
రోశయ్యకు 'కొరియర్' ఆహ్వానం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానాలు పంపడంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్యకు శంకుస్ధాపనకు సంబంధించి ఆహ్వాన పత్రికను కొరియర్‌లో పంపడంపై విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలను రాచమర్యాదలతో పిలుస్తూ..రోశయ్యలాంటి సీనియర్ రాజకీయ నేతకు మాత్రం కొరియర్‌లో ఆహ్వానాన్ని పంపడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.