నన్ను మోసం చేశారు.. సల్మాన్‌ ఖాన్‌పై చీటింగ్‌ కేసు | Chandigarh police Summoned On Salman Khan Sister Alvira Rs 2 crore alleged fraud case | Sakshi
Sakshi News home page

నన్ను మోసం చేశారు.. సల్మాన్‌ ఖాన్‌పై చీటింగ్‌ కేసు

Published Thu, Jul 8 2021 9:18 PM | Last Updated on Thu, Jul 8 2021 10:30 PM

Chandigarh police Summoned On Salman Khan Sister Alvira Rs 2 crore alleged fraud case - Sakshi

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌పై చండీగఢ్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది.  సోదరి అల్విరా ఖాన్‌ అగ్నిహోత్రితో పాటు ఆయనకు చెందిన బీయింగ్‌ హ్యూమన్‌ ఫౌండేషన్‌కు చెందిన ఏడుగురిపై అరుణ్‌ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఫిరాదుపై జూలై 13లోపు వివరణ ఇవ్వాలని సమన్లు కూడా జారీ చేశారు. ఈ ఆరోపణలలో ఏదైనా నేర కోణం దాగుంటే తప్పక చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేతన్ బన్సాల్ తెలిపారు. 

అరుణ్‌ గుప్తా ఆ ఫిర్యాదులో.. ఇద్దరు బీయింగ్ హ్యూమన్ ఉద్యోగులు నన్ను ఆ సంస్థ ఫ్రాంచైజీని తెరవమని అడిగారు. ఇందుకు పెట్టుబడి ఖర్చు రూ.2 కోట్లు అవుతుందని చెప్పగా అందుకు అంగీకరించి అంత మోత్తాన్ని ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. కాగా షోరూమ్ తెరిచిన సంవత్సరం గడుస్తున్న, తనకు సదరు సంస్థ నుంచి ఏవీ రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదట్లో ఈ విషయమై ఆ సంస్థ ఉద్యోగులు సల్మాన్ ఖాన్‌తో సమావేశం అయ్యేలా చూస్తామని చెప్పారు.

ఈ క్రమంలో అతను సల్మాన్‌ను కలుసుకోగా, షోరూమ్ ప్రారంభించేందుకు కూడా వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపాడు. కానీ ఆ తర్వాత సల్మాన్‌ రాలేదని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఈ మేరకు సల్మాన్‌, ఆయన సోదరి అల్విరా, సంస్థ సీఈఓ ప్రకాశ్ కాపరే సహా మరో ఏడుగురిపై కేసు నమోదైంది. షోరూమ్‌ ప్రారంభించి 1.5 సంవత్సరాలు గడిచినప్పటికీ నాకు ఎటువంటి సమాధానం వాళ్ల నుంచి రాలేదని వాపోయాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement