మెదక్ : ఏపీ రాజధాని శంకుస్ధాపనకు గురువారం అమరావతికి వెళ్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చెప్పారు. అదే రోజు సాయంత్రం ఎర్రవెల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్ధాపన చేయనున్నట్లు తెలిపారు. ఎర్రవెల్లిలో 5 నెలల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని కూడా దసరా రోజున ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. కానీ, కేసీఆర్ అమరావతి పర్యటన కారణంగా ఈ ఇళ్ల ప్రారంభోత్సవం వాయిదా పడే అవకాశముంది.