ఆగ్రహం వస్తే అంతే! | Ladies fires on Foundation | Sakshi
Sakshi News home page

ఆగ్రహం వస్తే అంతే!

Published Sat, Nov 19 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

ఆగ్రహం వస్తే అంతే!

ఆగ్రహం వస్తే అంతే!

ఆస్పత్రి శంకుస్థాపనను అడ్డుకున్న వంగపల్లిపేట వాసులు
కార్యక్రమం చేసి తీరాలంటూ మంత్రి పీఎస్ ఒత్తిళ్లు
ఎలాగైనా అడ్డుకుంటామని బైఠారుుంచిన మహిళలు
స్థానికంగా ఉన్నా... హాజరుకాని మంత్రి
►  ఎట్టకేలకు నిలిచిపోరుున శంకుస్థాపన


‘మంత్రరుునా.. సర్పంచ్ అరుునా... మాకు ఒక్కటే. నచ్చకపోతే ఎవరిపైనైనా ఎదురు తిరుగుతాం. మాకు ముప్పు తెచ్చే పనులేవైనా చేస్తే కలసికట్టుగా పోరాడుతాం. అనుకున్నది సాధించి తీరుతాం.’ అని నిరూపించారు చీపురుపల్లి మండలం వంగవల్లిపేటవాసులు. ఏఎంసీలో ఒద్దంటే ఆస్పత్రి ఎలా నిర్మిస్తారు. వాటి వ్యర్థాలతో మా ఆరోగ్యాలు పాడవ్వాలా... ఆ సొసైటీపైనే ఆధారపడిన మా భవిష్యత్తు నాశనం చేసుకోవాలా... సహించం... అని పోలీసులను సైతం లెక్క చేయలేదు. మహిళలు, గ్రామస్తులు ఎదురు తిరిగారు. ప్రజాప్రతినిధులు రాకముందే శంకుస్థాపన కోసం తవ్విన గోతులను రాళ్లు, మట్టితో కప్పేందుకు ప్రయత్నించారు. దీంతో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 
చీపురుపల్లి: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని సొంత నియోజకవర్గకేంద్రమైన చీపురుపల్లి పట్టణంలో అధికారానికి అవమానం జరిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గురువారం తలపెట్టిన 30 పడకల ఆస్పత్రి అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని వంగపల్లిపేట గ్రామస్తులు అడ్డుకున్నారు. విషయం ముందే తెలుసుకున్న రాష్ట్ర మంత్రి మృణాళిని చీపురుపల్లి మండలంలోనే ఉన్నప్పటికీ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఎట్టి పరిస్థితుల్లో అధికారులతో శంకుస్థాపన చేరుుంచాలని మంత్రి పీఎస్ ఫోన్‌లో స్థానిక అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆదేశించినప్పటికీ గ్రామస్తులు ఎదురు తిరిగారు. స్థానిక నాయకులు చేసిన యత్నాలు ఫలించకపోవడంతో శంకుస్థాపన నిలిచిపోరుుంది.

మొదట్నుంచీ వద్దంటున్న గ్రామస్తులు
ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి పనుల కోసం మూడేళ్ల క్రితమే ఏపీఎంఎస్‌ఐడీసీ నుంచి రూ.3.84 కోట్లు మంజూరయ్యారుు. ఏఎంసీ ఆవరణలో 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి పనుల కోసం గురువారం శంకుస్థాపన కార్యక్రమాన్ని తలపెట్టారు. ఏఎంసీలో ఆప నుల్ని తొలి నుంచీ ఆస్పత్రి పనులను వ్యతిరేకిస్తున్న వంగపల్లిపేట వాసులు ఉదయం 9 గంటలకే పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆస్పత్రి పనుల వల్ల తామెంతో నష్టపోవాల్సి వస్తుందని, గ్రామంలోకి వ్యర్థాలు వచ్చి కలుషితమవుతుందనీ, మార్కెట్ యార్డు నిర్వీర్యం అరుుతే దీనిపై ఆధారపడి ఉన్న వందలాది మంది కూలీలకు జీవనోపాధి పోతుందని గ్రామస్తులు వివరించారు.

ప్రజాప్రతినిదులు వచ్చేంత వరకు శాంతించాలని పోలీసులు కోరారు. 11 గంటల వరకు ప్రజాప్రతినిధులెవ్వరూ రాకపోవడంతో సహనం కోల్పోరుున మహిళలు శంకుస్థాపన కోసం తవ్విన గోతులు రాళ్లు, మట్టితో కప్పేసేందుకు ప్రయత్నించారు. మరోసారి పోలీసులు వారిని వారించారు. ఎట్టి పరిస్థితుల్లో శంకుస్థాపన జరగనివ్వబోమంటూ ఆ గోతిలో మహిళలు బైఠారుుంచారు.

స్థానిక నేతలకూ తప్పని సెగ
అక్కడకు చేరుకున్న టీడీపీ మండల అధ్యక్షుడు రౌతు కామునాయుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి కె.త్రిమూర్తులురాజు, జెడ్‌పీటీసీ మీసాల వరహాలనాయుడులకు గ్రామస్తుల నుంచి నిరసన తప్పలేదు. విషయం తెలుసుకున్న వారు ముందుగా శంకుస్థాపన చేశాక తరువాత మంత్రి వద్ద చర్చలు జరుపుదామని గ్రామ పెద్దలు వెంపడాపు నీలకంఠం, బోడసింగి సత్యం, గిరడ రాందాసు, యల్లంటి శివ, మీసాల సీతారాం లకు చెప్పిన్పటికీ గ్రామస్థులు వినలేదు. ఎట్టి పరిస్థితుల్లో శంకుస్థాపన జరగనివ్వబోమని, గ్రామంలో ఉన్న వారెవ్వరికీ ఇష్టం లేని పని చేయాలనుకుంటే ఫలితం తీవ్రంగా ఉంటుందని తేల్చి చెప్పారు. గ్రామ పెద్ద బోడసింగి సత్యం మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు తమ గ్రామానికి రోడ్డు వేశారని ఇప్పటికీ ఎప్పటికీ ఆ మంచి చెప్పుకుంటున్నామని, ఇప్పుడు ఆస్పత్రి కడితే ఆ చెడ్డ టీడీపీ మూట కట్టుకోక తప్పదని హెచ్చరించారు.
 
కొబ్బరికాయ కొట్టాలంటూ పీఎస్ ఆదేశాలు

ఇదిలా ఉండగా ఎలాగైనా కొబ్బరికాయ కొట్టాలంటూ మంత్రి మృణాళిని పీఎస్ నుంచి తహసీల్దార్ గోవిందరావుకు ఫోన్ ఒత్తిళ్లు ఎక్కువయ్యారుు. తహసీల్దార్ అటు గ్రామస్తులు, ఇటు ప్రజాప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేక పోరుుంది. ముందు మంత్రితో చర్చలు ఏర్పాటు చేయాలని తరువాతే శంకుస్థాపన జరపాలని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఇక చేసేదేమీ లేక ఈ నెల 21న మంత్రితో చర్చలు ఏర్పాటు చేశారు. అంతవరకు శంకుస్థాపన జరగదని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement