అన్ని శాఖల అధికారులకు సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశం
హైదరాబాద్: వివిధ శాఖలకు సం బంధించి శాసనమండలి, శాసనసభల గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని వివిధ శాఖ ల ఉన్నతాధికారులను సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. పెండింగ్, జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల ని బుధవారం సచివాలయంలో సూచిం చారు. ప్రతి శాఖ నుంచి నోడల్ అధికారిని నియమించుకొని అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకునేలా చూడాలన్నారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికా రులందరూ అందుబాటులో ఉండాలన్నా రు. ఆర్థిక శాఖ సర్క్యులర్ ప్రకారం అవుట్ కమ్ బడ్జెట్, డిమాండ్ ఫర్ గ్రాంట్లను వేర్వేరుగా తయారు చేయాలన్నారు. సీఎం సూచనలమేరకు రాష్ట్రానికి కేంద్రం నుంచి అత్యధిక నిధులు రాబట్టేలా ప్రయత్నించా లని అధికారులకు సూచించారు. ప్రాయోజిత పథకాలకు ఆర్థిక శాఖలో నోడల్ అధికారిని నియమిస్తున్నామని, ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తామన్నారు.
పెండింగ్ ప్రశ్నలకు సమాధానాలివ్వండి
Published Thu, Mar 9 2017 1:15 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
Advertisement