
తిరుపతిలో సైన్స్ మ్యూజియం
తిరుపతిలో అంతర్జాతీయ స్థారుు సైన్స్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణరుుంచింది.
అంతర్జాతీయ {పమాణాలతో నిర్మాణం
జనవరి 3న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన
తిరుపతి: తిరుపతిలో అంతర్జాతీయ స్థారుు సైన్స్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఇందుకోసం 50 ఎకరాలు కేటారుుం చాలని భావిస్తోంది. సోమవారం సాయంత్రం విజయవాడలో జరిగిన ఏపీ సైన్‌స కాంగ్రెస్ 2016 ప్రారంభ సభలో సీఎం చంద్రబాబునాయుడు సైన్స్ మ్యూజియంను ప్రకటించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేషమైన అభివృద్ధిని చూరగొంటున్న తిరుపతి పట్టణంలో మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. జనవరి 3న మొదలయ్యే ఇండియన్ సైన్‌స కాంగ్రెస్ సదస్సును ప్రారంభిం చేందుకు హాజరయ్యే ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా సైన్‌స మ్యూజియం నిర్మాణ పనులకు శంకుస్థాపన జరుగుతుని సీఎం చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణా లు, అన్ని వసతులతో దీన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 3 నుంచి ఏడో తేదీ వరకూ జరిగే ఇండియన్ సైన్‌స కాంగ్రెస్ ముఖ్యాంశాలను రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా నుంచి యువ శాస్త్రవేత్తలుగా ఎంపికై న నలుగురు శాస్త్రవేత్తలను సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు.
యువ శాస్త్రవేత్తలకు అవార్డులు
ఆంధ్రప్రదేశ్ సైన్‌స అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో జరిగిన 2016-ఏపీ సైన్‌స కాంగ్రెస్ వేడుకల్లో జిల్లాకు చెందిన నలుగురు యువ శాస్త్రవేత్తలకు అవార్డులు లభించారుు. సైన్‌స పరంగా అభివృద్ధి, పరిశోథన రంగాల్లో రాణిస్తోన్న వీరిని ప్రత్యేకంగా అభినందించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఎస్ శాంతిసుధ (కెమికల్ సైన్‌స), డాక్టర్ రోజా రమణ్ (అట్మాస్పియరిక్ సైన్‌స)లతో పాటు గాదంకి రాడార్ కేంద్రం (ఎన్‌ఏఆర్‌ఎల్) శాస్త్రవేత్తలు డాక్టర్ వరాహ రవికిరణ్, షేక్ గౌస్‌భాషాలకు అవార్డులు లభించారుు. సీనియర్ శాస్త్రవేత్తల సమక్షంలో వీరు అవార్డులను అందుకున్నారు.