‘తాను నెరవేర్చేందుకే కొందరు మంచి పనులను తన కోసం వదిలి వెళ్లారని’ ప్రధాని నరేంద్ర మోదీ యూపీలో జరిగిన కల్కి ధామ్ శంకుస్థాపన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పరిధిలోని ఐంచోడ కాంబోహ్‌లోని శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయడం తనకు దక్కిన వరమని, ఈ ఆలయం భారతీయుల విశ్వాసానికి మరో కేంద్రంగా అవతరిస్తుందని అన్నారు.
ఇక్కడి ప్రజల 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేసే అవకాశం తనకు లభించిందని మోదీ పేర్కొన్నారు. తన కోసమే కొందరు మంచి పనులు వదిలి వెళ్లారని, భవిష్యత్తులో ఏ మంచి పని మిగిలిపోయినా మహనీయులు, ప్రజల ఆశీస్సులతో వాటిని పూర్తి చేస్తామన్నారు. ఈ ఆలయంలో పది గర్భాలయాలు ఉంటాయని తెలిపారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి అని, ఈ రోజు మరింత పవిత్రమైనదని, ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా మారుతుందని అన్నారు.
ఒకవైపు దేశంలోని యాత్రా స్థలాలను అభివృద్ధి చేస్తూనే, మరోవైపు నగరాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారీ స్థాయిలో నిర్మితం కాబోతున్న ఈ కల్కిధామ్ ఎంతో ప్రత్యేకంగా నిలవనున్నదని, గర్భాలయంలో దశావతారాలు ఉంటాయన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ నేడు భారతదేశ వారసత్వ సంపద ప్రపంచ వేదికపై గుర్తింపు పొందుతున్నదన్నారు.
#WATCH | At the foundation stone laying ceremony of Hindu shrine Kalki Dham in Sambhal, Uttar Pradesh CM Yogi Adityanath says, "In the last 10 years, we have seen a new Bharat... The country is moving ahead on the path of development in the new Bharat..." pic.twitter.com/fjSfnwyLpa
— ANI (@ANI) February 19, 2024
Comments
Please login to add a commentAdd a comment