7 రోడ్ల ప్రాజెక్టుకు నోడల్ ఆఫీసర్లు
కేంద్రం నుంచి రూ.3,370 కోట్లు మంజూరు: సీఎం
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడు రోడ్ల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నోడల్ అధికారులను నియమిం చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుధవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రి అయ్యన్నపా త్రుడుతో కలసి సీఎం చంద్రబాబు రహదా రులు, భవనాల శాఖపై సమీక్ష జరిపారు.
అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే, కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజిసర్కిల్ ఫ్లైఓవర్, అమరావతి ఔటర్ రోడ్, విజయ వాడ–గుండుగొలను ప్రాజెక్టు(ఆరు వరుసల విజయవాడ బైపాస్, విజయవా డ–మచి లీపట్నం 4 వరుసల రోడ్డు), గుంటూరు– నరసరావుపేట (పేరేచర్ల సెక్షన్ 544డీ), బీచ్ కారి డార్ ప్రాజెక్టు (భీముని పట్నం–భోగాపురం)లను ఈ నోడల్ అధికారులు పర్యవేక్షించేలా చూడాలన్నారు.
కన్సల్టెంట్లను నియమించుకుని ఉత్తమ రోడ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రానికి కేంద్రం రూ.3,370.33 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కాగా సీఎం సింహాచలం భూముల వివాదానికి ముగింపు పలికేలా చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ అధికారుల సమీక్షలో ఆదేశించారు.