
రాజధానిలో 'అంతిమ యాత్ర' పై ఆంక్షలు!
ఏపీ రాజధాని ప్రాంతంలో మితిమీరిన ఆంక్షలతో ప్రజులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
-పశువులు వీధుల్లోకి రావొద్దుట
-ఆంక్షలపై ప్రజల ఆగ్రహం
తుళ్లూరు : ఏపీ రాజధాని ప్రాంతంలో మితిమీరిన ఆంక్షలతో ప్రజులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన నేపథ్యంలో పశువులు, కోళ్లు , పందులను వీధుల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవలంటూ అధికారులు బుధవారం గ్రామాల్లో మైక్ ద్వారా ప్రచారం చేయించారు. అంతటితో ఊరుకోకుండా ఎవరైనా చనిపోతే అంతిమయాత్రలూ నిర్వహించరాదంటూ ఆంక్షలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం స్థానిక దళితవాడలో ఓ యువకుడు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. యువకుడి మృతదేహాన్ని గురువారం ఊరేగింపుగా తీసుకుని ఖననం చేయాలని బంధువులు నిర్ణయించారు. అయితే ఇందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్నందున మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లకూడదని చెప్పడంతో స్ధానికలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో మృతదేహాల ఖనన కార్యక్రమాలపై కూడా ఆంక్షలా.. అంటూ మండిపడుతున్నారు.