కలెక్టర్ ఇలంబరితి ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 12వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఉంటుందని, ఇందుకు సహకరించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ కె. ఇలంబరితి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞాసమావేశమందిరంలో సమావేశంలో మా ట్లాడారు. గతంలో కొత్తగూడెంలో నిర్వహించిన ఆర్మీ ఎంపికలు విజయవంతమయ్యాయని, అదే విధంగా ర్యాలీకి యువకులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా చూడాలని సూచించారు. జనరల్ డ్యూటీ సోల్జర్స్, టెక్నికల్ సోల్జర్స్, క్లర్క్ సోల్జర్స్, నర్సింగ్ అసిస్టెంట్ సోల్జర్స్, ట్రేడ్స్‌మెన్‌సోల్జర్స్‌ల ఎంపికలు ఉంటాయని తెలి పారు. ఎంపికైన వారికి సికింద్రాబాద్‌లో ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.
కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు డాక్యూమెంట్ల పరిశీలన చేస్తారన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు వారికి కేటాయించిన విధులు నిర్వహించి న ఆర్మీ రిక్రూట్ మెంట్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ డెరైక్టర్ కల్నల్ అనిల్ కుమార్ రోహిల్లా, అదనపు సంయుక్త కలెక్టర్ బాబూరావు, జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాశ్ నారాయణ, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు జగత్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్‌లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి. భానుప్రకాశ్ పాల్గొన్నారు.
ఫిబ్రవరిలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
Published Sat, Nov 1 2014 3:49 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM
Advertisement