Nodal officer
-
పోస్టల్ బ్యాలెట్ వివాదం.. నోడల్ అధికారి సస్పెన్షన్
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ వివాదానికి సంబంధించి నోడల్ అధికారిని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. బాలాఘాట్ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ముందే పోస్టల్ బ్యాలెట్లను తెరిచినందుకు సంబంధించి పోస్టల్ నోడల్ అధికారిని సస్పెండ్ చేసినట్లు మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనుపమ్ రాజన్ మంగళవారం తెలిపారు. సస్పెండ్ అయిన అధికారిని తహసీల్దార్ హిమ్మత్ సింగ్‌గా గుర్తించారు. ‘బాలాఘాట్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించలేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్రమబద్ధీకరించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే ఇది జరిగింది. సమయానికి ముందే బ్యాలెట్ బాక్స్ తెరవడంలో విధానపరమైన లోపం సంభవించింది. దీనికి బాధ్యుడైన పోస్టల్ నోడల్ అధికారి సస్పెండ్ చేయడం జరిగింది’ అని ఎన్నికల ప్రధాన అధికారి రాజన్ చెప్పారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను ఓటు వేయడానికి అనుమతించడం లేదన్న రాజకీయ పార్టీల ఆరోపణపై ఆయన స్పందిస్తూ.. రాష్ట్రంలో సుమారు 3.23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని సీఈవో రాజన్ తెలిపారు. డిసెంబరు 3న రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. -
ప్రతి జగనన్న కాలనీకి నోడల్ అధికారి నియామకం
నక్కపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ అన్ని సదుపాయాలతో కూడిన ఇల్లు ఉండాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. గురువారం ఆయన విశాఖ జిల్లాలో జగనన్న కాలనీల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరు ఉత్తర్వులతోపాటు నిధులను, మెటీరియల్‌ను కూడా ఇస్తున్నట్లు వివరించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ బాధ్యతలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రతి కాలనీకి మండల స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారన్నారు. లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చిన లేఅవుట్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఒక్కో లబ్ధిదారునికి సుమారు రూ.30 వేల విలువైన ఇసుకను ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
దెబ్బకు దిగొచ్చిన ట్విట్టర్, గ్రీవెన్స్ ఆఫీసర్ ఎవరంటే..
Twitter Grievance Officer భారతీయ ఐటీ చట్టాలకు లోబడి పని చేసేందుకు ఇంతకాలం ససేమిరా అంటోన్న ట్విట్టర్ బెట్టు వీడింది. భారత్‌లో ట్విట్టర్ గ్రీవెన్స్ ఆఫీసర్‌గా వినయ్ ప్రకాశ్‌ను నియమించింది. ట్విట్టర్ అధికారిక వెబ్సైట్లో ఈ విషయాన్ని పేర్కొంది. సోషల్ మీడియాకు సంబంధఙంచి ఇటీవల కేంద్రం కొత్త ఐటీ చట్టాలను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టాల ప్రకారం మూడు కీలక పోస్టులైన చీఫ్ కంప్లైయిన్స్, గ్రీవెన్స్, నోడల్ అధికారులను నియమించాలని చెప్పింది. కాగా ట్విట్టర్ భారతీయులు కానీ వ్యక్తులను ఈ పోస్టులో నియమించి వివాదానికి తెర తీసింది. తాజాగా ఓ మెట్టు దిగి వచ్చిన ట్వీట్టర్ కేంద్ర సూచనలకు తగ్గట్టుగా గ్రీవెన్స్ ఆఫీసర్‌గా భారతీయున్ని నియమించింది. -
అదనంగా 17 వేల వైద్య సిబ్బంది సిద్ధం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకొని 46198 బెడ్లు సిద్ధం చేసినట్లు కోవిడ్- 19 టాస్క్‌ఫోర్స్ నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ప్రతి జిల్లాలో 5 వేల బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ఈ మేరకు బెడ్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కోవిడ్ సమాచారానికి సంబంధించి 1902 కాల్ సెంటర్ పని 24 గంటలు నిరంతరాయంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. కోవిడ్ ఆస్పత్రుల్లో మరిన్ని సౌకర్యాలు పెంచే దిశగా ప్రభుత్వం ఐఏఎస్ అధికారి రాజమౌళిని నియమించిందని.. ఆయనతో పాటు అర్జా శ్రీకాంత్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ కన్నబాబు కలిసి పని చేస్తారన్నారు. ఇక వైరస్ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా కోవిడ్ కేర్ సెంటర్ల సామర్థ్యం పెంచుతున్నట్లు కృష్ణబాబు తెలిపారు. అక్కడ ఉన్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు తెలుసుకొనేందుకు వీలుగా హెల్ప్ డెస్క్ పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. అదే విధంగా కోవిడ్ సెంటర్లలో పెట్టే భోజనం, శానిటేషన్, మందులు, మరుగుదొడ్లు, పరిశుభ్రత వంటి తొమ్మిది అంశాలపై ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని తెలిపారు. సిబ్బంది ఏమాత్రం అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. (అట్టడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యం: సీఎం జగన్) ‘‘ప్రతి కోవిడ్ సెంటర్ నుంచి ప్రతి రోజు 5 నుంచి 6 మంది దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాము. రానున్న రోజుల్లో మెరుగైన సదుపాయాల కోసం 17000 మంది వైద్య సిబ్బందిని అదనంగా సిద్ధం చేశాము. కోవిడ్ వలన చనిపోయిన వారి అంత్యక్రియల కోసం 15000 ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన సమయంలో 20 మంది, పెళ్లిళ్లకు 50కు మించి మంది హాజరయ్యేందుకు అనుమతి లేదు. నిబంధనలకు మించి గుమిగుడితే పోలీసులు చర్యలు తీసుకుంటారు’’ అని కృష్ణబాబు పేర్కొన్నారు. -
పాజిటివ్ ఉన్నా లక్షణాల్లేవా!
సాక్షి, అమరావతి: కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం తదితర లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మందికి వైరస్ సోకినా ఆ లక్షణాలేవీ కనిపించవు. ఆ తర్వాత కోలుకుంటారు. అయితే అలాంటి వారికి ఎలాంటి ప్రమాదం ఉంటుందనే అనుమానాలు పలువురిలో ఉన్నాయి. వీరి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? లక్షణాలు కనిపించని వారికి ఇన్ఫెక్షన్ కారణంగా శరీర భాగాలేమైనా దెబ్బతినే అవకాశం ఉందా.. అన్నదానిపై కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిపై నిపుణులు ఏమంటున్నారంటే.. ► అసింప్టమాటిక్ (ఎలాంటి లక్షణాలు కనిపించని) వారు కంగారుపడాల్సిన పనిలేదు. కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నందునే అది ప్రభావం చూపలేకపోయిందని అర్థం. ► శ్వాసకోశ సమస్య ఉంటే తప్ప వారికి ఆస్పత్రి వైద్యం అవసరం లేదు. ఇంట్లో ఉండి వైద్యం చేసుకుంటే సరిపోతుంది. ► ఇలాంటి వారి నుంచి వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. వైరస్ సోకిన 10 రోజుల్లోపే అలాంటి వారి నుంచి వైరస్ ఇతరులకు సోకుతుంది. ఆ తర్వాత అది బలహీన పడిపోతుంది. ► ఎలాంటి వైద్యమూ లేకుండానే కోలుకున్నా వారి శరీర భాగాలేవీ దెబ్బతినవు కోలుకునే అవకాశాలే ఎక్కువ చాలామంది అసింప్టమాటిక్ వ్యక్తులు తమకు పాజిటివ్ అని తెలిశాక డీలా పడుతున్నారు. వీళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడాల్సిన పనిలేదు. మిగతా వారితో పోలిస్తే వీరికి త్వరగా కోలుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. – డా.రాంబాబు,నోడల్ ఆఫీసర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ -
పల్లెలు మెరవాలి
సాక్షి, రంగారెడ్డి : 30రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పంచాయతీల ప్రత్యేక కార్యాచరణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్ సూచించారు. పల్లెలను పరిశుభ్రంగా, పచ్చదనంగా తీర్చిదిద్దడమే అందరి లక్ష్యం కావాలన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 30 రోజుల ప్రణాళిక కార్యాచరణపై జిల్లాస్థాయి అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. ప్రతి మండలానికి నియమించిన ప్రత్యేక నోడల్ అధికారి.. చేయాల్సిన పనుల జాబితాను రూపొందించుకోవాలన్నారు. పూర్తిచేసిన పనుల వివరాలను ఎప్పటికప్పుడు డీపీఓకు తెలియజేయాలన్నారు. ప్రతిఇంటి ఆవరణలో నాటుకునేందుకు వీలైన మొక్కలను అందజేయాలన్నారు. వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందించి గ్రామసభల ఆమోదం తీసుకోవాలని సూచించారు. ఈ ప్రణాళికను అనుగుణంగానే బడ్జెట్ రూపొందించాలని చెప్పిన ఆయన.. అప్పులు, జీతాలు, కరెంటు బిల్లుల చెల్లింపు ఖర్చులను వ్యయం పద్దులో చూపెట్టాలన్నారు. ప్రతి ఇంటికి, ఆస్తికి కచ్చితమైన విలువ కట్టి క్రమం తప్పకుండా ఆస్తుల విలువ మదింపు చేయాలన్నారు. దీనికి అనుగుణంగా పన్నులు వసూలు చేయాలన్నారు. ప్రత్యేక నోడల్ అధికారుల నియామకం.. పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళిక రూపొందించి అమలు చేసేందుకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక నోడల్ అధికారులుగా నియమించారు. 21 గ్రామీణ మండలాలకు ఒకరి చొప్పున నియమిస్తూ ఇన్చార్జి కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. గురువారం ఎంపీడీఓల సమక్షంలో ప్రత్యేక నోడల్ అధికారులు.. అన్ని పంచాయతీలకు మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించనున్నారు. ఆమనగల్లు – జి.ప్రశాంతి (జిల్లా ఉపాధి అధికారిణి), అబ్దుల్లాపూర్‌మెట్ – డాక్టర్ సునందారాణి (జిల్లా ఉదాన్యశాఖ అధికారిణి), చేవెళ్ల – డాక్టర్ కేవీఎల్ నర్సింహారావు (జిల్లా పశుసంవర్థకశాఖ అధకారి), ఫరూఖ్‌నగర్– ఓం ప్రకాశ్ (జిల్లా ప్రణాళికాధికారి), చౌదరిగూడం – ఎ.వెంకటరమణ (వయోజన విద్యాశాఖ డీడీ), కడ్తాల్ – రత్నకల్యాణి (జిల్లా మైనారిటీ అభివృద్ధిశాఖ అధికారిణి), కందుకూరు – సత్యనారాయణరెడ్డి (జిల్లా విద్యాశాఖాధికారి), కేశంపేట –చంద్రారెడ్డి (జిల్లా భూగర్భజలశాఖ అధికారి), కొందుర్గు – జానకిరెడ్డి (జెడ్పీ అకౌంట్స్ ఆఫీసర్), మాడ్గుల – ప్రవీణ్‌రెడ్డి (గనులశాఖ అధికారి), మహేశ్వరం – రాజేశ్వర్‌రెడ్డి (జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం), మంచాల – దివ్యజ్యోతి (ఆత్మ పీడీ), మొయినాబాద్ – గీతారెడ్డి (జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి), శంకర్పల్లి –ప్రశాంత్‌కుమార్ (డీఆర్డీఓ), శంషాబాద్ – బోజరాజు (మెప్మా పీడీ), తలకొండపల్లి – వెంకట్రాంరెడ్డి (డీఆర్డీఏ అదనపు పీడీ), ఇబ్రహీంపట్నం – సుకీర్తి (మత్స్యశాఖ అధికారిణి), షాబాద్ – అంజయ్య (జిల్లా సహకారశాఖ అధికారి), కొత్తూరు–ఛాయాదేవి (మార్కెటింగ్ శాఖ ఏడీ), నందిగామ–ఎన్.మోతీ (జిల్లా సంక్షేమాధికారిణి), యాచారం – జ్యోతి (మార్క్‌ఫెడ్ డీఎం)లను ప్రత్యేక నోడల్ అధికారులుగా నియమితులయ్యారు. మార్గదర్శకాలు జారీ.. పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళిక అమలులో కీలకమైన కోఆప్షన్, పంచాయతీ స్థాయీ సంఘాల కమిటీలను నియమించేందుకు ఇన్చార్జి కలెక్టర్ మార్గదర్శకాలు జారీచేశారు. ఒక్కో జీపీకి ముగ్గురు చొప్పున కోఆప్షన్ సభ్యులు, నాలుగు చొప్పున స్టాండింగ్ కమిటీలను నియమించాలని సూచించారు. వీటి నియామకంలో పాటించాల్సిన నిబంధనలను పేర్కొంటూ ఎంపీడీఓలకు సర్క్యులర్ జారీచేశారు. -
