ఏపి రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లు పై గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే సమీక్ష నిర్వహించారు.
గుంటూరు : ఏపి రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లు పై గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే సమీక్ష నిర్వహించారు. జెడ్పీ మీటింగ్ హల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దే శప్రదానితో పలు దేశాల నుంచి అతిథులు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అతిథులకు ఎలాంటి మర్యాదలు చేస్తామో సామాన్య ప్రజలకు అదే స్థాయిలో మర్యాదలు చేయాలని కలెక్టర్ అన్నారు. అధికారులంతా సమన్వయంతో పని చేసి మంచి పేరు తీసుకురావాలన్నారు.