ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు (సోమవారం) యూపీలోని సంభాల్ జిల్లాలోని ఐంచోడ కాంబోహ్‌లో నిర్మితం కానున్న కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని కల్కి ధామ్ పీఠాధీశ్వరులు ఆచార్య ప్రమోద్ కృష్ణం తెలిపారు. 10:30 గంటలకు కల్కి ధామ్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. కల్కి ఆలయ నమూనాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు మంత్రులు పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని ప్రమోద్ కృష్ణం తెలిపారు. కల్కిధామ్ వేడుకలకు ప్రధాని హాజరు కానున్నారని తెలియగానే ఆచార్య ప్రమోద్ కృష్ణంను కాంగ్రెస్ పార్టీ ఆరేళ్ల పాటు బహిష్కరించింది. కాంగ్రెస్ సభ్యుడు ఆచార్య ప్రమోద్ కృష్ణం ఫిబ్రవరి ఒకటిన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి కల్కిధామ్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ ఆహ్వానంపై ప్రధాని సానుకూల వైఖరి ప్రదర్శించారు. ఈ నేపధ్యంలోనే ప్రమోద్ కృష్ణంపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ ఒక లేఖలో తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment