Somnath Temple
-
సోమనాథ్ ఆలయంలో ఓలా సీఈఓ పూజలు (ఫోటోలు)
-
సోమనాథ్ ఆలయంలో పూజలు చేసిన హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తొలి విజయం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే వరుస మూడు ఓటముల చవిచూసిన ముంబై ఇండియన్స్.. తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ ముందు ముంబై జట్టుకు ఆరు రోజుల విరామం లభించింది. దీంతో ముంబై జట్టు మొత్తం గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు టూర్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లిన ముంబై జట్టు ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించాడు. ఆలయంలో హార్దిక్ పాండ్యా పూజలు చేశాడు. శివలింగానికి పాండ్యా పాలాభిషేకం నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎన్ఏ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ముంబై ఇండియన్స్ నూతన సారధిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమవుతున్నాడు. #WATCH | Gujarat: Indian Cricket Team all-rounder Hardik Pandya offers prayers at Somnath Temple. Source: Somnath Temple Trust pic.twitter.com/F8n05Q1LSA — ANI (@ANI) April 5, 2024 -
తాలిబన్ల దుశ్చర్య .. సోమనాథ్ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసి ట్వీట్ చేశారు
కాబుల్: ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అకృత్యాలు ప్రజల నుంచి దేవుళ్ల వరకు వెళ్లాయి. తాజాగా అక్కడి చారిత్రాత్మక సోమనాథ్ దేవాలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అందుకు బదులుగా ఆ స్థానంలో మహ్మమద్ గజ్నవి దర్గాను పునర్మిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తాలిబన్‌కు చెందిన అనాస్ హక్కానీ ట్విటర్ ద్వారా తెలిపారు. ఆ ట్వీట్లో.. ఇవాళ మేము పదో శతాబ్దపు ముస్లిం వారియర్ మహ్మమద్ గజ్నవి దర్గాకు వెళ్లాం. ఈ ప్రాంతంలో ఆయన పటిష్టమైన ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ వైభవాన్ని మేము తిరిగి తీసుకొస్తామని తెలిపారు. కాగా, అందుకోసం తాలిబన్లు సోమ్‌నాథ్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. 998 నుంచి 1030 వరకు పాలించిన గజనావిడ్స్ తుర్కిక్ రాజవంశం మొట్టమొదటి స్వతంత్ర పాలకుడు మహమూద్ గజ్నవి. అతను భారతదేశంలోని సంపన్న నగరాలు, కాంగ్రా, మధుర, జ్వాలాముఖ్ వంటి దేవాలయాలతో పాటుగా 17 సార్లు గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయాన్ని దోచుకున్న సంగతి తెలిసింది. సోమనాథ్పై దాడి చేసినప్పుడు, గజ్నవీ దేవాలయాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్న వేలాది మంది భక్తులను చంపినట్లు చెబుతారు. కాగా సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం భారతదేశపు మొదటి హోం మంత్రి వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు ప్రారంభించగా ఆయన మరణం తర్వాత మే 1951 లో పూర్తయింది. ప్రస్తుతం ఆ దేవాలయం అన్ని వైభవాలతో కళకళలాడుతోంది. ఇక ఈ ట్వీట్‌పై . బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రాతో పాటు అనేక మంది భారతీయ నెటిజన్లు ధీటుగా స్పందించారు. అనస్ హక్కానీ ట్వీట్‌కు.. సోమనాథ్ ఆలయం ఇంకా ఉన్నతస్థానంలో ఉందని, గజ్నవీ నగరాలు నశించిపోతున్నాయని నెటిజన్లు గుర్తు చేశారు. Today, we visited the shrine of Sultan Mahmud Ghaznavi, a renowned Muslim warrior & Mujahid of the 10th century. Ghaznavi (May the mercy of Allah be upon him) established a strong Muslim rule in the region from Ghazni & smashed the idol of Somnath. pic.twitter.com/Ja92gYjX5j — Anas Haqqani(انس حقاني) (@AnasHaqqani313) October 5, 2021 చదవండి: పైసల కోసమే ఫేస్బుక్ కక్కుర్తి! ఛస్.. లాజిక్ లేదన్న మార్క్ -
గుజరాత్లో కీలక ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
వడోదర: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ సోమ్‌నాథ్ ఆలయంలో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సోమనాథ్ ప్రొమెనేడ్, సోమనాథ్ ఎగ్జిబిషన్ సెంటర్, పాత (జునా) సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన మోదీ సోమ్‌నాథ్ ఆలయంపై జరిగిన దాడులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని వెల్లడించారు. తద్వారా కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకంతో భవిష్యత్తరాలు మన సంస్కృతీ సంప్రదాయాలకు అనుసంధానమవుతారని పేర్కొన్నారు. విధ్వంసక, తీవ్రవాద శక్తుల ఆధిపత్యం కొంతకాలమేనని ప్రధాని హెచ్చరించారు. ఉగ్రవాద శక్తులు ప్రజలను ఎక్కువకాలం తొక్కిపెట్ట లేవని పేర్కొన్నారు. అఫ్గాన్‌లో తాలిబన్ల ఆక్రమణలు, హింస నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధ్యానతను సంతరించుకున్నాయి. ప్రారంభించిన ప్రాజెక్టులలో సోమనాథ్ ప్రొమెనేడ్, సోమనాథ్ ఎగ్జిబిషన్ గ్యాలరీ, పాత (జూనా)సోమనాథ్ పునర్నిర్మించిన ఆలయ ప్రాంగణం ఉన్నాయి. ప్రధాని అధ్యక్షుడిగా ఉన్న సోమనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 3.5 కోట్లతో అహిల్యాబాయి దేవాలయాన్ని నిర్మించారు. పిలిగ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచ్యువల్, హెరిటేజ్ అగ్మెంటేషన్ డ్రైవ్) పథకం కింద సోమనాథ్ ప్రొమెనేడ్‌ను రూ.47 కోట్లకు పైగా ఖర్చుతో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. -
సోమ్నథ్ ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు
-
సోమనాథ్ ఆలయంలో రాహుల్
-
‘మా కుటుంబంతా శివ భక్తులమే’
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానంగా గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ దేవాలయాన్ని సందర్శించే చేసిన సంతకంపై చెలరేగుతున్న వివాదంపై రాహుల్ స్పందించారు. హిందువులు రిజిస్టర్లోనే సంతకం చేసినట్లు ఆయన చెప్పారు. అయితే పొరపాటున పార్టీ కార్యకర్తలు.. ఇతరులు రిజిస్టర్లో సంతకం చేసినట్లు ప్రకటించాని ఆయన చెప్పారు. నానమ్మ ఇందిరాగాంధీ నుంచి మా కుటుంబమంతా శివభక్తులమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నానమ్మ శివుడిని ఆరాధించేదని రాహుల్ గుర్తు చేసుకున్నారు. నానమ్మ ప్రేరణతో తామంతా పరమేశ్వరుడికి భక్తులుగా మారిపోయాని.. మొత్తం కుటుంబమంతా శివారధాన చేస్తుందని ఆయన చెప్పారు. మతాన్ని, భగవంతుడిని రాజకీయ లబ్దికోసం ఉపయోగించునే సంస్కృతి తనకు లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మతం అనేది వ్యక్తుల ఆంతరగింక, వ్యక్తిగత విషయని ఆయన స్పష్టం చేశారు. మతం పేరనుతో వ్యాపారాలు, రాజకీయాలు చేయడం తగదని ఆయన చెప్పారు. ’నేను సోమనాథ్ ఆలయంలో హిందూ సందర్శకులు రిజిస్టర్లోనే సంతకం చేశానని.. కొన్ని మీడియా వర్గాలు మాత్రం వ్యతిరేకంగా ప్రచారం చేశాయని’ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. #WATCH Congress VP Rahul Gandhi says, my grand mother was a Shiv-bhakt & so is my family. We don't talk about these things as they are personal. (Source: Amateur video) pic.twitter.com/fV8H8udRf8 — ANI (@ANI) 30 November 2017 -
రాహుల్ గాంధీ హిందువు కాదా?!!
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలైన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అసలు హిందువా, కాదా ? అన్న అంశంపై ఇప్పుడు వివాదం రాజుకుంది. రాహుల్ గాంధీ బుధవారం నాడు సోమ్‌నాథ్ ఆలయన్ని సందర్శించినప్పుడు హిందువేతరులు సంతకం చేయాల్సిన పుస్తకంలో సంతకం చేశారని, ఈ విధంగా రాహుల్ గాంధీ హిందువు కాదని తానే స్వయంగా ఒప్పుకున్నారంటూ బీజేపీ వర్గాలు, మద్దతుదారులు బుధవారం నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మొట్టమొదట ఈ కథనాన్ని ‘జీ గుజరాతీ’ ప్రసారం చేసింది. జీ గుజరాతీకి చెందిన జర్నలిస్ట్ తేజాష్ మోదీ సోమ్‌నాథ్ ఆలయం వద్ద నుంచి పంపిన ట్వీట్‌ను యధాతథంగా ‘జీ గుజరాతీ’ ప్రచారం చేయడంతో వివాదం రాజుకుంది. ‘కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆలయ ట్రస్ట్ హిందువులుకానీ వారి కోసం ఏర్పాటు చేసిన పుస్తకంలో రాహుల్ గాంధీ తన పేరు రాసి సంతకం చేశారు. ఆయన కిందనే అహ్మద్ పటేల్ కూడా తన పేరు రాసుకొని సంతకం చేశారు’ అని తేజాష్ మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను చూసిన బీజేపీ సమాచార, సాంకేతిక విభాగం అధిపతి అమిత్ మాలవియా ఆగమేఘాల మీద పార్టీ ట్విట్టర్ నిర్వాహకులందరికి ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ఆయన తొందరపడి చేసిన ట్వీట్ విస్తతంగా సోషల్ మీడియాతోపాటు ముద్రణా, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తతంగా ప్రచారమైంది. అది రాహుల్ గాంధీ హిందువు కాదా? అంటూ కొత్త చర్చను లేవదీసింది. ఇలా తొందరపడి తప్పుడు వార్తలను ట్వీట్ చేయడం అమిత్ మాలవియాకు మొదటి నుంచి అలవాటే. ఇప్పటికీ ఐదుసార్లు ఆయన తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. పశ్చిమ బెంగాల్ మత కల్లోలు జరుగుతున్నప్పుడు ‘పట్టపగలు ఓ హిందువు స్త్రీని వివస్త్రను చేస్తున్న ముస్లిం గుండాలు’ అనే శీర్శికన ఓ మరాఠీని సినిమా షూటింగ్ స్టిల్‌ను ఎవరో పోస్ట్ చేస్తే దానికి మాలవియా విస్తత ప్రచారం కల్పించారు. సరే, ఆయనంటే బీజేపీ పక్కా మనిషి కనుక అలాంటి ప్రచారాన్ని ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారని పక్కన పెట్టొచ్చేమోగానీ కొన్ని ఆంగ్ల పత్రికలు, ఛానళ్లు వాస్తవాస్తవాలను తెలుసుకోకుండానే హిందువు కానంటూ రాహుల్ గాంధీ దండోరా వేసుకున్నాడంటూ వార్తలను ప్రసారం చేయడం శోచనీయం. ముఖ్యంగా ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఈ వార్తకు మొదటి పేజీలో బ్యానర్ ప్రాముఖ్యతను ఇవ్వడం విడ్డూరం. గూగుల్‌లో నిక్షిప్తమైవున్న రాహుల్ రాతతో ఆలయ పుస్తకంలో రాహుల్ గాంధీ పేరుతో ఉన్న రాతను పోల్చి చూసినట్లయితే అది రాహుల్ గాంధీయే రాశారా, మరెవరైనా రాశారా? అన్న విషయం ఇట్టే తేలిపోయేది. ఎవరు కూడా వాస్తవాలను తెలుసుకునేందుకు ఆ మాత్రం కసరత్తు చేయకపోవడం శోచనీయం. ముఖ్యంగా మీడియాకైతే ఇది సిగ్గుచేటే! అందులోబాటులో ఉన్న రెండు రాహుల్ గాంధీ చేతి రాతలకు, సోమ్‌నాథ్ ఆలయ పుస్తకంలోని రాహుల్ చేతి రాతకు, సంతకానికి ఎక్కడా పోలిక లేదు. మరెవరో దీన్ని రాసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. పైగా