బలవంతంగా మా పెళ్లిని అడ్డుకున్నారు
కడప అర్బన్ : కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు సాయినగర్‌లో ఉంటున్న ఎం.రాజ్‌కుమార్ తాను వివాహం చేసుకున్న ఎం.శిరీషాతో కలిసి వచ్చి.. తమకు న్యాయం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో వారు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ తమ పరిస్థితి వివరించారు. తాను పెద్దల సమక్షంలో ఈ ఏడాది ఏప్రిల్ 19న వివాహం చేసుకునేందుకు నిశ్చయం చేసుకోగా.. ముందు రోజు 18న రాత్రి 11 గంటల సమయంలో చైల్డ్ హోం నోడల్ ఆఫీసర్ సి.రామకృష్ణారెడ్డి, వీఆర్ఏ వెంకటేశ్వర్లు, వీఆర్వో సాల్మన్లు తదితరులు వచ్చి తమ వివాహాన్ని నిలుపుదల చేశారన్నారు. పెళ్లికుమార్తె వయసు నిర్ణీత వయసు కంటే తక్కువగా ఉందని, నిలుపుదల చేశారన్నారు. ఆమె 2000 ఫిబ్రవరి 22న జన్మించినట్లుగా ఆధార్ కార్డులో ఉందని, ఈ ప్రకారం మేజర్ అయిందని ఎంత చెప్పినా వినకుండా వారు వివాహాన్ని నిలిపి వేశారన్నారు. తాము చూపించిన ఆధారాల గురించి పట్టించుకోకుండా వివాహాన్ని రద్దు చేశారన్నారు. కానీ వివాహం ఆగిపోయినందుకు ఆ సమయంలో తాము తీసుకొచ్చిన లక్షన్నర మేరకు వస్తువులతోపాటు అంతకు ముందే లక్షన్నర మేరకు మొత్తం మూడు లక్షల రూపాయలు వృథాగా ఖర్చయ్యాయన్నారు. దీంతో తాము ఆర్థికంగా నష్టపోయమామని, మానసికంగా వేదన భరించామని చెప్పారు. తర్వాత పెద్దల సమక్షంలోనే వివాహం చేసుకున్నామన్నారు. తాము న్యాయవాది ద్వారా నోటీసులు వారికి పంపించినా స్పందన రాలేదన్నారు. కావున తమరు న్యాయం చేసి తగిన నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు రాజ్‌కుమార్, అతని సతీమణి శిరీష విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పర్మినెంట్ లోక్ అదాలత్‌లో సమస్యను పరిష్కరిస్తామని సూచించారు. -
7 రోడ్ల ప్రాజెక్టుకు నోడల్ ఆఫీసర్లు
కేంద్రం నుంచి రూ.3,370 కోట్లు మంజూరు: సీఎం సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడు రోడ్ల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నోడల్ అధికారులను నియమిం చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుధవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రి అయ్యన్నపా త్రుడుతో కలసి సీఎం చంద్రబాబు రహదా రులు, భవనాల శాఖపై సమీక్ష జరిపారు. అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే, కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజిసర్కిల్ ఫ్లైఓవర్, అమరావతి ఔటర్ రోడ్, విజయ వాడ–గుండుగొలను ప్రాజెక్టు(ఆరు వరుసల విజయవాడ బైపాస్, విజయవా డ–మచి లీపట్నం 4 వరుసల రోడ్డు), గుంటూరు– నరసరావుపేట (పేరేచర్ల సెక్షన్ 544డీ), బీచ్ కారి డార్ ప్రాజెక్టు (భీముని పట్నం–భోగాపురం)లను ఈ నోడల్ అధికారులు పర్యవేక్షించేలా చూడాలన్నారు. కన్సల్టెంట్లను నియమించుకుని ఉత్తమ రోడ్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రానికి కేంద్రం రూ.3,370.33 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కాగా సీఎం సింహాచలం భూముల వివాదానికి ముగింపు పలికేలా చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ అధికారుల సమీక్షలో ఆదేశించారు. -
పెండింగ్ ప్రశ్నలకు సమాధానాలివ్వండి
