grievence cell
-
దెబ్బకు దిగొచ్చిన ట్విట్టర్, గ్రీవెన్స్ ఆఫీసర్ ఎవరంటే..
Twitter Grievance Officer భారతీయ ఐటీ చట్టాలకు లోబడి పని చేసేందుకు ఇంతకాలం ససేమిరా అంటోన్న ట్విట్టర్ బెట్టు వీడింది. భారత్‌లో ట్విట్టర్ గ్రీవెన్స్ ఆఫీసర్‌గా వినయ్ ప్రకాశ్‌ను నియమించింది. ట్విట్టర్ అధికారిక వెబ్సైట్లో ఈ విషయాన్ని పేర్కొంది. సోషల్ మీడియాకు సంబంధఙంచి ఇటీవల కేంద్రం కొత్త ఐటీ చట్టాలను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టాల ప్రకారం మూడు కీలక పోస్టులైన చీఫ్ కంప్లైయిన్స్, గ్రీవెన్స్, నోడల్ అధికారులను నియమించాలని చెప్పింది. కాగా ట్విట్టర్ భారతీయులు కానీ వ్యక్తులను ఈ పోస్టులో నియమించి వివాదానికి తెర తీసింది. తాజాగా ఓ మెట్టు దిగి వచ్చిన ట్వీట్టర్ కేంద్ర సూచనలకు తగ్గట్టుగా గ్రీవెన్స్ ఆఫీసర్‌గా భారతీయున్ని నియమించింది. -
కాళ్లు లేకపోయినా..కనికరించలేదు..
సాక్షి, అమరావతి బ్యూరో : అనేక ఇబ్బందులతో తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న ఫిర్యాదుదారులకు నిరాశ తప్పడం లేదు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో సోమవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గ్రీవెన్స్ హాల్ కిటకిటలాడింది. అయితే ఉదయం నుంచి పడిగాపులు పడినా సీఎం దర్శనం లభించకపోవడంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు. తమ బాధలు ముఖ్యమంత్రితో చెప్పుకుందామని ఇక్కడికి వస్తే ఆయన లేరని అధికారులు చెప్పడంతో బాధితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడంపై అక్కడ ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పి. సైదులునాయక్. గుంటూరు జిల్లా అమరావతి నుంచి సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చాడు. రెండేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లూ కోల్పోయాడు. కుటుంబానికి జీవనాధారమైన ఆయన ప్రస్తుతం ఏ పనీ చేసుకోలేని దుస్థితిలో ఉన్నాడు. భార్య, ఇద్దరు పిల్లల పోషణ కష్టంగా మారింది. రుణం అందిస్తే చిన్నపాటి దుకాణం పెట్టుకొని బతకాలని భావించాడు. ఇందు కోసం అధికారులను కలసేందుకు గత ఏడాది నవంబర్ నుంచి సెక్రటరియేట్‌కు వస్తూనే ఉన్నాడు. నెలలో రెండు, మూడు సార్లు వచ్చినా ఆయన గోడు ఆలకించే నాథుడే కరువయ్యారు. ఎంత వేడుకున్నా అధికారులు గ్రీవెన్స్ హాలులోకి పంపించకుండా ఇబ్బంది పెట్టారు. సీఎం వద్దకు పంపించాలని ఎన్నిమార్లు వేడుకున్నా పట్టించుకున్న పాపానపోలేదని సైదులునాయక్ కన్నీరుమున్నీరయ్యాడు. కాళ్లు లేవని కనీసంగా కూడా కనికరించలేదని ఆవేదన చెందారు. పిల్లలను అప్పులు చేసి మరీ చదివించుకుంటున్నాని పేర్కొన్నారు. రోజురోజుకీ కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తనకు ప్రభుత్వం రుణం మంజూరుచేసి ఆదుకొని తన జీవితాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. -
ప్రజా సమస్యలను పరిష్కరించండి..
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా నలుమూలల నుంచి గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చే ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌సెల్‌లో జేసీ వెంకట్రావు ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వచ్చిన కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఫిర్యాదులు స్వీకరించి అధికారులకు పలు సూచనలు చేశారు. పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, వ్యక్తిగత సమస్యలతోపాటు సామాజిక సమస్యలతో ఫిర్యాదుదారులు వచ్చారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల అధికారులతో మాట్లాడిన కలెక్టర్ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని సూచించిన ఆయన.. కొందరు ఫిర్యాదుదారులు మళ్లీమళ్లీ రావడానికి కారకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా సమస్యలను పరిష్కరిస్తే వారికి ఇక్కడి వరకు వచ్చే ఇబ్బంది తప్పుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అందిన ఫిర్యాదుల్లో కొన్ని ఇలా ఉన్నాయి... నూతన భవనాన్ని నిర్మించాలి జిల్లా కేంద్రంలోని పాతపాలమూర్ హరిజనవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి నాయకులు కోరారు. ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితి నెలకొందన్నారు. పాఠశాలలు పునః ప్రారంభమయ్యలోగా నూతన భవన నిర్మాణం సాధ్యం కాకపోతే మరమ్మతులు అయినా చేయించాలని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులకూ వర్తింపజేయాలి ఎకరానికి రూ.4వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయంగా అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు, పోడు రైతులతో సహా సాగుదారులందరికి వర్తింపజేయాలని రైతు సంఘం నాయకులు కోరారు. భూ అ«ధీకృత సాగుదారుల చట్టం 2011 అమలు చేయాలన్నారు. సాగుఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పర్మినెంట్ చేయండి జిల్లాలోని కేజీబీవీలో పని చేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరారు. చాలీచాలనీ వేతనాలతో పని చేస్తున్నందున తమను పర్మినెంట్ చేయాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, కొత్తగా ఏర్పాటు చేసిన కేజీబీవీ సిబ్బంది వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. -
కేబుల్ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో కలెక్టర్ కె.ధనంజయరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఎక్కువగా వ్యక్తిగత వినతులు అందాయి. కార్యక్రమంలో జేసీ కె.వి.ఎన్.చక్రధరబాబు, జేసీ–2 పి.రజనీకాంతారావు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ వారం అందిన వినతులు కొన్ని పరిశీలించగా... ♦ కేబుల్ ఆపరేటర్లకు ఏపీఎస్ ఫైబర్ లిమిటెడ్ కనెక్షన్ ఇవ్వాలని, కేబుల్ ఆపరేటర్లకు అన్యాయం జరగకుండా చూడాలని రణస్థలం మండలానికి చెందిన కే బుల్ ఆపరేటర్లు లంక రమణ, జి.జనా ర్దనరావు, కె.గణపతిరావు, ఎస్.ఖాన్, ఎస్.సూర్యనారాయణ తదితరులు వినతి పత్రం అందించారు. ♦ తనకు రేషన్ కార్డు, ఆధాఆర్ కార్డు, ఇల్లు స్థలం ఉన్నా పక్కా ఇల్లు మం జూరు చేయడం లేదు. పలుమార్లు ప్రజాపతినిధులను, అధికారులను కోరి నా ఫలితం లేదు. తనకు ఇల్లు మం జూరు చేయాలని రేగిడి మండలంలోని బూరాడ గ్రామానికి చెందిన వంజరాపు రమేష్ కోరారు. ♦ ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చినా, సంతకవిటి మండలంలోని మందరాడ, కాకరాపల్లి, చేనేత సొసైటీకి రుణం మాఫీ కావడం లేదని, అక్కడ బ్యాంకర్లు సహకరించడం లేదని ఆ సొసైటీ సభ్యులు ఎన్.ధర్మారావు, బి.సత్యం, కె.మహేష్, కె.నీలయ్య తదితరులు కోరారు. ♦ శ్రీకాకుళం నగరంలోని పశు సంవర్థ క శాఖ జేడీ కార్యాలయం ప్రాంగణంలో గత 30 సంవత్సరాలుగా చెప్పులు కుట్టికొని, చిల్లర వ్యాపారాలు చేనుకొని చిరు దుకాణాలు నడుపుకుంటూ జీవి స్తున్నాం. అయితే అక్కడ కమర్షియల్ కాం ప్లెక్స్‌ను నిర్మించారని, అందులో తమకు షాపులు ఇవ్వాలని అన్నారు. అయితే అధికార పార్టీ నాయకులు ఈ షాపులను అడ్డగోలుగా అమ్మకాలు చేస్తున్నట్టు తెలుస్తోందని, దీనిపై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కె.శంకరరావు, ఎం.వెంకట్రావు, వి.శంకరరావు తదితరులు కోరారు. ♦ జలుమూరు మండలంలోని శ్రీముఖలింగంలో ముఖలింగేశ్వర దేవాల యం అభివృద్ధి చేయాలని, ఈ ప్రాంతా న్ని పర్యటక రంగంలోకి తీçసుకొని అన్ని వసతులు కల్పించాలని, భక్తులకు వస తి గృహాలు, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆ గ్రామానికి చెందిన నాయుడుగారి రాజశేఖర్ వినతి పత్రం అందించారు. ♦ జిల్లాలోని తహసీల్దారు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు శిక్షణ పొందిన లైసెన్సుడు సర్వేయర్లు 78 మంది పనిచేస్తున్నారని, వీరికి ఇప్పటివరకు జీతాలు, గౌరవ వేతనం లేదని, ఇకనుంచైనా గౌరవ వేతనం కల్పించాలని సీహెచ్ ధనరాజ్, కమల్, సీతామహాలక్ష్మి, శరణ్య, రాజు, శ్రీను తదితరులు కోరారు. ♦ ఒకే మరుగుదొడ్డికి రెండు సార్లు బిల్లులు చేశారని, గతంలో ఒకరి పేరిట ఎన్ఆర్ఈజీఎస్ కింద, రెండో సారి మరొకరి పేరిట స్వచ్ఛ భారత్ కింద బిల్లులు పెట్టి చెల్లింపులు చేసి సంబంధిత శాఖ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని లావేరు మండలంలోని నక్కపేట గ్రామానికి చెందిన కొన్ని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. -
మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!
గుంటూరు: మీటరు వడ్డీల కారణంగా తమ కుంటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయని కొందరు.... తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా అప్పు అడిగితే హతమార్చుతానని బెదిరిస్తున్నాడంటూ మరికొందరు..భర్తను గుర్తించి తన కాపురం చక్కదిద్దాలంటూ బాధితులు తమ సమస్యలను విన్నవించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని అర్బన్, రూరల్ ఎస్పీ కార్యాలయాల్లో సోమవారం గ్రీవెన్స్ జరిగింది. అర్బన్, రూరల్ అదనపు ఎస్పీలు వైటీ. నాయుడు, వరదరాజు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. సమస్యలు కొన్ని వారి మాటల్లోనే... ప్లాట్ ఇస్తానని డబ్బు తీసుకున్నాడు బెల్లంకొండలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఏలూరు శ్రీనివాసరావు గుంటూరులోని రాజీవ్ గృహకల్పలో అతడికి ప్లాట్ ఉందని, అది విక్రయిస్తున్నానని చెప్పాడు. అతని మాయమాటలు నమ్మి గతేడాది రూ. 1.70 లక్షలు చెల్లించాను. అప్పట్లో అగ్రిమెంట్ కూడా రాసి ఇచ్చాడు. ప్లాట్ అప్పగించమని అడిగితే అందుకు నిరాకరిస్తున్నాడు. విచారించి న్యాయం చేయాలి. – బి. సీతారామయ్య, బ్రాడీపేట, గుంటూరు టేకు చెట్లను నరికేశారు వారసత్వంగా వచ్చిన రెండున్నర ఎకరాల భూమిలో ఉన్న టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి వేశారు. వాటి విలువ సుమారుగా రూ. 2 కోట్లు ఉంటుంది. నాభూమిని ఆక్రమించుకునే కుట్రలో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ టేకు చెట్లను ప్రభుత్వం ద్వారా నాకు అప్పగించేలా చర్యలు చేపట్టాలి. అక్రమంగా నరికి వేసిన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలి. – పెరుమాళ్ల అహోబలప్రతాప్, సత్తెనపల్లి మీటరు వడ్డీతో అల్లాడుతున్నాం శ్యామలానగర్‌లోని విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్న భాస్కర్‌రెడ్డి వద్ద మా అవసరాల నిమిత్తం ఒక్కొక్కరం రూ. 20వేలు చొప్పున అప్పుగా తీసుకున్నాం. కూలి పనులు చేసుకుంటూ వాటిని తీర్చుకుంటూ వస్తున్నాం. అయితే వడ్డీలకు వడ్డీలు చెల్లించాలని, లేకుంటే మీ అంతు చూస్తానని హెచ్చరిస్తున్నాడు. అతని నుంచి రక్షణ కల్పించాలి.– అంజిబాబు, పూర్ణ, చంటి తదితరులు మంగళదాస్‌నగర్, గుంటూరు -
సమస్యలు పరిష్కరించండయ్యా..
ఒంగోలు టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు జిల్లా ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన మీకోసంలో జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జీఓలు అమలు చేయాలి జిల్లాలోని పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన ఏడురకాల జీఓలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు సీహెచ్ మజుందార్, కార్యదర్శి కె.శ్రీనివాసరావు కోరారు. పర్మినెంట్ పంచాయతీ కార్మికులకు 010 పద్దు కింద జీతాలు చెల్లించేందుకు, టెండర్ విధానం రద్దు చేసి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్టు పద్ధతిన కనీస వేతనం ఇచ్చి వారినే కొనసాగించాలని, ఎన్ఎంఆర్, పార్ట్‌టైం, ఫుల్‌టైమ్ కాంట్రాక్టు పద్ధతిన పంచాయతీల్లో పనిచేస్తున్న అర్హుల జాబితా తయారు చేసి కమీషనరేట్‌కు పంపించడం తదితర వాటికి సంబంధించిన జీఓలను జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి పంపించలేదని పేర్కొన్నారు. నివేశన స్థలాలు కేటాయించాలి చినగంజాం మండలం చినగంజాం, కడవకుదురు, చింతగుంటల గ్రామాల్లో అర్హులైన 400 మందికి నివేశన స్థలాలు ఇవ్వాలని ఇళ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు వేడుకున్నారు. సర్వే నం 828, 128, 129లో ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు. కూలీనాలి చేసుకొని జీవించే తమకు ఇళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో స్థలాలు ఇవ్వమని స్థానిక తహసీల్దార్‌ను వేడుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. మీరైనా న్యాయం చేసి ఇళ్లు ఇప్పించాలని కోరారు. హేచరీలపై చర్యలు తీసుకోవాలి నాసిరకం రొయ్య పిల్లలు తయారు చేస్తున్న హేచరీలపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మండవ శ్రీనివాసరావు, దుగ్గినేని గోపీనా«థ్ కోరారు. తీర ప్రాంతాల్లోని 20 వేల హెక్టార్లలో రైతులు వెనామీ రకం రొయ్య సాగు చేస్తున్నారన్నారు. 36 వెనామీ రకం రొయ్య పిల్లలను తయారు చేసే హేచరీలు ఉన్నాయని, వీటి నుంచి రైతులు రొయ్య పిల్లలను కొనుగోలు చేసి వారి చెరువుల్లో సాగు చేస్తారన్నారు. రెండేళ్ల నుంచి కొన్ని హేచరీలు నాసిరకం రొయ్య పిల్లలు తయారు చేసి రైతులకు అమ్ముతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఒక్కో రైతు ఎకరాకు 3 లక్షల రూపాయల వరకు నష్టపోయారని విచారం వ్యక్తం చేశారు. హేచరీలపై నిఘా ఉంచి నాణ్యమైన రొయ్య పిల్లలను అందించేలా చూడాలని కోరారు. బట్వాడాలు ఆగిపోయాయి మార్కాపురంలోని పలకల కార్మికులను ఆదుకోవాలని మార్కాపురం డిజైన్ స్లేట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. మార్కాపురంలో తీవ్ర కరువు నెలకొన్న నేపథ్యంలో వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పలకల పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. పలకల యజమానులు తాము ఎగుమతి చేసిన సరుకు తాలూకు హెడ్ఫారం సకాలంలో అందజేయలేదన్న సాకుతో పరిశ్రమ బ్యాంకు ఖాతాలను హోల్డ్‌లో పెట్టారన్నారు. దీంతో కార్మికులకు నెల రోజులకు పైగా బట్వాడాలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాణిజ్య పన్నుల శాఖ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అకౌంట్స్‌ను హోల్డ్‌లో పెట్టిందని ఫిర్యాదు చేశారు. మౌలిక వసతులు కల్పించాలి ఒంగోలు నగరం 50వ డివిజన్ జయప్రకాష్ ఎక్స్టెన్షన్ కాలనీలో నివాసం ఉంటున్న తమకు మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు వేడుకున్నారు. తమ కాలనీ ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ దుర్బర జీవితాన్నే గడుపుతున్నామన్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రోడ్డు లేకపోవడంతో గుంటల నుంచి వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నట్లు వాపోయారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్ల మధ్యే మురుగునీరు నిలిచి వ్యాధులు విజృంభిస్తున్నాయన్నారు. తమ కాలనీకి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మిరప పంటను వైరస్ కాటేసింది మిరప పంటకు జెయిని వైరస్ వ్యాపించి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని యర్రగొండపాలెం మండలం వీరభద్రాపురానికి చెందిన రైతులు వాపోయారు. గ్రామంలో 300 ఎకరాల్లో మిరప పంట సాగు చేశామని, పూత పిందె దశలో ఒక్కసారిగా తామర పురుగు, నల్లి, తెల్లదోమ వ్యాపించడంతో పూర్తిగా దెబ్బతిందన్నారు. ఒక్కో రైతుకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 5 క్వింటాళ్లకు మించి రాలేదన్నారు. ఇప్పటికే 100 ఎకరాల్లో పంట తీసివేయడం జరిగిందన్నారు. తమ పంటకు నష్టపరిహారం నమోదు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. -
తీరని వ్యథలు.. కన్నీటి కథలు
అనంతపురం సిటీ: జిల్లాలో దళిత, గిరిజనుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఎదుట వందల మంది బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా ఉన్నతాధికారి మొదలు ఆయా శాఖల అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లినా పరిష్కారానికి నోచుకోవడం లేదని వాపోయారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఆవరణలోని సమావేశ భవనంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రత్యేక గ్రీవెన్స్‌కు వేలాది మంది దళితులు, గిరిజనులతో పాటు ఆయా కుల సంఘాల నేతలు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీతో పాటు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, పరిషత్ చైర్మన్ పూల నాగరాజు, కమిషన్ సభ్యులు రవీంద్ర, సుబ్బరావులు ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. మాదిగలకే అధిక ప్రాధాన్యత ప్రతి ప్రభుత్వ పథకంలోనూ మాదిగలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు నేతలు ఓబులేసు, మరిదయ్యలు కమిషన్‌కు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చే రుణాలు కూడా 82 యూనిట్లకుగాను 73 మాదిగలకే ఇచ్చారన్నారు. 2017లో ఎన్ఎస్కెఎఫ్డీసీ పథకం కింద 6 కార్లు వస్తే...అన్నీ మాదిగలకే ఇచ్చారన్నారు. ఇలా ప్రతి పథకంలో మాదిగలకే ప్రా«ధాన్యతనివ్వడం బాధాకరమని తెలిపారు. తక్షణం అధికారులతో చర్చించి మాలల హక్కులను కూడా కాపాడాలని కోరారు. శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి ఆరోగ్యశాఖలో పనిచేసే కాంట్రాక్టు, పార్టుటైం కింద చేస్తున్న 353 మందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రగత శీల పారిశుద్ధ్య కార్మికుల సంఘం నేతలు కల్లూరి చంగయ్య కమిషన్‌ను కోరారు. అనారోగ్యమే శాపమైంది 2007లో ఆర్టీసీలో కండెక్టర్‌గా చేరిన తాను పక్షవాతముతో మంచాన పడ్డాననీ, ఆరోగ్యం కుదుట పడ్డా పూర్తి స్థాయిలో పనిచేసేందుకు అవయవాలు సహకరించడం లేదని గుత్తికి చెందిన ఆర్టీసీ కండక్టర్ వెంకటేశ్ కమిషన్ ఎదుట వాపోయారు. అతికష్టమ్మీద ఎడమ చేతితో రాయడం నేర్చుకున్నాననీ, అయినా 13 నెలలుగా తనకు డ్యూటీ వేయకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తన కుటుంబ పరిస్థితి అర్థం చేసుకుని రెగ్యులర్‌గా డ్యూటీ వేయించాలని కోరారు. స్పందించిన కమిషన్ సభ్యులు తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీసీలుగా చిత్రీకరించారు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో తనకున్న ఇంటిని బీడీల ఫ్యాక్టరీ యజమానికి తాకట్టు పెడితే... అతను మరొకరికి విక్రయించాడని తాడిపత్రికి చెందిన కాంతమ్మ వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమపైనే దాడి చేశారని కన్నీటిపర్యంతమైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే స్థానిక ఎమ్మార్వోకు డబ్బు ఆశ చూపి మేము ఎస్సీలము కాదని, బీసీలమని సర్టిఫికెట్లు పుట్టించారని కమిషన్ సభ్యులకు విన్నవించింది. స్పందించిన కమిషన్ సభ్యులు తహశీల్దార్‌తో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. ∙ఇక ఆర్టీసీలో 20 మంది నకిలీ ఎస్సీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఓబులేసు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఆర్టీసీ అధికారుల్లో చలనం లేదన్నారు. స్పందించిన కమిషన్ సభ్యులు చర్యలు తీసుకుంటామన్నారు. ∙పోలీసు శాఖలో 2003 హెచ్‌సీ, ఏఎస్ఐల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం చేశారని పోలీసు అధికారుల సంఘం మాజీ అధ్యక్షుడు శివానంద కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించిన కమిషన్ సభ్యులు చర్యలు తీసుకుంటామన్నారు. -
వెలవెలబోయిన గ్రీవెన్స్‌సెల్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈవారం గ్రీవెన్స్‌సెల్‌కు వినతులు తక్కువగా వచ్చాయి. ఖరీఫ్ పనులు, ఎండలు, పుష్కరాల ప్రభావం గ్రీవెన్స్‌సెల్‌పై పడింది. జిల్లా గ్రీవెన్స్‌ను సోమవారం జాయింట్ కలెక్టర్–2 పి.రజనీకాంతారావు నిర్వహించారు. ఆయనతో పాటు సెట్‌శ్రీ సీఈఓ మూర్తి తదితరులు పాల్గొన్నారు. – నకిలీ గిరిజన ధ్రువ పత్రాలతో సంక్షేమ శాఖతో ఉద్యోగం సంపాదించిన కుమార్ నాయక్‌పై పలుమార్లు దర్యాప్తులో తేలినా, మరలా కొనసాగిస్తున్నారని కుల నిర్మూలన పోరాట సమితి ప్రతినిధులు బెలమర ప్రభాకర్, తదితరులు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నాయకులకు ఉద్యోగులు వత్తాసు పలికి నకిలీలను అదుకుంటున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. – అగ్రీగోల్డ్ బాధితులను ఆదుకోవాలని, ఏడాదిగా ఉద్యమాలు, వినతులు ఇచ్చినప్పటికి ఇప్పటివరకు ఆ సంస్థలో పనిచేసిన సిబ్బందికి, సంస్థపై నమ్మకంతో దాసుకున్న ఖాతాదారులకు న్యాయం చేయలేదని, ఇప్పటికైనా నగదు ఇప్పించాలని జయసింహ, గోవిందరావు, రఘునాథ్ తదితరులు కోరారు. – ఎచ్చెర్ల మండలంలోని వైశాఖి బహో హేచరీ కంపెనీలో పది సంవత్సరాలుగా పనిచేస్తున్న భగీరథపురం గ్రామస్థులను తొలగించారని, వారిని విధుల్లోకి తీసుకోవాలని ఎం.మన్మథరావు, టి.వేణుగోపాలరావు, రామారావు, ఎంపీటీసీ జి.మల్లేసు కోరారు. – సారవకోట మండలం అర్లి పంచాయతీ సానిమెల్లగెడ్డలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, వీటిని రెవెన్యూ అధికారులు దగ్గరుండి కట్టిస్తున్నారని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన డి.ఆనందరావు, వనజాక్షి, రమణమూర్తి తదితరులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. – శ్రీకాకుళం మండలంలోని లంకాం గ్రామంలో గతంలో వేసిన మెటల్ రోడ్డు పూర్తిగా పాడయ్యిందని, సీఎస్పీ రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని సర్పంచ్ ప్రతినిధి చిట్టి రవికుమార్ ఫిర్యాదు చేశారు. రోడ్డు నిర్మాణానికి 2014లో నిధులు మంజూరైనా, తరువాత వచ్చిన ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ప్రజా సమస్యలను గుర్తించి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. – సంక్షేమ వసతి గృహాల్లో అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న కుక్, కమాటీ, వాచ్మెన్ ఉద్యోగులకు బకాయి జీతాలు చెల్లించాలని, వేసవి, దసరా, సంక్రాంతి సెలవుల్లో జీతాలు చెల్లించాలని ఉద్యోగులు ఎంఏ నాయుడు, రాంబాబు, బాలకృష్ణ తదితరులు కోరారు. – మూడు చక్రాల వాహనం ఇప్పించాలని జి.సిగడాం మండలం గెడ్డ కంచరాం గ్రామానికి చెందిన బర్రి నీలయ్య కోరారు. లావేరు మండలంలోని గుమడాం పంచాయతీ నాగంపాలెం గ్రామానికి చెందిన జగ్గురోతు సూరమ్మ పింఛను మంజూరు చేయాలని కోరారు. -
మోసగించిన భర్త ఆచూకీ కోసం...
కట్టుకున్నోడు వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడు... న్యాయం చేయండంటూ ఓ మహిళ అర్జీ పెట్టుకున్నా స్పందన లేదు. రాజమండ్రి లింగంపేటకు చెందిన రామలక్ష్మి అనే వివాహిత న్యాయం చేయాలంటూ ఇటీవల రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ అధికారిని గ్రీవెన్స్ సెల్లో వేడుకుంది. ఆమె అర్జీని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు ఆర్డీఓ సిఫారసు చేశారు. రోజు గడుస్తున్నా దీనిపై ఏ పురోగతీ లేదు. త్రీ టౌన్ పోలీసు స్టేషన్లో దీనిపై వివరణ అడిగితే అసలు మాకెలాంటి సమాచారం రాలేదంటున్నారు. తన భర్త రాకకోసం బాధితురాలి ఎదురుచూపులు అలాగే కొనసాగుతున్నాయి... చీపుర్లు అమ్ముకుని జీవనం గడిపే నర్సయమ్మకు ముందూ వెనుకా ఎవరూ లేరు. కుమార్తె రామలక్ష్మితో కలిసి రాజమండ్రిలోని లింగంపేటలో నివసిస్తోంది. వాసం శెట్టి శ్రీను అనే యువకుడు ఏడు నెలల కిందట తనది కాకినాడ అని, తనకు ఎవరూ లేరని చెప్పి వారింట చేరాడు. తమతో సన్నిహితంగా ఉండే రాము అనే వ్యక్తి అతడ్ని పరిచయం చేయడంతో వారు నమ్మారు. శ్రీను తన కూతురిని ఇష్టపడడంతో కుటుంబానికి అండగా ఉంటాడని భావించిన నర్సయమ్మ పశ్చిమగోదావరి జిల్లా గౌరీ పట్నం మేరీ మాత ఆలయంలో గత ఏడాది జూన్ మూడున వారికి పెళ్లి చేసింది. మూడు నెలలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత కథ అడ్డం తిరిగింది. ‘పెళ్లయిన నెలకు లాలాచెరువు ఏరియాకు మారాము. అక్కడ శ్రీను ఒక హోటల్లో పనిచేసేవాడు. తన స్నేహితుడు బాబూరావు, అతని భార్యను ఇంటికి తీసుకు వచ్చేవాడు. వాళ్ల మాటలకు ప్రాధాన్యం ఇస్తూ తరచు నన్ను కొట్టేవాడు. దీంతో మా అమ్మ నన్ను లింగంపేట తీసుకుపోయింది. శ్రీను రాలేదు. అయితే బాబూరావుతో మాత్రం ఫోన్లో మాట్లాడుతున్నాడు. బాబూరావుని అడిగితే శ్రీను ఆచూకీ చెప్పడంలేదు. పైగా విడిపొమ్మని సలహా ఇస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆచూకీ మీరే వెతికి చెప్పండని అంటున్నార’ని బాధితురాలు తెలిపింది.