
సాక్షి,సిటీబ్యూరో: నలుగురినీ సంతోష పెట్టాలనే గొప్ప సంకల్పంతో ముందుకు సాగే బ్లేడ్ రన్నర్ పవన్ నేటి సమాజంలోని ఎంతోమందికి స్ఫూర్తి అని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో బ్లేడ్ రన్నర్ పవన్ కుమార్ ఫౌండేషన్‌ను ఆయని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. తల్లిదండ్రులను పిల్లలు ఓ ఏటీఎంలా చూస్తున్న రోజులివని, కానీ ఇండియన్ ఫస్ట్ బ్లేడ్ రన్నర్ చల్లా పవన్ విధివంచితుడైనా తల్లిదండ్రులను ఎంతో గౌరవంగా చూసుకుంటూ వారికి కీర్తి వచ్చేలా ఫౌండేషన్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత అరుణిమ సివ్హా, పవన్ తల్లిదండ్రులు చల్లా పవన్ కుమార్, గాయత్రి, వంశీ రామరాజు, డాక్టర్ దంటు నాగార్జున శర్మ, పద్మప్రియ, డాక్టర్ కొత్త క్రిష్ణవేణి పాల్గొన్నారు.