
వడోదర: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ సోమ్‌నాథ్ ఆలయంలో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సోమనాథ్ ప్రొమెనేడ్, సోమనాథ్ ఎగ్జిబిషన్ సెంటర్, పాత (జునా) సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన మోదీ సోమ్‌నాథ్ ఆలయంపై జరిగిన దాడులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని వెల్లడించారు. తద్వారా కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకంతో భవిష్యత్తరాలు మన సంస్కృతీ సంప్రదాయాలకు అనుసంధానమవుతారని పేర్కొన్నారు. విధ్వంసక, తీవ్రవాద శక్తుల ఆధిపత్యం కొంతకాలమేనని ప్రధాని హెచ్చరించారు. ఉగ్రవాద శక్తులు ప్రజలను ఎక్కువకాలం తొక్కిపెట్ట లేవని పేర్కొన్నారు. అఫ్గాన్‌లో తాలిబన్ల ఆక్రమణలు, హింస నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధ్యానతను సంతరించుకున్నాయి.
ప్రారంభించిన ప్రాజెక్టులలో సోమనాథ్ ప్రొమెనేడ్, సోమనాథ్ ఎగ్జిబిషన్ గ్యాలరీ, పాత (జూనా)సోమనాథ్ పునర్నిర్మించిన ఆలయ ప్రాంగణం ఉన్నాయి. ప్రధాని అధ్యక్షుడిగా ఉన్న సోమనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 3.5 కోట్లతో అహిల్యాబాయి దేవాలయాన్ని నిర్మించారు. పిలిగ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచ్యువల్, హెరిటేజ్ అగ్‌మెంటేషన్ డ్రైవ్) పథకం కింద సోమనాథ్ ప్రొమెనేడ్‌ను రూ.47 కోట్లకు పైగా ఖర్చుతో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment