కొత్త అధికార నివాసానికి కేసీఆర్ శంకుస్థాపన
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొత్త అధికార నివాసానికి శంకుస్థాపన చేశారు. శనివారం కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి భూమి పూజ చేశారు.
హైదరాబాద్లో సీఎం ప్రస్తుత క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్ను కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మించనున్నారు. భూమిపూజ కార్యక్రమానికి తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, సీఎంవో అధికారులతో పాటు పలువురు నేతలు, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావు హాజరయ్యారు.