర్వాత మళ్లీ వెనుకబడ్డామనే భావన కల్గింది
  • 2009 నుంచి 2019 వరకూ గడ్డు పరిస్థితుల్నే ఎదుర్కొన్నాం
  • 2014లో చంద్రబాబు నాయుడు ఏదో రకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవాలని దురాలెచనతో 650 హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు.
  • ఆపై ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు చంద్రబాబు
  •  ఆ తరుణంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను జగన్‌ చూశారు.
  •  అందుకోసం సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన జగన్‌.. ప్రజల కష్టాలను తెలుసుకున్నారు
  • అప్పట్నుంచి పేదవాడి కష్టాలను తీర్చాలనే లక్ష్యంతో పని చేస్తున్న నాయకుడు సీఎం జగన్‌
  • జగన్‌ ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచీ నేటి వరకూ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ధృడమైన సంకల్పంతో పని చేస్తున్నారు

స్పీకర్‌పై టీడీపీ సభ్యులకు గౌరవం లేదు: అబ్బయ్య చౌదరి

  • తొడలు కొడితే కుర్చీరాదు.. ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది
  • విలువలేకుండా ఏదో మాయ మాటలు చెప్పాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి
  • పేదల కోసం ఆలోచించి, పేదల కోసం జీవించే ప్రభుత్వం మనది
  • పేదలకు అండగా ఉండాలనే సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న సీఎం జగన్‌ చూసి చాలా ఆనందంగా ఉంది
  • నిజమైన నాయకుడు అనేవాడు ప్రజల అభివృద్ధిపైనే ఫోకస్‌ చేస్తాడు
  • అదే సీఎం జగన్‌ చేస్తున్నారు
  • అంబేద్కర్‌ను వ్యక్తిలా కాకుండా సిద్ధాంతంలా తీసుకుని ముందుకు వెళుతున్న నాయకుడు సీఎం జగన్‌
  • విద్యా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మార్చి పిల్లలకు మేనమామలా ఉన్న వ్యక్తి మనం సీఎం జగన్‌
  • హెల్త్‌ కేర్‌ను ప్రతీ పేదవాడికి అందిస్తున్న నాయకుడు సీఎం జగన్‌
  • ప్రతీ ఒక్కరికి హెల్త్‌ కేర్‌ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లోనే సాధ్యం కాలేదు..  కానీ పేదవారికి వైద్యం అందించాలనే ఆలోచన చేసిన నాయకుడు సీఎం జగన్‌
  • ఆరోగ్యశ్రీని రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది
  • జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఎంతో గొప్పది
  •  ఆరోగ్యానికి పేదవాడి చేతిల్లో నుంచి డబ్బు ఖర్చు పెట్టకూడదని ఆలోచన చేసిన నాయకుడు సీఎం జగన్‌
  • ఈరోజు పేదవాడికి మెరుగైన వైద్యం అందుతుంటే అందుకు కారణం సీఎం జగన్‌

  • టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం
  • పదే పదే స్పీకర్‌ కుర్చీ దగ్గరకు వచ్చి ఆందోళన చేయడం అనైతికం
  • ప్రజలకు తెలియ చేయాల్సిన విషయాలను పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారు
  • టీడీపీ సభ్యులు సాక్షాత్తు స్పీకర్‌పై దాడి చేయడం విలువల్లేని రాజకీయాలకు నిదర్శనం

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

  • టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్‌ చేసిన స్పీకర్‌
  • పదే పదే స్పీకర్‌ పోడియాన్ని చుట్టిముట్టి ఆందోళన సృష్టిస్తున్న నేపథ్యంలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌

మళ్లీ స్పీకర్‌ పోడియంను చుట్టిముట్టిన టీడీపీ సభ్యులు

  • అసెంబ్లీలో స్పీకర్‌ చాంబర్‌ వైపు దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు
  • స్పీకర్‌ చాంబర్‌ వైపు దూసుకెళ్లి.. విజిల్స్‌వేస్తూ టీడీపీ సభ్యుల రగడ
  • సభలో గందరగోళం సృష్టించి సభా సమయాన్ని వృథా చేస్తున్న టీడీపీ సభ్యులు
  • రెడ్‌లైన్‌ దాటి స్పీకర్‌చాంబర్‌లోకి వెళ్లిన టీడీపీ సభ్యులు
  • సభా నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ సభ్యుల తీరు
  • సభలో విజిల్స్‌వేస్తూ అనుచితంగా ప్రవర్తిస్తున్న టీడీపీ సభ్యులు

ప్రారంభమైన శాసన మండలి

  • నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై టిడిపి, డీఎస్సీ పోస్టుల సంఖ్యపై పీడీఎఫ్‌ వాయిదా తీర్మానాలు.
  • వాయిదా తీర్మానాలను తిరస్కరించిన ఛైర్మన్
  • పోడియం వద్ద పోస్టర్లతో ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు.
  • గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన మర్రి రాజశేఖర్
  • శాసనమండలి 10 నిమిషాల పాటు వాయిదా

  • టీడీపీ సభ్యుల తీరుతో సభ వాయిదా

టీడీపీ సభ్యులకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు: సుధాకర్‌బాబు

  • టీడీపీ సభ్యులు సభా సంప్రదాయాలను పాటించడం లేదు
  • బలహీన వర్గాలకు చెందిన స్పీకర్‌ను అవమానించారు
  • టీడీపీ సభ్యులు నీచ రాజకీయాలు చేస్తున్నారు
  • పేద విద్యార్థులకు విద్యను చేరువ చేశాం
  • టీడీపీ పాలనలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు
  • సీఎం జగన్‌.. విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశారు
  • విద్యాకానుక కింద రూ. 11,901 కోట్లు అందించాం
  • విద్యా దీవెన కింద రూ. 4, 276 కోట్లు అందించాం
  • రాష్ట్రంలో 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశాం
  • సీఎం జగన్‌ హయాంలో విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు.

  • ఏపీ అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ సవరణ బిల్లుకు ఆమోదం
  • ఏపీ అడ్వకేట్స్‌ అండ్‌ క్లర్క్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ సవరణ బిల్లుకు ఆమోదం

  • గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించిన స్పీకర్‌

స్పీకర్‌పై పేపర్లు విసరడం మర్యాద కాదు: అంబటి రాంబాబు

  • స్పీకర్‌పై టీడీపీ సభ్యుల వ్యవహారశైలి సరికాదు
  • పేపర్లు చింపి ఇలా చేస్తూ స్పీకర్‌ను అవమానిస్తున్నారు
  • మీరు సభా సంప్రదాయాను తప్పుతున్నారు
  • ఇది మర్యాద కాదు
  • మీరు అసలు సభలో ఉండాలనుకుంటున్నారో.. లేదో తేల్చుకోండి
  • ఇలా ప్రతీసారి సభను అడ్డుకోవడం సరికాదు
  • టీడీపీ సభ్యుల మమ్మల్ని రెచ్చగొడుతున్నారు జాగ్రత్త

►అసెంబ్లీకి బయలుదేరిన సీఎం జగన్‌

టీడీపీ నేతలు ఓవరాక్షన్‌

  • సభకార్యకలాపాలకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు. 
  • స్పీకర్‌పై పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు. 
  • స్పీకర్‌ తమ్మినేని పోడియం వద్దకు దూసుకెళ్లి హంగామా. 

►ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి.

జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలు సీఎం వైఎస్ జగన్ పక్షానే ఉన్నారు 

అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద పేర్నినాని కామెంట్స్‌

  • ప్రజలే కృష్ణుల్లాగా జగన్‌ను ముందుకు నడిపిస్తారు
  • జగన్ ఫోటో పెట్టుకొని బాలశౌరి ఎంపీగా గెలిచాడు 
  • ఇప్పుడు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నాడు 
  • జంపింగ్ జపాంగ్ ని వీరుడిలా పవన్ భావిస్తున్నాడు 
  • కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కి లెదు 
  • చిరంజీవి జనరంజక నటుడు 
  • చిరంజీవి కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు పవన్ ఏ పాత్ర పోషించారు 
  • శత్రువులతో షర్మిల చేతులు కలిపారు 
  • బజారుకెక్కి సొంత అన్ననే ధూషిస్తున్నారు
  • జగన్ అనుచరులు చూస్తూ ఊరుకొంటారా 
  • నీతులు చెప్పే ముందు మీ గతాన్ని తలుచుకోండి 
  • తల్లిని తిట్టిన వాళ్ళ పల్లకీ మోసే పవన్‌ని ఏమనాలి 
  • జరగబోయే కురుక్షేత్రంలో పవన్ ది శల్యుడి పాత్ర 
  • పవన్‌ని సీఎంగా చూడాలన్న కార్యకర్త స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాడు 
  • చంద్రబాబు రిజెక్ట్ చేసి బాలశౌరిని పవన్ పక్కకు పంపాడు 
  • పదవులకోసం నేతలు గడ్డికరుస్తున్నారు 
  • నాదెండ్ల మనోహర్ కాళ్ళు పట్టుకొని బాలశౌరి జనసేనలో దూరారు 
  • ఆశ్రయం ,అధికారం ,అర్హత కల్పించిన సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత బాలశౌరికి లేదు 
  • శక్తులన్నీ ఏకమై కౌరవుల్లా వచ్చినా జగన్ లాంటి అర్జునుడిని ఏమీ చేయలేరు 
  • కాపు కులాన్ని పణంగా పెట్టి చంద్రబాబు పల్లకీ మోయవద్దు అని హరిరామ జోగయ్య కూడా లేక రాసారు 
  • హుందాగా వ్యవహరించాలని పవన్ కి సూచించారు 
  • కమ్మలు ,రెడ్లు లాగే అధికారం కోసం పోరాడామని లేఖలో కోరారు 
  • వ్యక్తిత్వ హననం చేస్తూ సీఎం వైఎస్ జగన్‌ని మాట్లాడితే చూస్తూ ఊరుకోము 
  • చంద్రబాబుకి మతిభ్రమించి మాట్లాడుతున్నారు 
  • నన్ను సర్వర్‌లా చంద్రబాబు అభివర్ణించారు
  • పెత్తందారీ చంద్రబాబుకి సర్వర్లంటే అంత చిన్నచూపా

పవన్ అసహాయ రాజకీయ నాయకుడు: మంత్రి చెల్లుబోయిన

  • అసెంబ్లీ మీడియా పాయింట్ మంత్రి చెల్లుబోయిన కామెంట్స్‌
  • ప్రజాక్షేమాన్ని కాంక్షించే వాళ్లే రాజకీయ పార్టీ పెట్టాలి 
  • చిరంజీవి పార్టీ పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారు 
  • తప్పు సరిదిద్దుకొనేందుకే పవన్ పార్టీ పెట్టారనుకొన్నాము 
  • చంద్రబాబు కోసం పార్టీ పెట్టారన్న విషయం బయటపడింది. 
  • లోకేష్ అవినీతి పరుడని మాట్లాడిన పవన్ ఇప్పుడు వారితో అంటకాగుతున్నాడు 
  • ప్రజాసంక్షేమం అందించటంలో సీఎం వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు 
  • పేదరిక నిర్ములనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు 
  • ఎన్టీఆర్ ఫ్యామిలీకి ద్రోహం చేసిన చంద్రబాబుకు పవన్ వంతపాడుతున్నాడు 
  • పేదలకు సాయం చేస్తున్న సీఎం జగన్‌ ఓడిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు 
  • పవన్ అసహాయ రాజకీయ నాయకుడు

►ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సంయుక్త సమావేశాల్లో భాగంగా రెండో రోజు(మంగళవారం) గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ

►ఉదయం తొమ్మిది గంటలకు రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

►తీర్మానంపై చర్చను ప్రారంభించనున్న ఎమ్మెల్యేలు టీజేఆర్‌ సుధాకర్‌బాబు, అబ్బయ్య చౌదరి

►చర్చ అనంతరం సీఎం జగన్‌ ప్రసంగం

►పది గంటలకు శాసనమండలి సమావేశాలు

►గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ

►చర్చను ప్రారంభించనున్న ఎమ్మెల్సీ లు మర్రి రాజశేఖర్, వరుదు కల్యాణి

►బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా తొలి రోజు సోమవారం శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ నజీర్‌ ప్రసంగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement