పీఎస్‌ భవన నిర్మాణానికి మంత్రి శంఖుస్థాపన | Police Station Foundation Naini Narasimha Reddy Ramagundam | Sakshi
Sakshi News home page

పీఎస్‌ భవన నిర్మాణానికి మంత్రి శంఖుస్థాపన

Published Fri, May 4 2018 12:01 PM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

Police Station Foundation Naini Narasimha Reddy Ramagundam - Sakshi

 పనులు ప్రారంభిస్తున్న హోంమంత్రి నాయిని

రామగుండం : అంతర్గాం మండల కేంద్రంలో నూతన పోలీస్‌స్టేషన్‌ భవన నిర్మాణ పనులను గురువారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ ప్రత్యేక చొరవతో రూ.1.50 కోట్ల నిధులతో నూతన భవన నిర్మాణానికి కేటాయించారు. రామగుండం కమిషనర్‌ విక్రమ్‌జిత్‌ దుగ్గల్, ఏసీపీ రక్షిత కె.మూర్తి, డీసీపీ సుదర్శన్‌గౌడ్, హోంమంత్రికి స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, రాష్ట్ర పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్, ఐజీ నాగిరెడ్డి, రామగుండం సీఐ సాగర్, ఎస్సై శీలం ప్రమోద్‌రెడ్డి, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, తహసీల్దార్‌ పుప్పాల హన్మంతరావు, గ్రామ సర్పంచులు శశికళ, పద్మ, ఎంపీటీసీ పద్మ, రాజయ్య, వైస్‌ ఎంపీపీ పవన్, టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

గౌరవ వందనం స్వీకరించిన నాయిని..

పాలకుర్తి : హోంమంత్రికి గురువారం పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లో కేశోరాం ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అంతర్గాంలో నూతనంగా నిర్మించనున్న పీఎస్‌ నిర్మాణం  ప్రారంభోత్సవానికి వచ్చిన హోంమంత్రి కేశోరాం అతిథి గృహంలో బస చేశారు. కాగా ప్లాంట్‌ హెడ్‌ రాజేశ్‌గర్గు, మేనేజర్‌ కేఎన్‌రావులు ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, రాష్ట్ర పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌లున్నారు.


మంత్రికి ఘన స్వాగతం.. 

జ్యోతినగర్‌ : మంత్రి నాయిని ఎన్టీపీసీ పీటీఎస్‌ అతిథి గృహంలో పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. గురువారం ‘ఖని’లో పలు శంకుస్థాపనల నేపథ్యంలో ఎన్టీపీసీ రామగుండం పీటీఎస్‌ జ్యోతిభవన్‌ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు గౌరవందనం చేశారు. ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి హోంమంత్రికి స్వాగతం పలికారు. సారయ్య, సత్యనారాయణ, రమేశ్‌బాబు, గట్టయ్య పాల్గొన్నారు.

రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజేశం గౌడ్‌కు పీటీఎస్‌ అతిథి గృహంలో పెద్దపల్లి అభివృద్ధి ఫోరం అధ్యక్షుడు పెద్దం పేట శంకర్‌ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం తెలిపారు. చెన్న య్య, డాక్టర్‌ విజయభాస్కర్, సింగం సత్త య్య, పలువురు గౌడ సంఘం ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

గౌరవవందనం స్వీకరిస్తున్న నాయిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement