
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శాసనసభ నాయకుడిగా సీఎం సమాధానం ఇవ్వడం ఆనవాయితీ. కానీ శనివారం మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. ఉమ్మడి ఏపీగా ఉన్నప్పటి నుంచి చూసినా ఇలా జరగడం ఇదే తొలిసారి కూడా.
ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్‌కు బదులు కేటీఆర్ సమాధానమివ్వడం ద్వారా భవిష్యత్ బీఆర్‌ఎస్ రాజకీయ వ్యూహానికి అసెంబ్లీ వేదికగా నాంది పలికారని కొందరు అంటుండగా.. గవర్నర్‌తో విభేదాల క్రమంలోనే ఆమె ప్రసంగానికి సమాధానం ఇవ్వకుండా కేసీఆర్ సభకు గైర్హాజరయ్యారని మరికొందరు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment