
'మాల్యా విషయంలో మేం సీరియస్'
ప్రతి అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు.
న్యూఢిల్లీ: ప్రతి అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం మరోసారి బడ్జెట్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశాలు కూడా మాల్యా, రాష్ట్రపతి పాలన, కరువు వంటి అంశాలతో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కట్టడి చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లబోతున్నారని ఆయనను ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు.
ఈ సమావేశాలు ఉద్రేక పూర్వకంగా ఉంటాయని తాను భావించడం లేదని, రైల్వేలు, ఇతర ఆర్థికలావాదేవీలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. కరువుపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కరువు నిర్మూలనకు చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పారు. అయితే, సుప్రీంకోర్టు విచారణలో ఉన్న అంశాలను చర్చించేందుకు సభా నిబంధనలు అనుమతించబోవని చెప్పారు. మాల్యాను తిరిగి వెనక్కి తీసుకొచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని, రప్పించి అన్ని బ్యాంకులకు సొమ్ములు చెల్లించేలా చేస్ఆమని అన్నారు.