ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
కలెక్టరేట్,న్యూస్‌లైన్: అదనంగా వచ్చి న ఈవీఎంలను సోమవారం జిల్లాకేంద్రంలోని రెవెన్యూ సమావేశపు హాల్‌లో ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గిరిజాశంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల వారీ గా పోలింగ్ బృందాల ఎంపికకు నిర్దేశించిన జాబితా ప్రకారం మూడోదశ ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టామన్నారు. జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలో 213 పోలింగ్ బృందాలు, నారాయణపేటలో 219 , గద్వాలలో 251, మహ బూబ్‌నగర్‌లో 250, జడ్చర్లలో 215, దేవరకద్రలో 244, మక్తల్‌లో 236, వన పర్తిలో 252, అలంపూర్‌లో 242, నాగర్‌కర్నూల్‌లో 235, అచ్చంపేటలో 247, కల్వకుర్తిలో 238, షాద్‌నగర్‌లో 215, కొల్లాపూర్‌లో 214 పోలింగ్ బృందాలను ర్యాండమైజేషన్ ద్వార నిర్ధారించామన్నారు.
ర్యాండమైజేషన్ వివరాలను రిటర్నింగ్ అధికారులకు సమాచారం అందించనున్నామని చె ప్పారు. అదనంగా15 శాతం ఈవీఎంలను అందుబాటులో ఉంచినట్లు తెలి పారు. కార్యక్రమంలో ఎస్పీ నాగేంద్రకుమార్, సాధారణ ఎన్నికల పరిశీ లకులు వేద ప్రకాష్‌సింగ్, హృదయ్ శంకర్‌తివారీ, అబ్రహం, ట్రైనీ కలెక్టర్ విజయరామరాజు, డీఆర్‌ఓ రాంకిషన్, తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ రోజు సెలవు
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పో లింగ్ జరగనున్న బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి గిరిజాశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ గెజిట్ 165ను విడుదల చేస్తూ 30వ తేదీ సెలవు ప్రకటించినట్లు పే ర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు మే 1న ప్రత్యేక క్యాజువల్ సెల వును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.
వెబ్ కాస్టింగ్‌కు హాజరుకావాలి
లైవ్ వెబ్ కాస్టింగ్ శిక్షణ పొందిన ఇంజనీరింగ్ విద్యార్థులు, మీసేవ ఆపరేటర్లు ల్యాప్‌టాప్, పాస్‌ఫోటోతో మంగళవారం ఉదయం 9 గంటలకు వారివారి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నోడల్ అధికారిని (డిస్ట్రిబ్యూషన్ సెంటర్) సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.