గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
తుంగతుర్తి
విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిత్ర సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు కె.వేణు కోరారు. మంగళవారం మండలంలోని పసునూర్ జెడ్పీహెచ్‌ఎస్, ప్రాథమిక పాఠశాలల్లోని గ్రంథాలయాలకు పుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి తన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం పుస్తకాలు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. ఉన్నత పాఠశాలలో రూ.10వేలు విలువ చేసే పుస్తకాలు, ప్రా«థమిక పాఠశాలలో రూ.5వేల విలువ చేసే పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తొడుసు లింగయ్య, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మురళి, వెంకటమల్లు, మిత్ర సేవా ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ ఏ.రఘు, కోశాదికారి విజయ్‌కుమార్, సభ్యులు సంపత్, కిరణ్, ప్రవీణ్, ఉపేందర్ తదితరులు ఉన్నారు.