సోమనాథ్ ఆలయానికి బాంబు బెదిరింపు | Security beefed up at Somnath temple after terror threat | Sakshi
Sakshi News home page

సోమనాథ్ ఆలయానికి బాంబు బెదిరింపు

Oct 9 2015 1:25 PM | Updated on Sep 3 2017 10:41 AM

సోమనాథ్ ఆలయానికి బాంబు బెదిరింపు

సోమనాథ్ ఆలయానికి బాంబు బెదిరింపు

గుజరాత్లోని పవిత్ర పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని పేల్చివేస్తామంటూ వచ్చిన బాంబు బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది.

గుజరాత్: గుజరాత్లోని పవిత్ర పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని పేల్చివేస్తామంటూ వచ్చిన బాంబు బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. దీంతో ఆలయానికి భద్రతను పెంచటంతో పాటు  హై అలర్ట్ ప్రకటించారు.  కాగా ఆలయాన్ని పేల్చివేస్తామంటూ ఆలయ ట్రస్టు కమిటీకి ఓ లేఖ వచ్చింది. ఇండియన్ ముజాహిద్దీన్ పేరుతో గుజరాతీ భాషలో రాసిన ఓ లేఖ వడోదరా నుంచి వచ్చినట్లు భద్రతా అధికారులు తెలిపారు.

ఇక బాంబు స్క్వాడ్ బృందం ఆలయాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే భక్తుల రాకపోకలపై దృష్టి సారించారు. అయితే ఇప్పటివరకూ ఆలయంలో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఆ లేఖ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై సెక్యూరిటీ ఏజెన్సీ విచారణ చేపట్టింది. కాగా సోమనాథ్ ఆలయం సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో కోస్ట్ గార్డ్ కూడా అప్రమత్తమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement