పసుపు చొక్కాలను చూస్తే జ్వరం | Revantreddy Fire On CM KCR | Sakshi
Sakshi News home page

పసుపు చొక్కాలను చూస్తే జ్వరం

Published Wed, Mar 15 2017 1:34 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

పసుపు చొక్కాలను చూస్తే జ్వరం - Sakshi

పసుపు చొక్కాలను చూస్తే జ్వరం

సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ధ్వజం
ఖమ్మం అర్బన్‌: పసుపు చొక్కాలను చూస్తే సీఎం కేసీఆర్‌కు చలిజ్వరం, బీపీ, షుగర్‌ లెవల్స్‌ పెరుగుతున్నాయని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు. తాము గవర్నర్‌ ప్రసంగా నికి ఆటంకం కల్పించకపోయినా దుర్మార్గంగా నాతోపాటు సండ్ర వెంకట వీరయ్యను బడ్జెట్‌ సమావేశాలు అయ్యేవరకు సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. సస్పెన్షన్‌కు నిరసనగా మంగళవారం ఖమ్మంలోని జెడ్పీ సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. సత్తుపల్లిలో మంగళవారం రాత్రి జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలను అమలు చేయమని అడుగుతామని తమను సభ నుంచి సస్పెండ్‌ చేశారన్నారు. సభలో  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement