ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయం సమీపంలో సెల్కాన్ మొబైల్ కంపెనీకి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయం సమీపంలో సెల్కాన్ మొబైల్ కంపెనీకి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సెల్కాన్ కంపెనీ ద్వారా యువతకు వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రత్యక్షంగా 20 వేల ఉద్యోగాలు, పరోక్షంగా 40 వేల ఉద్యోగాల వరకు అందనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో తిరుపతిని డిజిటల్ హబ్గా మార్చనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రానికి త్వరలో మరిన్ని హార్డ్వేర్ కంపెనీలు రానున్నాయని తెలిపారు.