
న్యూఢిల్లీ: జనవరి 31వ తేదీన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. శుక్రవారం పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థికసర్వేను ప్రవేశపెట్టనున్నారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా చర్చ ఇరు సభల్లో కొనసాగనుంది.
ఫిబ్రవరి ఒకటో తేదీన అంటే శనివారం రోజు మంత్రి నిర్మలా కేంద్ర సాధారణ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ లోక్‌సభలో ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో కొనసాగనుంది. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ మూడు రోజులపాటు కొనసాగనుంది. ఫిబ్రవరి ఆరో తేదీన చర్చపై రాజ్యసభలో ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.