sdf funds
-
ఒక్కో గిరిజన గురుకులానికి రూ. 5 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని గురుకుల పాఠశాలలకు అదనపు హంగులు దిద్దాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో 47 గిరిజన గురుకుల పాఠశాలలున్నాయి. ఇవన్నీ శాశ్వత భవనాల్లోనే నిర్వహిస్తున్నప్పటికీ... ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ భవనాల సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో శాశ్వత ప్రాతిపదికన అదనపు గదులు, డారి్మటరీలు, డైనింగ్ హాల్స్ ఏర్పాటు కోసం గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గిరిజనుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న షెడ్యూల్డ్ ట్రైబ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్టీ ఎస్డీఎఫ్) ద్వారా సివిల్ పనులు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేయగా... రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే ఆమోదం తెలిపింది. ఒక్కో పాఠశాలకు రూ. 5 కోట్లు... గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో పాత పాఠశాలల్లో నిర్మాణ పనుల కోసం ఒక్కో గురుకులానికి రూ.5 కోట్లు చొప్పున కేటాయించింది. చాలాచోట్ల తరగతి గదులతో పాటు డార్మిటరీ భవనాల ఆవశ్యకత ఎక్కువగా ఉంది. ఇదివరకు ఒక్కో పాఠశాలలో ఒక తరగతికి ఒక సెక్షన్ మాత్రమే ఉండేది. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యింది. దీంతో పాటు ఇంటరీ్మడియట్ కాలేజీలుగా దాదాపు అన్నీ అప్‌గ్రేడ్ అయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా వసతి లేకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలతో ఇప్పటివరకు నెట్టుకొచ్చారు. తాజాగా ఎస్టీ ఎస్డీఎఫ్ ద్వారా నిధుల లభ్యతకు అనుగుణంగా నిధులు కేటాయించారు. మొత్తం 47 పాఠశాలలకు రూ.235 కోట్లు కేటాయించారు. అతి త్వరలో ఈ పనులకు సంబంధించి టెండర్లు ఖరారు చేసిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు. గిరిజన విద్యార్థుల అడ్మిషన్ల డిమాండ్‌కు అనుగుణంగా 2023–24 వార్షికంలో కొత్తగా మరో రెండు పాఠశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో వీటికి శాశ్వత ప్రాతిపదికన భవనాలను నిర్మించేందుకు ప్రత్యేక నిధులను సైతం కేటాయించింది. ఒక్కో పాఠశాలకు రూ.12కోట్లు చొప్పున రెండింటికి కలిపి రూ.24కోట్లు కేటాయించింది. దీంతో గురుకుల పాఠశాలల నిర్మాణ పనులకు మొత్తంగా రూ.259 కోట్లు ఖర్చు చేయనుంది. గిరిజన ఇంజనీరింగ్ పర్యవేక్షణ... ఎస్టీ గురుకులాల్లో త్వరలో చేపట్టనున్న ఈ సివిల్ పనుల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న గిరిజన ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించింది. టెండర్ల ఖరారు, పనుల కేటాయింపు, పర్యవేక్షణ, నాణ్యత పరిశీలన తదితర పూర్తిస్థాయి బాధ్యతలను గిరిజన ఇంజనీరింగ్ అధికారులే చూసుకుంటారు. గత మూడేళ్లుగా నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో స్తబ్ధుగా ఉన్న గిరిజన ఇంజనీరింగ్ విభాగానికి తాజాగా ఊరట లభించినట్లయింది. -
దళిత అభివృద్ధికి దండిగా..