రాహుల్ గాంధీ తన పేరును ఎప్పుడు కూడా రాహుల్ గాంధీజీ అని రాసుకోరు. పుస్తకంలో రాహుల్ గాంధీజీ అని రాసి ఉంది. అహ్మద్ పటేల్ పేరు ఇంగ్లీషు అక్షరాల్లో ‘ఏహెచ్ఎంఈడీ పీఏటీఈఎల్’ను ఏహెచ్ఏఎంఈడీగా తప్పుగా రాశారు. అహ్మద్ పటేల్ తన పేరును తప్పుగా రాసుకోరుగదా! అంతేకాకుండా రాహుల్ గాంధీజీ, అహ్మద్ పటేల్ పేర్లను ఎవరో ఒకరే రాసినట్టుగా రాతను చూస్తే స్పష్టం అవుతోంది. రాహుల్ గాంధీ సోమ్‌నాథ్ ఆలయంలో సందర్శకుల పుస్తకంలో చేసిన సంతకాన్ని కాంగ్రెస్ పార్టీ మీడియాకు విడుదల చేసింది. తాను హిందువును కానంటూ మరే పుస్తకంలోనూ ఆయన సంతకం చేయలేదంటూ వివరణ ఇచ్చింది. గాంధీ సంతకం చేసిన పేజీనీ కూడా ట్వీట్ చే సింది. రాహుల్ గాంధీ ఒక్క సందర్శకుల పుస్తకంలో మినహా మరే పుస్తకంలో సంతకం చేయలేదంటూ సోమ్‌నాథ్ ఆలయం ట్రస్ట్ కార్యదర్శి పీకే లహరి మీడియాకు స్పష్టం చేశారు. మరి రాహుల్, పటేల్ పేరిట హిందువేతరుల పుస్తకంలో ఎవరు సంతకం చేశారు? రాహుల్ వెంట ఆలయంలోకి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించాలంటే ఈ పుస్తకంలో సంతకం చేయాలంటూ ఎవరో ఆలయం పుస్తకం ఇస్తే అందులో కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ మనోజ్ త్యాగీ... రాహుల్, పటేల్ పేర్లు రాసి సంతకం చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ధ్రువీకరించుకోడానికి మనోజ్ త్యాగీ అందుబాటులో లేరు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గుజరాత్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత కల్పించాల్సిందిపోయి పనికిమాలిన అంశాలకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం ఎవరిని తప్పుదోవ పట్టించడానికి? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో నాడు ఇందిరాగాంధీ గుజరాత్‌ను పర్యటించినప్పుడు మోర్బీలో ముక్కుమూసుకున్నారని విమర్శించడంలో ఉద్దేశం ఏమిటీ? -
మరో వివాదంలో రాహుల్
-
మత్స్యకారులకు రూ.కోటి
►కొత్త రుణ పథకాన్ని ప్రకటించిన ప్రధాని ►సోమ్‌నాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు ►మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు డామన్ డయ్యూ: చిన్న, మధ్యతరహా మత్స్యకారులు పెద్దవైన, ఆధునిక పడవలను కొనుక్కునేందుకు కోటి రూపాయల రుణం ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బుధవారం డామన్ డయ్యూలో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ఈ నిర్ణయం పేద మత్స్యకారులకు ఓ వరమన్నారు. ‘చిన్న బోట్లలో సముద్రంలోకి వెళ్లి వేటాడలేకపోతున్న పేద మత్స్యకారుల కోసం మేం కొత్త పథకాన్ని తెస్తున్నాం. ఈ పథకం ముసాయిదా దాదాపు పూర్తయింది. దేశవ్యాప్తంగా దీన్ని అమలుచేస్తాం. పేద మత్స్యకారులు ఓ బృందంగా ఏర్పడాలి. ఈ బృందానికి ముద్ర పథకంలో భాగంగా రూ. కోటి రుణం ఇస్తాం. ఇందులో 50 శాతం నిధులను కేంద్రం ఇస్తుంది’ అని చెప్పారు. పెద్ద బోట్ల ద్వారా ఈ గ్రూపు సభ్యులు కలిసి సముద్రంలోకి వెళ్లి 12 నాటికల్ మైళ్లు (22.2 కి.మీ. ప్రాదేశిక జలాలు) దాటి వెళ్లి మరింత మత్స్య సంపద లాభాలను పంచుకోవచ్చన్నారు. దీనిపై డామన్ డయ్యూ ప్రజలు మరిన్ని సలహాలు సూచనలు ఇక్కడి అధికారులకు అందజేయవచ్చన్నారు. 9 మెగావాట్ల విద్యుత్ వాడుతున్న ఈ కేంద్ర పాలిత ప్రాంతం 10 మెగావాట్ల సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయటం గొప్పవిషయన్నారు. సోమ్‌నాథ్ ఆలయంలో మోదీ అంతకుముందు రెండ్రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా.. గిర్ జిల్లాలోని సోమ్‌నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మోదీకి ఆలయ ట్రస్టు చైర్మన్ కేశుభాయ్ పటేల్, బోర్డు సభ్యుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ట్రస్టీలు స్వాగతం పలికారు. మహిళా సాధికారతతోనే సంపూర్ణత మహిళా సాధికారత జరగనంతవరకు మానవత్వానికి సంపూర్ణత రాదని మోదీ చెప్పా రు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా తన అధికారిక వెబ్సైట్ ద్వారా మహిళలకు శుభాకాంక్షలు తెలి పారు. మహిళల అభివృద్ధి గురించి కాకుం డా.. మహిళల నేతృత్వంలో అభివృద్ధి గురిం చి ఆలోచించాలన్నారు. బాలికలపై వివక్ష వద్దు బాలికల పట్ల వివక్షచూపే ధోరణి మారాలని ప్రధాని తెలిపారు. బాలికలను కాపాడుకోవటం ప్రతి ఒక్కరి సామాజిక, జాతీయ, మానవతావాద బాధ్యతన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గాంధీనగర్‌లో ఏర్పాటుచేసిన మహిళా సర్పంచుల జాతీయ సదస్సులో మోదీ పాల్గొన్నారు. అనంతరం సర్పంచులకు ‘స్వచ్ఛ శక్తి’ అవార్డులను అందజేశారు. -
ఆ పదిమందిలో ముగ్గురిని మట్టుబెట్టారు!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి కొన్నిరోజుల కిందట భారత్‌లోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదుల జాడను భద్రతా దళాలు పశ్చిమ భారతంలో గుర్తించినట్టు సమాచారం. ఆ పదిమంది ఉగ్రవాదుల్లో ముగ్గురిని గుర్తించి భద్రతా దళాలు మట్టుబెట్టాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శివరాత్రి సందర్భంగా 26/11 ముంబై దాడుల తరహాలో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంపై ఉగ్రవాద దాడికి వారు వ్యూహరచన చేశారని ఆ వర్గాలు చెప్పాయి. పదిమంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు గుజరాత్‌లోకి ప్రవేశించారని, వారు దేశ రాజధాని న్యూఢిల్లీపై దాడి చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఢిల్లీలో తలదాచుకొని ఉంటారని ఐబీ అప్పట్లో పేర్కొంది. భారత్‌లోకి పది మంది ఉగ్రవాదులు ప్రవేశించారని పాకిస్థాన్ జాతీయ భద్రత సలహాదారు నాసిర్ ఖాన్ జాంజువా మొదట భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సమాచారమిచ్చారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు గుజరాత్‌తోపాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని జాంజువా తెలిపారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన నిఘా వర్గాలు, భద్రతా దళాలు ఢిల్లీ, గుజరాత్‌తోపాటు దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు పశ్చిమ భారతంలో ఆ పదిమంది ఉగ్రవాదుల జాడను కనిపెట్టి.. అందులో ముగ్గురిని హతమార్చినట్టు సమాచారమందుతున్నది. -
సోమనాథ్ ఆలయానికి బాంబు బెదిరింపు
గుజరాత్: గుజరాత్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని పేల్చివేస్తామంటూ వచ్చిన బాంబు బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. దీంతో ఆలయానికి భద్రతను పెంచటంతో పాటు హై అలర్ట్ ప్రకటించారు. కాగా ఆలయాన్ని పేల్చివేస్తామంటూ ఆలయ ట్రస్టు కమిటీకి ఓ లేఖ వచ్చింది. ఇండియన్ ముజాహిద్దీన్ పేరుతో గుజరాతీ భాషలో రాసిన ఓ లేఖ వడోదరా నుంచి వచ్చినట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఇక బాంబు స్క్వాడ్ బృందం ఆలయాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే భక్తుల రాకపోకలపై దృష్టి సారించారు. అయితే ఇప్పటివరకూ ఆలయంలో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఆ లేఖ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై సెక్యూరిటీ ఏజెన్సీ విచారణ చేపట్టింది. కాగా సోమనాథ్ ఆలయం సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో కోస్ట్ గార్డ్ కూడా అప్రమత్తమైంది. -
సుందర సోమనాథుడు
పాఠక పర్యటన ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది అయిన సోమనాథ్ దేవాలయం సందర్శించే భాగ్యం కలగడం మా అదృష్టం. ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో ఆ దేవాలయాన్ని, ఆ దైవ సన్నిధిని స్మరించుకోవడం మరింత భాగ్యం. నేటికీ రెండు నెలల క్రితం అహ్మదాబాద్‌లో బంధువుల ఇంట జరిగే శుభకార్యానికి మా కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రాజ్‌కోటి ఎక్స్‌ప్రెస్‌లో అహ్మదాబాద్ చేరుకున్నాం. బంధువుల ఇంట సందడి పూర్తవగానే చుట్టుపక్కల ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలు చూడాలని బయల్దేరాం. అందులో ముందుగా గాంధీనగర్‌ను, ఆ తర్వాత గుజరాతీల ఇష్టదేవత భద్రకాళీ, జగన్నాథ మందిరాల దర్శించుకున్నాం. ఆ తర్వాత .. అహ్మదాబాద్ నుండి సోమనాథ్ దేవాలయం ఎంత దూరంలో ఉందో వాకబు చేశాం. అహ్మదాబాద్ నుండి 400 కి.మీ దూరం ఉన్న సోమనాథ్‌కు బస్‌ల ద్వారా చేరుకోవచ్చు. మేం లగ్జరీ బస్‌లో ముందుగా టికెట్ బుక్ చేసుకొని బయల్దేరాం. రాత్రంతా ప్రయాణించి, ఉదయం 8 గం.లకు సోమనాథ్ చేరుకున్నాం. అక్కడ గైడ్‌ను మాట్లాడుకొని, దేవాలయ సందర్శనకు బయల్దేరాం. ప్రాచీన వైభవం... సోమనాథ్ దేవాలయం అతి ప్రాచీన కట్టడం. ఈ దేవాలయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆలయం నిర్మాణం, నాటి ప్రాచీన శిల్ప కళా వైభవం అడుగడుగునా అబ్బురపరిచింది. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కాలంలో యాదవుల రాజు వల్లభ ఈ ఆలయాన్ని నిర్మించాడని, ఆ తర్వాత కాలంలో ఎన్నో దాడులకు ఈ కట్టడం లోనైందని తెలిసింది. చాళుక్యుల నిర్మాణ కౌశలం అడుగడుగునా కనిపిస్తుంది. 1947లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని గైడ్ ద్వారా తెలుసుకున్నాం. ఎర్రటి రాయితో చేసిన ఈ ఆలయ నిర్మాణం గుజరాత్ ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఆలయ సమీపంలోని కోనేరు విశాలమైనది. ఆ నీటిలో స్నానాలు ముగించుకొని శివలింగ దర్శనం చేసుకున్నాం. సోమనాథ్ దేవాలయంతో పాటు అక్షరథామ్, సబర్మతీ ఆశ్రమం, మౌంట్ అబూ ప్రదేశాలనూ చూసి వచ్చాం. ఈ పర్యటన ఎప్పటికీ మరచిపోలేనిదిగా మా మదిలో నిలిచిపోయింది. -కె.సునీత కృష్ణమూర్తి, గద్వాల్, మహబూబ్‌నగర్