
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. తొలిసారిగా మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ... అందుకు తగ్గట్టే కేటాయింపులు చేసిన జెండర్ బేస్డ్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు రాబోతోంది.
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. తొలిసారిగా మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ... అందుకు తగ్గట్టే కేటాయింపులు చేసిన జెండర్ బేస్డ్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు రాబోతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికలు పొందుపరిచిన 2021-22 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను నేడు శాసనసభలో ప్రవేశపెట్టనుంది.
ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభలో పలువురి సంతాప తీర్మానాలు చేయనున్నారు. అనంతరం స్పీకర్, ఛైర్మన్ అధ్యక్షతన బీఏసీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్‌ను హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టనున్నారు.