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) కింద ఈసారి భారీగా ఖర్చు చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేనంత అధిక మొత్తంలో నిధులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (సబ్‌ప్లాన్) కింద రూ.33,611.06 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్డీఎఫ్)కి రూ.21,306.84 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్డీఎఫ్) కింద రూ.12,304.22 కోట్లు చూపించింది. 2020–21తో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.7,304.81 కోట్లు అదనంగా ఖర్చు చేయనున్నారు. పథకాల పరుగులు... గతేడాది కోవిడ్–19 వ్యాప్తి వల్ల నెలకొన్న పరిస్థితులతో పలు సంక్షేమ పథకాలు డీలా పడ్డాయి. ప్రస్తుతం ఈ పరిస్థితులను అధిగమిస్తున్నప్పటికీ కొన్ని పథకాల్లో అవాంతరాలు వచ్చాయి. ఈసారి భారీ కేటాయింపులు జరపడంతో సంక్షేమ పథకాల అమలు వేగం పుంజుకోనుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా అమలు చేసే ఆర్థిక చేయూత పథకాలు పరుగులు పెట్టనున్నాయి. అదేవిధంగా ఇదివరకు పెండింగ్‌లో ఉన్న కార్యక్రమాలు సైతం పరిష్కారం కానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక అభివృద్ధి నిధి మొత్తాన్ని సంబం ధిత సంక్షేమ శాఖలు.. ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఖర్చు చేయా ల్సి ఉంటుంది. ఈసారి భారీగా కేటాయింపులు జరపడంతో ఆయా శాఖలు తలపెట్టిన కార్యక్రమాలన్నీ -
అవినీతికి కేరాఫ్ టీడీపీ
సాక్షి, కడప కార్పొరేషన్: టీడీపీ ఐదేళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్(ఏపీఆర్‌ఐసీ) అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కడప నగరపాలక సంస్థ పరిధిలో ఆ శాఖ ద్వారా సుమారు రూ.30కోట్ల పనులు నామినేషన్ పద్ధతిలో చేపట్టారు. అధికార పార్టీ నాయకులకు కమీషన్లు ముట్టజెప్పి నామమాత్రంగా చేసిన ఆ పనుల్లో నాణ్యత పూర్తిగా కొరవడింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులకు ఆర్థిక పరిపుష్టి చేకూర్చి, వారి జేబులు నింపడానికి అనేక వక్రమార్గాలను అనుసరించింది. విభజన హామీ మేరకు కేంద్రం వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ నిధుల(ఎస్డీపీ)ను ఆ పార్టీ నాయకులు అడ్డదిడ్డంగా దోచుకుతిన్నారు. రాజ్యాంగ బద్ధంగా ప్రజల ఓట్లతో ఎన్నికైన ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) ఇవ్వాల్సి ఉంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్డీఎఫ్ నిధులను ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా వారి చేతిలో ఓటమి పాలైన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిలకు కలెక్టర్ ద్వారా అప్పగించారు. ఇది అప్రజాస్వామికమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అంటున్నా వారి గోడు వినే నాథుడే కరువయ్యారు. ఈ పనులను ఏ డిపార్ట్మెంట్ ద్వారా చేసినా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించాల్సి ఉంటుంది. టెండర్లు నిర్వహించిన పనులకు కాంట్రాక్టర్లు కమీషన్లు ఇవ్వరనే ఉద్దేశంతో, టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూరాలంటే నామినేషన్‌పై పనులు చేసే సంస్థ కావాలని ఏరి కోరి ఏపీఆర్ఐసీని ఎన్నుకున్నారు. దోచుకోవడమే పరమావధిగా ఆర్ఐసీ చేపట్టే ప్రతి పనికి సంబంధించి అంచనా వ్యయంలో 15 నుంచి 20 శాతం టీడీపీ నాయకులకు కమీషన్లుపోగా మిగిలిన మొత్తంతో పూర్తి నాసిరకంగా పనులు కానిచ్చారు. ఆ డిపార్ట్మెంట్లో పరిమిత సంఖ్యలో ఇంజినీర్లు ఉండటం వల్ల పర్యవేక్షణ కూడా సక్రమంగా ఉండేది కాదు. నాణ్యత లేక రోడ్లు, కాలువలు అర్ధాంతరంగా పాడయ్యే పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో పనులు చేయాల్సిన ఆర్ఐసీ సంస్థ పట్టణ ప్రాంతాల్లో చేయడాన్ని కడప నగరపాలక సంస్థలోని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మహీధర్‌రెడ్డి మున్సిపల్‌శాఖ మంత్రిగా ఉన్నపుడు ఆర్ఐసీ శాఖ మున్సిపల్ కార్పొరేషన్లలో పనులు చేపట్టరాదని ఇచ్చిన మెమోను చూపించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కడప నగరపాలక సంస్థ ప్రతిపాదించిన పనులనే టీడీపీ నాయకులు కూడా ప్రతిపాదిస్తున్నారని, దీనివల్ల వర్క్స్ డూప్లికేట్ అవుతున్నాయని వారు లేవనెత్తిన అభ్యంతరాలను టీడీపీ నాయకులకు భయపడి అధికారులు విస్మరించారు. కొన్నిచోట్ల నగరపాలక సంస్థ చేసిన పనులను తామే చేసినట్లు చూపి అధికార పార్టీ నాయకులు ఆర్ఐసీ ద్వారా బిల్లులు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాము చేసిన పనులకు వారు చేసినట్లు చూపి బిల్లులు కూడా చేసుకున్నారని ఆరోపణలు చేశారు. విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేసినా... కడప నగరపాలక సంస్థలో పటిష్టమైన ఇంజినీరింగ్ వ్యవస్థ ఉందని, ఎన్నికోట్ల పనులైనా చేయడానికి, నిర్మాణం తర్వాత తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి కావాల్సిన సిబ్బంది ఉన్నారని, ఆర్ఐసీకి అలాంటివేమీ లేవని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అనేక సర్వసభ్య సమావేశాల్లో వాదించారు. ఇద్దరు, ముగ్గురు ఇంజినీర్లు తప్ప మరెవరూ లేని ఆ సంస్థతో కడపలాంటి నగరంలో పనులు చేయించడం సరికాదని, కార్పొరేషన్ అనుమతి లేకుండా పనులు చేయరాదని తీర్మాణాలు కూడా చేశారు. ఎవరు అభ్యంతరాలు చెప్పినా, ఎన్ని తీర్మాణాలు చేసినా ఆర్ఐసీ అధికారులు వాటిని పట్టించుకోకుండా పనులు చేశారు. ప్రొటోకాల్‌ను కూడా విస్మరించి, మేయర్, ఎమ్మెల్యేలను ఆహ్వానించకుండా ఎలాం టి అధికారిక హోదా, అర్హత లేని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో ప్రారంభోత్సవాలు చేయిం చారు. పూర్తి నాసిరకంగా జరిగిన ఆ పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాల్సిందిగా నగరపాలక వర్గం ఏకగ్రీవ తీర్మానం చేసినా లాభం లేకుం డా పోయింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టినా ఈ పనులన్నీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరగడం వల్ల ఆ విచారణ కూడా ముందుకు సాగలేదు. టీడీపీ కార్యకర్తలకే పనులు చేశారు ప్రభుత్వం మంజూరు చేసినా ఎస్డీపీ, ఎస్డీఎఫ్ నిధులన్నీ 8 మంది టీడీపీ కార్పొరేటర్లు, ఆ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు తప్ప వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు కేటాయించలేదు. ఇది అన్యాయని ప్రశ్నించినా అధికారులు పట్టించుకోలేదు. జనరల్ ఫండ్గానీ, ఇతర కేంద్ర నిధులు ఏమొచ్చినా మేయర్, ఎమ్మెల్యేలు అన్ని డివిజన్లకు సమానంగా పంచి అభివృద్ధి చేశారు. – కె. బాబు, 14వ డివిజన్ కార్పొరేటర్ ప్రజలకు ఉపయోగపడని చోట చేసి జేబులు నింపుకొన్నారు ఆర్ఐసీ వారు కడపలో పనులు చేసేదానికి లేదు. అయినా అధికార బలంతో చేయించారు. టీడీపీ వాళ్లు 15 శాతం కమీషన్లు తీసుకొని, వర్క్‌లు అమ్ముకొని ఇష్టం వచ్చినట్లు పనులు చేసి జేబులు నింపుకున్నారు. ప్రజలు నివాసం ఉన్నచోట కాకుండా లే ఔట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం పనులు చేశారు. – ఇసుకపల్లి చైతన్య, 1వ డివిజన్ కార్పొరేటర్ -
నిధులున్నా.. పనుల్లేవు ∙
సాక్షి, కొత్తపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భవనాలకు ఆర్భాటంగా శంకుస్థాపనలు చేశారే తప్ప భవనాలను మాత్రం నిర్మించలేదు. నియోజకవర్గంలో రూ.2,800 కోట్లతో అభివృద్ధి చేశానని ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యే వర్మ.. ఈ ఐదేళ్ల కాలంలో శంకుస్థాపనలు చేసిన పలు భవనాలను ఇప్పటికీ నిర్మించలేదు. నిధులు విడుదలైనప్పటికీ వాటిని ఎందుకు నిర్మించలేదన్న ప్రశ్నలకు సమాధానాన్ని ఎవరూ చెప్పడం లేదు. నిధులు మంజూరైనా పనులను ప్రారంభించకపోవడంతో సర్వత్రా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే వర్మ వాకతిప్ప పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి 2017 అక్టోబర్ 29తేదీన శంఖుస్థాపన చేశారు. మండల కేంద్రం కొత్తపల్లి పంచాయతీ భవనం నిర్మాణానికి మండల మహిళా సమాఖ్య కార్యాలయం ఖాళీ స్థలంలో 2017 నవంబర్ 19న శంఖుస్థాపన చేశారు. ఈ భవనాల నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఈ రెండు భవనాలకు రూ.15 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. పాత భవనాలను కూల్చివేసి, కొత్త వాటిని నిర్మించకపోవడంతో ఆ కార్యాలయాలు పరాయిపంచన నడుపుతున్నారు. గోర్స గ్రామం శెట్టిబలిజపేటలో కమ్మునిటీ భవనానికి 2016 నవంబర్ 8న ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రూ.5 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టే ఈ భవనాన్ని ఇప్పటికీ నిర్మించలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. -
పర్సంటేజీలే ముద్దు..
పనులన్నీ పప్పుబెల్లాల్లా పంచేసుకున్నారు. పర్సంటేజీలు దండేసుకున్నారు. పనులు మాత్రం అంగుళం కదలని పరిస్థితి.. నియోజకవర్గ ఎమ్మెల్యేల ప్రత్యేక అభివృద్ధి నిధులతో (ఎస్డీఎఫ్) చేపట్టే పనుల్లో పర్సంటేజీల వసూలులో చూపిన శ్రద్ధ్ధ పనుల పురోగతిపై పెట్టకపోవడం వల్లనే పరిస్థితి ఇలా ఉందని చెబుతున్నారు. పైగా నిధులు విడుదల చేయకపోవడంతోనే పనులు జరగడం లేదంటూ కొత్త వాదన తెర పైకి తీసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు పనుల పరిస్థితితో సంబంధం లేకుండా మంజూరైన ఎస్డీఎఫ్ నిధులన్నీ విడుదల చేసేయండంటూ కొత్త కలెక్టర్ కాటంనేని భాస్కర్ హుకుం జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సాక్షి విశాఖపట్నం: ఎమ్మెల్యే గ్రాంట్‌తో చేపట్టే ఎస్డీఎఫ్ పనులు రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా విశాఖ జిల్లాలో నత్తననడకన సాగడమే కాదు.. అత్యంత నాసిరకంగా జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. పార్టీ ఏదైనా ఎమ్మెల్యేలకు మంజూరు చేయాల్సిన ఈ నిధులను ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు ప్రాతిని«ధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్చార్జిల