ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్) కింద ఈసారి భారీగా ఖర్చు చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేనంత అధిక మొత్తంలో నిధులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (సబ్‌ప్లాన్) కింద రూ.33,611.06 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్డీఎఫ్)కి రూ.21,306.84 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్‌డీఎఫ్) కింద రూ.12,304.22 కోట్లు చూపించింది. 2020–21తో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.7,304.81 కోట్లు అదనంగా ఖర్చు చేయనున్నారు.
పథకాల పరుగులు...
గతేడాది కోవిడ్–19 వ్యాప్తి వల్ల నెలకొన్న పరిస్థితులతో పలు సంక్షేమ పథకాలు డీలా పడ్డాయి. ప్రస్తుతం ఈ పరిస్థితులను అధిగమిస్తున్నప్పటికీ కొన్ని పథకాల్లో అవాంతరాలు వచ్చాయి. ఈసారి భారీ కేటాయింపులు జరపడంతో సంక్షేమ పథకాల అమలు వేగం పుంజుకోనుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా అమలు చేసే ఆర్థిక చేయూత పథకాలు పరుగులు పెట్టనున్నాయి. అదేవిధంగా ఇదివరకు పెండింగ్‌లో ఉన్న కార్యక్రమాలు సైతం పరిష్కారం కానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక అభివృద్ధి నిధి మొత్తాన్ని సంబం ధిత సంక్షేమ శాఖలు.. ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఖర్చు చేయా ల్సి ఉంటుంది. ఈసారి భారీగా కేటాయింపులు జరపడంతో ఆయా శాఖలు తలపెట్టిన కార్యక్రమాలన్నీ
Comments
Please login to add a commentAdd a comment