అన్ని శాఖల అధికారులకు సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశం హైదరాబాద్: వివిధ శాఖలకు సం బంధించి శాసనమండలి, శాసనసభల గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని వివిధ శాఖ ల ఉన్నతాధికారులను సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. పెండింగ్, జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల ని బుధవారం సచివాలయంలో సూచిం చారు. ప్రతి శాఖ నుంచి నోడల్ అధికారిని నియమించుకొని అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకునేలా చూడాలన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికా రులందరూ అందుబాటులో ఉండాలన్నా రు. ఆర్థిక శాఖ సర్క్యులర్ ప్రకారం అవుట్ కమ్ బడ్జెట్, డిమాండ్ ఫర్ గ్రాంట్లను వేర్వేరుగా తయారు చేయాలన్నారు. సీఎం సూచనలమేరకు రాష్ట్రానికి కేంద్రం నుంచి అత్యధిక నిధులు రాబట్టేలా ప్రయత్నించా లని అధికారులకు సూచించారు. ప్రాయోజిత పథకాలకు ఆర్థిక శాఖలో నోడల్ అధికారిని నియమిస్తున్నామని, ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తామన్నారు. -
విభజన పనుల పర్యవేక్షణకు నలుగురు నోడల్ ఆఫీసర్లు
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటు, విభజన పనులను పర్యవేక్షించేందుకు నలుగురు జిల్లా స్థాయి అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. వారితో కలెక్టరేట్లో ప్రత్యేక నోడల్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఒక్కో అధికారికి కొన్ని విభాగాల బాధ్యతలు అప్పగించారు. ఆయా శాఖల్లోని ఫైళ్ల విభజన, ఉద్యోగుల కేటాయింపు, సామగ్రి కేటాయింపు వంటి అంశాలపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు నోడల్ ఆఫీసర్లకు నివేదించాలి. హన్మకొండ, మానుకోట, జయశంకర్, యాదాద్రి, సిద్ధిపేట జిల్లాలకు కేటాయింపుల వివరాలను ఆయా అధికారులు పర్యవేక్షిస్తారు. ఎప్పటికప్పుడు పంపకాల వివరాలను ప్రభుత్వం రూపొందించిన వెబ్సైట్లో పొందుపర్చడంతో పాటు, వాటికి సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తారు. ఈవిధంగా జిల్లాల విభజన ప్రక్రియను సర్కారు వేగవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. ఆన్లైన్లో వివరాల నమోదుకు సంబంధించి బుధవారం కలెక్టరేట్లో ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అధికారుల వివరాలివీ.. l కృష్ణవేణి – ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి – 9490787847 l దేవేందర్‌రావు – జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి – 8886882097 l సురేష్ – ఎస్సీ కార్పొరేషన్, ఈడీ – 9849905987 l గోపాల్‌రావు – సెట్వార్ సీఈఓ – 9849909081 -
అన్ని శాఖలకు నోడల్ అధికారులు
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పలు శాఖల విభజనకు సంబంధించి సమాచారం అధికారులు కోరినవి ధంగా అందజేసేందుకు ప్రతి శాఖకు ఒక నోడల్ అధికారిని నియమించారు. వీరు ఆయా శాఖల్లోని పాత ఫైళ్లు ఒక్కో జిల్లా కు ఒక కాపీ చొప్పున జిరాక్స్ తీయించడం, స్కానింగ్ కాపీని భద్రపరచడం, కీలకమైన కోర్టు కేసుల ఫైళ్ల వివరాలు ప్రత్యేకం గా నమోదు చేసుకోవడం, అవసరమైన ఫైళ్లు డివిజన్లు, మండలాలకు పంపిణీ చేసేలా పనులు చేయించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా నియమించిన ఇద్దరు అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఎఫ్ఎస్వో కృష్ణవేణి, సహకార అడిట్ అధికారి కరుణాకర్‌కు నోడల్ అధికారులు అందజేయాల్సి ఉంటుంది. -
స్వైన్ ఫ్లో.. జాగ్రత్తలు పాటించండి..
సాక్షి, మంచిర్యాల : రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఆరేళ్ల క్రితం రాష్ట్రాన్ని వణికించిన ఈ మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. ఈ వ్యాధితో ఆయా జిల్లాలో మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇందులో భాగంగానే జిల్లాకు స్వైన్‌ఫ్లూ నివారణ నోడల్ అధికారిని నియమించారు. ఇదిలా ఉంటే.. స్వైన్‌ఫ్లూపై ఇప్పటికే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. చలికాలం కావడం.. జలుబు వైరస్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉండడం.. స్వైన్‌ఫ్లూ కూడా అదే కోవాకు చెందడంతో ముందస్తు చర్యలు తీసుకుంటోంది. అందుకే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బంది హెచ్1ఎన్1 వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది. వీటికితోడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామీణ ప్రాంతాల్లో ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, ఐసీడీఎస్, ఏఎన్ఎంలతో విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ఎక్కైడె నా వ్యాధి లక్షణాలు కనిపిస్తే సదరు రోగికి తక్షణ చికిత్స అందించేలా సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో తీవ్రత ఎక్కువగా ఉండడంతో.. జిల్లా నుంచి అక్కడికి వెళ్లే వారి సంఖ్య భారీగానే ఉంది. ఎంతో మంది అక్కడే స్థిరపడ్డమే కాకుండా.. తరచూ ఇక్కడికి వస్తూ పోతున్నారు. అలాంటి వారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి రుక్మిణమ్మ సూచించారు. వ్యాధి లక్షణాలున్నట్లు అనుమానం వస్తే.. వెంటనే సమీప ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. స్వైన్‌ఫ్లూ అంటే..? తెల్ల పందిలో దాగి ఉండే స్వైన్‌ఫ్లూ వైరస్ మనిషి శరీరంలో ప్రవేశిస్తుంది. స్వైన్ అంటే పంది. ఫ్లూ అంటే ఇన్ఫ్లూయెంజ విభాగానికి చెందిన వైరస్‌తో వ్యాప్తి చెందే జలుబు. ఈ రకమైన వైరస్ తరచూ తనలో ఉన్న జన్యువులను ఇతర వైరస్‌లతో మార్చుకోవడంతో కొత్త రకం వైరస్లు పుట్టుకొచ్చి ఫ్లూ జ్వరం కలుగజేస్తుంటాయి. పంది శ్వాసకోశ వ్యాధికి కారణమయ్యే ఒక వైరస్‌లోని జన్యువులతో పోలి ఉంటుంది. పందుల్లో ఉండే వైరస్ తన యాంటి జెనిక్ స్వరూపాన్ని మార్చుకుని మనుషుల్లో వ్యాప్తి చెందడంతో స్వైన్‌ఫ్లూగా పేరుపెట్టారు. ‘ఇన్‌ఫ్లూయెంజా ఏ’ రకానికి చెందిన వైరస్ కేవలం మనుషుల నుంచి మనుషులకే సంక్రమిస్తుంది. స్వైన్‌ఫ్లూను వైద్యులు తమ పరిభాషలో హెచ్1ఎన్1 అని పిలుస్తారు. ఎదుటివారికీ ముప్పే.. చలికాలంలో జలుబు వైరస్లు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్వైన్‌ఫ్లూ కూడా ఇదే తరహాలో వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి గాలి ద్వారా సంక్రమిస్తుంది. బాధిత రోగి జాగ్రత్తలు పాటించకపోతే అది ఎదుటి వారికీ సంక్రమించే ప్రమాదం ఉంది. దగ్గు, తుమ్ము వస్తే.. తుంపర్లు ఎదుటివారిపై పడకుండా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. చేతులపై తుంపర్లు పడితే.. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఫ్లూ సోకిన వారి నుంచి ప్రజలు దూరంగా ఉండాలి. లక్షణాలు.. వ్యాధి సోకిన వ్యక్తికి ఇది ఫ్లూ జ్వరంలాగే కనిపిస్తుంది. వ్యాధి సోకిన వారు తీవ్ర జ్వరం, జలుబు (ముక్కు నుంచి నీరు కారుతుంది), గొంతులో ఇన్ఫెక్షన్, తలనొప్పి, చలి, శరీర నొప్పులు, దగ్గు, నీరసం, అలసటతో బాధపడతారు. వాంతులు, విరేచనాలు అయినప్పుడు స్వైన్‌ఫ్లూగా అనుమానిస్తారు. సాధారణంగా జ్వరం మూడు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది. కానీ స్వైన్‌ఫ్లూ రోగికి ఎక్కువ రోజులు