విభజన పనుల పర్యవేక్షణకు నలుగురు నోడల్ ఆఫీసర్లు
Published Thu, Sep 8 2016 1:04 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటు, విభజన పనులను పర్యవేక్షించేందుకు నలుగురు జిల్లా స్థాయి అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. వారితో కలెక్టరేట్‌లో ప్రత్యేక నోడల్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఒక్కో అధికారికి కొన్ని విభాగాల బాధ్యతలు అప్పగించారు. ఆయా శాఖల్లోని ఫైళ్ల విభజన, ఉద్యోగుల కేటాయింపు, సామగ్రి కేటాయింపు వంటి అంశాలపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు నోడల్ ఆఫీసర్లకు నివేదించాలి. హన్మకొండ, మానుకోట, జయశంకర్, యాదాద్రి, సిద్ధిపేట జిల్లాలకు కేటాయింపుల వివరాలను ఆయా అధికారులు పర్యవేక్షిస్తారు. ఎప్పటికప్పుడు పంపకాల వివరాలను ప్రభుత్వం రూపొందించిన వెబ్‌సైట్‌లో పొందుపర్చడంతో పాటు, వాటికి సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తారు. ఈవిధంగా జిల్లాల విభజన ప్రక్రియను సర్కారు వేగవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. ఆన్‌లైన్‌లో వివరాల నమోదుకు సంబంధించి బుధవారం కలెక్టరేట్‌లో ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
అధికారుల వివరాలివీ..
l కృష్ణవేణి – ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి – 9490787847
l దేవేందర్‌రావు – జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి – 8886882097
l సురేష్ – ఎస్సీ కార్పొరేషన్, ఈడీ
– 9849905987
l గోపాల్‌రావు – సెట్వార్ సీఈఓ
– 9849909081
Advertisement
Advertisement