బిల్ గేట్స్ స్వయంగా దోమలను తరిమిగొట్టే పనేమీ చేయడం లేదు. అయినప్పటికీ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ దీనికి సంబంధించిన ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించేందుకు జన్యుపరంగా మార్పు చెందిన దోమలను అభివృద్ధి చేయడానికి కృషిచేస్తున్న బయోటెక్ కంపెనీ ఆక్సిటెక్‌కు నిధులు అందజేసినందుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు అవార్డు ప్రకటించారు.
ఏప్రిల్ 2021లో ఫ్లోరిడాలోని ఆరు ప్రదేశాలలో ఆక్సిటెక్ సుమారు 150,000 దోమలను విడుదల చేస్తుందని ఆక్సిటెక్ ప్రకటించింది. అయితే ఈ నిర్దిష్ట ప్రాజెక్ట్‌కు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చలేదని కంపెనీ పేర్కొంది. అంటు వ్యాధులను వ్యాప్తిచేసే దోమల జాతి అయిన ఈడెస్ ఈజిప్టిని జన్యుపరంగా సవరించడానికి బహుళ-సంవత్సరాల పరిశోధన ప్రాజెక్ట్ 2021లో ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక బిల్ గేట్స్ ఉన్నారని ఇంటర్నెట్‌లో వార్తలు వెలువడ్డాయి.
ఈజిప్టి దోమలను జన్యుపరంగా సవరించడం, తరువాత వాటిని అడవిలోకి విడుదల చేయడం అనేది ఇది మొదటిసారేమీ కాదు. పరిశోధకులు ఒక దశాబ్దానికి పైగా దీనిపై పలు ప్రయత్నాలు చేస్తున్నారు. 2010లో కేమాన్ దీవులలో మార్పు చెందిన దోమల విడుదలను విడుదల చేశారు. 2011, 2012, 2015లో ఆక్సిటెక్ బ్రెజిల్‌లోని పలు ప్రాంతాలలో జన్యుపరంగా మార్పు చెందిన దోమలను విడుదల చేసింది.
ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా మాత్రమే మలేరియా అనేది మనుషులకు వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈజిప్టి దోమ స్వయంగా మలేరియాను వ్యాప్తి చెందించదు. ఆక్సిటెక్ సంస్థ అనాఫిలిస్ దోమలను జన్యుపరంగా మార్చడానికి పలు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ సంస్థ వ్యాధులను వ్యాప్తిని అరికట్టేందుకు జీవసంబంధ పరిష్కారాలను అన్వేషించే పరిశోధనలు సాగిస్తుంటుంది. గేట్స్ ఫౌండేషన్ గ్రాంట్ డాక్యుమెంట్‌లలో ప్రపంచవ్యాప్తంగా 43 నెలల్లో మలేరియా సంబంధిత ప్రాజెక్టుల కోసం జూన్ 2018లో ఆక్సిటెక్‌కు $5.8 మిలియన్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అమెరికా, కరేబియన్‌లలో మలేరియా దోమలను అరికట్టడానికి ఈ నిధులను అందజేస్తున్నట్లు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది.
సెప్టెంబరు 2020లో $1.4 మిలియన్ల రెండవ దఫా గ్రాంట్‌ను ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో మలేరియా దోమల నివారణ కోసం ఈ ప్రాజెక్ట్‌కు అందించినట్లు పేర్కొన్నారు. అయితే అమెరికాలో ఈపనులు చేపట్టేందుకు గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చలేదని కంపెనీ ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఆక్సిటెక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ మొదటి దశలోనే ఉంది.
2020లో యూఎస్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ జన్యుపరంగా మార్పు చెందిన దోమలను ఫీల్డ్ టెస్ట్ చేయడానికి ఆక్సిటెక్‌కు ఆమోదం తెలిపింది. అయితే దీనికిముందు కంపెనీ స్థానిక అధికారుల నుంచి ఆమోదం తీసుకోవలసి ఉంటుంది. అలాగే దీనిపై రెండు సంవత్సరాలలో మొత్తం 6,600 ఎకరాల్లో అధ్యయనం జరగాల్సి ఉంది. అయితే ఇంతలో ఈ కంపెనీకి 31 వేలకు మించిన పబ్లిక్ కామెంట్లు వచ్చాయి. వీటిలోని చాలా వ్యాఖ్యలలో ఈ అధ్యయనానికి అనుమతించకూడదని లేదా మరింత సమాచారం అందుబాటులోకి వచ్చే వరకు వేచి ఉండాలని సూచించారు. అయితే దీనిపై సంస్థ 150 పేజీల ప్రతిస్పందనను తెలియజేసింది.
జూన్ 2020లో ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కన్స్యూమర్ సర్వీసెస్ ఈ అధ్యయనం కోసం అనుమతిని మంజూరు చేసింది. అలాగే ఫ్లోరిడా కీస్ మస్కిటో కంట్రోల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్‌తో పాటు ఏడు స్టేట్ ఆఫ్ ఫ్లోరిడా ఏజెన్సీలు దీనికి ఆమోదం తెలిపాయి. కాగా ఈజిప్టి దోమలు ఆఫ్రికాకు చెందినవి. ఈ జాతి పెట్టే గుడ్లు పొడి వాతావరణంలో నెలల తరబడి నిద్రాణంగా ఉంటాయని, వర్షం పడినప్పుడు జీవం పోసుకుని వ్యాప్తి చెందుతాయని సంస్థ తెలిపింది.
ఫ్లోరిడా కీస్‌లోని మొత్తం దోమల జనాభాలో ఈజిప్టి దోమ కేవలం 4% మాత్రమే ఉన్నాయి. కానీ దోమల ద్వారా సంక్రమించే వ్యాధులకు ఈజిప్టి దోమలు బాధ్యత వహిస్తాయి. కాగా ఆడ దోమ మాత్రమే చికున్‌గున్యా, జికా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను వ్యాపిస్తుంది. ఆడ దోమలు మనుషులకు కుట్టి, తమ లాలాజలంలో బ్యాక్టీరియాను మానవ రక్తంలోకి ప్రసారం చేస్తాయి. వీటిని ఎదుర్కొనేందుకు ఆక్సిటెక్ పరిశోధకులు టెట్రాసైక్లిన్ ట్రాన్స్-యాక్టివేటర్ వేరియంట్ అనే ప్రోటీన్‌ను దోమల నియంత్రణకు ఒక సాధనంగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి?
Bill Gates is not a Scientist or Doctor.
— Liz Churchill (@liz_churchill10) September 3, 2023
Why the Hell is Bill Gates releasing mosquitos on Americans?
How much more proof do people need in order to acknowledge his Diabolical Schemes?
Arrest Bill Gates. pic.twitter.com/sC2iLpvCVP
Comments
Please login to add a commentAdd a comment