ఈ లక్షణాలు కనిపిస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో చిన్నారుల్లో ఈ జబ్బు శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. శ్వాస తీసుకోవడం, చర్మం నీలిరంగుగా మారడం, నీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకోకపోవడం, త్వరగా నిద్రలేవలేకపోవడం, జ్వరం తగ్గినా, దగ్గు తగ్గదు. పెద్దలలో ఆయాసం, ఛాతి, పొట్టలో నొక్కేస్తున్నట్లు నొప్పి, వాంతులు ఉంటే స్వైన్‌ఫ్లూ వెంటనే పరీక్ష చేయించుకోవాలి. విదేశాల్లో ఉండి వచ్చిన వారికి అప్పుడే వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు వెలుగులోకి వచ్చే వీలుంటుంది. వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఫిబ్రవరిలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
కలెక్టర్ ఇలంబరితి ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 12వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంటుందని, ఇందుకు సహకరించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ కె. ఇలంబరితి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞాసమావేశమందిరంలో సమావేశంలో మా ట్లాడారు. గతంలో కొత్తగూడెంలో నిర్వహించిన ఆర్మీ ఎంపికలు విజయవంతమయ్యాయని, అదే విధంగా ర్యాలీకి యువకులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా చూడాలని సూచించారు. జనరల్ డ్యూటీ సోల్జర్స్, టెక్నికల్ సోల్జర్స్, క్లర్క్ సోల్జర్స్, నర్సింగ్ అసిస్టెంట్ సోల్జర్స్, ట్రేడ్స్మెన్సోల్జర్స్ల ఎంపికలు ఉంటాయని తెలి పారు. ఎంపికైన వారికి సికింద్రాబాద్‌లో ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు డాక్యూమెంట్ల పరిశీలన చేస్తారన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు వారికి కేటాయించిన విధులు నిర్వహించి న ఆర్మీ రిక్రూట్ మెంట్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ డెరైక్టర్ కల్నల్ అనిల్ కుమార్ రోహిల్లా, అదనపు సంయుక్త కలెక్టర్ బాబూరావు, జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాశ్ నారాయణ, డ్వామా, డీఆర్డీఏ పీడీలు జగత్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్‌లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి. భానుప్రకాశ్ పాల్గొన్నారు. -
‘రూసా’ అమలుకు త్వరలో నోడల్ ఏజెన్సీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) పథకాన్ని అమలు చేసే నోడల్ ఏజెన్సీని నాలుగైదు రోజుల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాము నోటిఫై చేసే విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో రూసా పథకాన్ని అమలు చేస్తామని, ఆ విభాగం ఆధ్వర్యంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖకు తెలియజేయనుంది. విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ మేరకు దృష్టి సారించారు. రాష్ట్ర విభజన జరగకముందు రూసా అమలుకు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. అయితే విభ జన జరిగిన నేపథ్యంలో ఇటీవల ఏపీ ఉన్నత విద్యా మండలి ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు వేర్వేరుగా ప్రతిపాదనలు కేంద్రానికి పంపించింది. ఏపీకి నోడల్ ఆఫీసర్‌గా కళాశాల విద్యా కమిషనర్ వ్యవహరిస్తారని పేర్కొంది. అయితే కళాశాల విద్యా కమిషనర్‌ను నోడల్ ఆఫీసర్‌గా పేర్కొనడం పట్ల అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఉన్నత విద్యా మండలికే ఆ బాధ్యతలు అప్పగించాలని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించి పథకం అమలుకు ఎవరు నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారనే విషయాన్ని కేంద్రానికి తెలియజేయలేదు. త్వరలోనే నోడల్ ఆఫీసర్‌ను నోటిఫై చేస్తూ కేంద్రానికి పంపించాలని నిర్ణయించారు. ఆ బాధ్యతలను ప్రస్తుత తెలంగాణ కళాశాల విద్య కమిషనర్‌కే అప్పగించే అవకాశం ఉంది. అయితే ఆ బాధ్యతలను తెలంగాణ ఉన్నత విద్యామండలికే అప్పగించాలనే వాదన ఉంది. త్వరలోనే ప్రభుత్వం దీనిపై నిర్ణయం ప్రకటించనుంది. ఆ తర్వాత రూసా కింద నిధులు విడుదల కానున్నాయి. ఇక రూసా కింద రాష్ట్రలో మూడు కొత్త యూనివర్సిటీలు, రెండు క్లస్టర్ యూనివర్సిటీలు, 4 కొత్త మోడల్ డిగ్రీ కాలేజీలు, మరో 4 డిగ్రీ కాలేజీలను మోడల్ డిగ్రీలుగా అప్‌గ్రేడ్ చేయడం, 7 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రతిపాదించారు. ఒక్కో కాలేజీని రూ.26 కోట్లతో గజ్వేల్, కరీంనగర్, నిజామాబాద్, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, వరంగల్‌లో (మహిళ) ఏర్పాటు చేయనున్నారు. -
నేడు ఓట్ల లెక్కింపుపై శిక్షణ
నక్కలగుట్ట, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ ఆఫీసర్, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ జె.శంకరయ్య తెలిపారు. మోతీ లాల్, రామకృష్ణారెడ్డి శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి ఐదుగురు అధికారులకు ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. -
ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
కలెక్టరేట్,న్యూస్‌లైన్: అదనంగా వచ్చి న ఈవీఎంలను సోమవారం జిల్లాకేంద్రంలోని రెవెన్యూ సమావేశపు హాల్లో ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గిరిజాశంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల వారీ గా పోలింగ్ బృందాల ఎంపికకు నిర్దేశించిన జాబితా ప్రకారం మూడోదశ ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టామన్నారు. జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలో 213 పోలింగ్ బృందాలు, నారాయణపేటలో 219 , గద్వాలలో 251, మహ బూబ్‌నగర్‌లో 250, జడ్చర్లలో 215, దేవరకద్రలో 244, మక్తల్‌లో 236, వన పర్తిలో 252, అలంపూర్‌లో 242, నాగర్‌కర్నూల్‌లో 235, అచ్చంపేటలో 247, కల్వకుర్తిలో 238, షాద్‌నగర్‌లో 215, కొల్లాపూర్‌లో 214 పోలింగ్ బృందాలను ర్యాండమైజేషన్ ద్వార నిర్ధారించామన్నారు. ర్యాండమైజేషన్ వివరాలను రిటర్నింగ్ అధికారులకు సమాచారం అందించనున్నామని చె ప్పారు. అదనంగా15 శాతం ఈవీఎంలను అందుబాటులో ఉంచినట్లు తెలి పారు. కార్యక్రమంలో ఎస్పీ నాగేంద్రకుమార్, సాధారణ ఎన్నికల పరిశీ లకులు వేద ప్రకాష్‌సింగ్, హృదయ్ శంకర్తివారీ, అబ్రహం, ట్రైనీ కలెక్టర్ విజయరామరాజు, డీఆర్ఓ రాంకిషన్, తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ రోజు సెలవు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పో లింగ్ జరగనున్న బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి గిరిజాశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ గెజిట్ 165ను విడుదల చేస్తూ 30వ తేదీ సెలవు ప్రకటించినట్లు పే ర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు మే 1న ప్రత్యేక క్యాజువల్ సెల వును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. వెబ్ కాస్టింగ్‌కు హాజరుకావాలి లైవ్ వెబ్ కాస్టింగ్ శిక్షణ పొందిన ఇంజనీరింగ్ విద్యార్థులు, మీసేవ ఆపరేటర్లు ల్యాప్‌టాప్, పాస్‌ఫోటోతో మంగళవారం ఉదయం 9 గంటలకు వారివారి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నోడల్ అధికారిని (డిస్ట్రిబ్యూషన్ సెంటర్) సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.