పేరిట విడుదల చేసి టీడీపీ సర్కారు కొత్త సంస్కృతికి తెరతీసింది. ఇలా నియోజకవర్గానికి ఏడాదికి కోటిన్నర నుంచి రూ.2 కోట్ల చొప్పున గడిచిన నాలుగున్నరేళ్లలో జిల్లాకు 108 కోట్లు మంజూరయ్యాయి. వీటికి ఉపాధి హామీ నిధులు రూ.5.13 కోట్లు, ఇతర నిధులు మరో రూ.8.78 కోట్లు జత చేసి మొత్తం 121.91 కోట్లతో 2550 పనులు మంజూరు చేశారు. కానీ ఇప్పటి వరకు ఖర్చు చేసింది అక్షరాల 19.60 కోట్లు మాత్రమే. ఇక పూర్తయిన పనులెన్నో తెలుసా? కేవలం 542. ఈ గణాం కాలు చాలు ఎస్డీఎఫ్ పనులు ఎంత నత్తనడకనసాగుతున్నాయో చెప్పడానికి. నిధులు విడుదలైన వెంటనే పనుల మంజూరులో మాత్రం అత్యుత్సాహం చూపారు. రూ.10 లక్షల చొప్పున నామినేషన్ల పద్ధతిలో పనులను పంచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలనే తేడా లేకుండా దాదాపు ప్రతి ఒక్కరూ 15 శాతం చొప్పున పర్సంటేజీలు దండేసుకున్నారు. కొంతమందయితే 20 శాతం వరకు పిండుకున్నారు. మిగిలిన పనుల్లో 10 శాతం వరకు ముక్కు పిండి వసూలు చేసే అధికారులు ఈ ఎస్డీఎఫ్ పనుల్లో మాత్రం తమ పర్సంటేజీలను 5 శాతం నుంచి 8 శాతానికి కుదించుకున్నారు. కారణం ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిల ముఖ్య అనుచరులు 5 శాతం చొప్పున ఈ పనుల్లో వాటాలు పిండేశారు. ఈ విధంగా మంజూరు చేసిన 121.91 కోట్లలో 25 నుంచి 30 శాతం మేర సంతకం పెట్టగానే పర్సంటేజీలు ఎవరికి వారు దం డేశారు. ఈ విధంగా రూ.30 కోట్ల నుంచి రూ.36 కోట్ల వరకు జేబుల్లో వేసుకున్నారు. పర్సంటేజీలు దండేసుకున్నాం కదా ఇక ఆ పనులతో తమకు సంబంధం ఏమిటన్న ధోరణిలో ఎమ్మెల్యేలు ఉదాశీన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఈ కారణంగానే ఈ పనులు నత్తనడకన సాగుతున్నా పట్టించుకునే నాథులు కరువయ్యారు. ప్రత్యేక అభివృద్ధి నిధులు వినియోగంలో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగున ఉండడం పరిస్థితికి అద్దం పడుతుంది. నత్తను తలదన్నేలా పనుల పురోగతి రాక రాక అధికారం వచ్చింది... దాదాపు ఏడాదిన్నర పోరాటం తో ఎమ్మెల్యేల చేతికి నిధులు వచ్చాయి... ఈ నిధులను స్థానిక సమస్యలకు ఖర్చు చేయడంలో మాత్రం వారు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా అరకు నియోజకవర్గానికి 11.60 కోట్లు మంజూరు కాగా ఈ నిధులతో 587 పనులు మంజూరు చేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 87.67 లక్షల విలువైన 26 పనులు మాత్రమే పూర్తి చేయగలిగారు. పాడేరు, గాజువాక, విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఒక్క పని కూడా పూర్తి చేయలేని దుస్థితి నెలకొంది. ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పాడేరులో 4.67 కోట్లతో 278 పనులు మంజూరు చేశారు. అలాగే గాజువాకలో 4.12 కోట్లతో కేవలం నాలుగు మంజూరు చేశారు. విశాఖ దక్షిణంలో 7.96 కోట్లతో 31 పనులు మంజూరు చేశారు. దక్షిణంలోనే కాదు.. విశాఖ సిటీలో దాదాపు ఏడు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విశాఖ తూర్పులో రూ.9.26 కోట్లతో 41 పనులు మంజూరు చేస్తే కేవలం రూ.17.11 లక్షలతో 11 పనులు పూర్తి చేయగలిగారు. ఇక విశాఖ ఉత్తరంలో 10.44 కోట్లతో 54 పనులు మంజూరు చేస్తే రూ.13.26 లక్షలతో ఒకే ఒక్క పనిని పూర్తి చేయగలిగారు. ఇక విశాఖ పశ్చిమంలో రూ.8 కోట్లతో 71 పనులు మంజూరు చేస్తే రూ.40.40 లక్షల విలువైన నాలుగు పనులు పూర్తి చేయగలిగారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గానికి రూ.5.03 కోట్లతో 36 పనులు మంజూరు చేస్తే రూ.52.94 లక్షల విలువైన నాలుగు పనులు పూర్తి చేయగలిగారు. రూ.9.22 కోట్లతో 153 పనులు మంజూరు చేసిన పెందుర్తిలో రూ.98.55 లక్షల విలువైన 18 పనులు పూర్తి చేయగలిగారు. మిగిలిన నియోజక వర్గాల్లో కూడా పరిస్థితి ఏమంత గొప్పగా లేదనే చెప్పాలి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల జరిగిన జెడ్పీ సమావేశంలో నిధుల విడుదలలో నిర్లక్ష్యం ప్రదర్శించడం వలనే పనులు వేగవంతం కావడం లేదంటూ ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. దీంతో పనుల పురోగతిని పట్టించుకోకుండా మార్చి 31 వరకు మంజూరైన నిధులను ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు విడుదల చేసేయండి అంటూ కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇలా నిధులు మంజూరు చేస్తే పనులు జరగకుండానే నిధులు డ్రా చేసే అవకాశాలు లేకపోలేదని సంబంధిత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎంత ఖర్చు చేశారు?
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీలకోసం అమలుచేస్తున్న ప్రత్యేక అభివృద్ధి నిధుల వినియోగంపై అయోమయం నెలకొంది. 2018–19 వార్షిక బడ్జెట్లో ఈ రెండు కేటగిరీల్లో రూ.26,145 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.16,452 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.9,693 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులను 42 ప్రభుత్వ శాఖల ద్వారా ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందించి లక్ష్యాలు నిర్దేశించింది. వార్షిక సంవత్సరం పూర్తయ్యేలోపు కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాలు ముగిశాయి. ప్రస్తుతం నాల్గో త్రైమాసికం కొనసాగుతోంది. ఈక్రమంలో మూడు త్రైమాసికాలలో వినియోగానికి సంబంధించిన వివరాలను నోడల్ ఏజెన్సీలకు ఇవ్వాలి. కానీ గత ఆర్నెళ్లుగా ప్రత్యేక అభివృద్ధి నిధి ఖర్చుపై అయోమయం నెలకొంది. శాఖల వారీగా లక్ష్యసాధనకు సంబంధించిన వివరాలేవీ నోడల్ ఏజెన్సీలకు ఇవ్వడం లేదు. దీంతో ఈ పద్దు కింద ఎంత ఖర్చు జరిగింది, లక్ష్యాలు ఏమిటనేదానిపై అస్పష్టత నెలకొంది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి పర్యవేక్షణకు ప్రభుత్వం రెండు నోడల్ ఏజెన్సీలను ఏర్పాటుచేసింది. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధినిధి నోడల్ ఏజెన్సీగా ఎస్సీ అభివృద్ధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీగా గిరిజన శాఖను నియమించింది. ఈ శాఖలు ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ సమావేశాలు, నోడల్ ఏజెన్సీ మీటింగ్‌లు, పురోగతిపై సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ఈక్రమంలో ఎస్డీఎఫ్ నిధుల వినియోగంపై స్పష్టత లేకపోవడంతో వినియోగానికి సంబంధించిన సమాచారం సమర్పించాలని పలుమార్లు సూచించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తాజాగా వివరాలు సమర్పించని ప్రభుత్వ శాఖలకు నోటీసులు జారీ చేస్తున్నాయి. త్వరలో నోడల్ ఏజెన్సీ సమావేశం ఉండడంతో ఆలోపు వివరాలు ఇవ్వాలని స్పష్టం చేశాయి. -
సర్కార్ సొంత పెత్తనం..!
► ఎస్డీఎఫ్ నిధుల విడుదలలో వివక్ష ► అధికార పార్టీ ఎమ్మెల్యేలకే నిధుల కేటాయింపు ► ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జికి నిధుల మంజూరు ► ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ ఒంగోలు టూటౌన్: జిల్లాలోని నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించే ఎస్డీఎఫ్ నిధుల విడుదలలో ప్రభుత్వం వివక్ష చూపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు కేటాయించి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అవమానపరుస్తోంది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జిలను నియమించి వారికి ఎస్డీఎఫ్ నిధులు కేటాయించింది. ప్రజలు ఎన్నుకున్న శాసన సభ్యులను పక్కనపెట్టి ఓడిపోయిన తమ పార్టీ వారికి ప్రాధాన్యం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు మంజూరు చేయడమే కాకుండా చేసిన పనిని సమర్థించుకుంటూ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతోంది. ఎస్డీఎఫ్ నిధులకు దరఖాస్తు చేసుకున్న వారికే నిధులు కేటాయించినట్లు సర్కార్ చెప్పడం పలు విమర్శలకు తావిస్తోంది. నియోజకవర్గానికి రూ.4 కోట్లు... ఒక్కొక్క నియోజకవర్గానికి రూ.2 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వీటితో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని అనుసంధానం చేస్తూ మరో రూ.2 కోట్లు జత చేసింది. దీంతో ఒక్కొక్క నియోజకవర్గానికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉన్న వై.పాలెం, ఎస్ఎన్ పాడు, మార్కాపురం, పర్చూరు, కనిగిరి, ఒంగోలు, కొండపి, కందుకూరు, గిద్దలూరు, చీరాల, దర్శి, అద్దంకి నియోజకవర్గాలకు ప్రభుత్వం ఎస్డీఎఫ్ (స్టేట్ డెవలప్మెంట్ ప్లాన్) నిధులు మంజూరు చేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో గిద్దలూరు, అద్దంకి, పర్చూరు, ఎస్ఎన్ పాడు, కొండపి నియోజకవర్గాలకు నిధులు మంజూరయ్యాయి. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.2 కోట్లతో కలుపుకుని మొత్తం రూ.54 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాపై పగబట్టిన సీఎం... అసలే అభివృద్ధిలో వెనుకబడిన ప్రకాశం జిల్లాపై సీఎం చంద్రబాబు పగబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామాయపట్నం పోర్టుని అడ్డుకోవడం, యూనివర్సిటీ ఏర్పాటు, ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమైన వాటిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జిల్లా ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. చివరకు ఎస్డీఎఫ్ నిధుల కేటాయింపులోనూ సొంతపెత్తనం చేస్తున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు నిధులు కాజేసేందుకు సిద్ధమవుతున్నారు. అభివృద్ధి పనులను వాటాల రూపంలో దక్కించుకుంటున్న నేతలు.. నిధులు కాజేసి అరకొరగా పనులు చేసి మమ అనిపిస్తున్నారు. సీఎం తీరుతో జిల్లాకు అన్యాయం జరుగుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు.