
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 25న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ అసెంబ్లీ సెక్రటరీ గురువారం జారీ చేశారు.
ఈనెల 23 నుండి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా, 24 నుంచి మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. అలాగే రైతు భరోసా పథకంపై చర్చతో పాటు, జాబ్ కాలెండర్‌ను విడుదల చేయటం వంటి అంశాలను ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment