సోమనాథ్ ఆలయంలో పూజలు చేసిన హార్దిక్‌ పాండ్యా.. వీడియో వైరల్‌ | Hardik Pandya performs pooja at Somnath Temple | Sakshi
Sakshi News home page

IPL 2024: సోమనాథ్ ఆలయంలో పూజలు చేసిన హార్దిక్‌ పాండ్యా.. వీడియో వైరల్‌

Published Fri, Apr 5 2024 8:33 PM | Last Updated on Fri, Apr 5 2024 9:05 PM

Hardik Pandya performs pooja at Somnath Temple  - Sakshi

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ తొలి విజయం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే వరుస మూడు ఓటముల చవిచూసిన ముంబై ఇండియన్స్‌.. తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్‌ 7న వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌ ముందు ముంబై జట్టుకు ఆరు రోజుల విరామం లభించింది.

దీంతో ముంబై జట్టు మొత్తం గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు టూర్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లిన ముంబై జట్టు ఆటగాళ్లు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించాడు. ఆలయంలో హార్దిక్‌ పాండ్యా పూజలు చేశాడు. శివలింగానికి పాండ్యా పాలాభిషేకం నిర్వహించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎన్‌ఏ షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ముంబై ఇండియన్స్‌ నూతన సారధిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్‌ జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement