దెబ్బకు దిగొచ్చిన ట్విట్టర్‌, గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ ఎవరంటే.. | Twitter Obey The Centre Government IT Rules And Appointed Vinay Prakash As Grievance officer for India | Sakshi
Sakshi News home page

Twitter: దెబ్బకు దిగొచ్చిన ట్విట్టర్‌, గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ ఎవరంటే..

Published Sun, Jul 11 2021 11:06 AM | Last Updated on Sun, Jul 11 2021 11:44 AM

Twitter Obey The Centre Government IT Rules And Appointed Vinay Prakash As Grievance officer for India - Sakshi

Twitter Grievance Officer భారతీయ ఐటీ చట్టాలకు లోబడి పని చేసేందుకు ఇంతకాలం ససేమిరా అంటోన్న ట్విట్టర్‌ బెట్టు వీడింది. భారత్‌లో ట్విట్టర్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌గా వినయ్‌ ప్రకాశ్‌ను నియమించింది. ట్విట్టర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని పేర్కొంది.

సోషల్‌ మీడియాకు సంబంధఙంచి ఇటీవల కేంద్రం కొత్త ఐటీ చట్టాలను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టాల ప్రకారం మూడు కీలక పోస్టులైన చీఫ్‌ కంప్లైయిన్స్‌, గ్రీవెన్స్‌, నోడల్‌ అధికారులను నియమించాలని చెప్పింది. కాగా ట్విట్టర్‌ భారతీయులు కానీ వ్యక్తులను ఈ పోస్టులో నియమించి వివాదానికి తెర తీసింది. తాజాగా ఓ మెట్టు దిగి వచ్చిన ట్వీట్టర్ కేంద్ర సూచనలకు తగ్గట్టుగా గ్రీవెన్స్‌ ఆఫీసర్‌గా భారతీయున్ని నియమించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement