New police station
-
పీఎస్ భవన నిర్మాణానికి మంత్రి శంఖుస్థాపన
రామగుండం : అంతర్గాం మండల కేంద్రంలో నూతన పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణ పనులను గురువారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ప్రత్యేక చొరవతో రూ.1.50 కోట్ల నిధులతో నూతన భవన నిర్మాణానికి కేటాయించారు. రామగుండం కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్, ఏసీపీ రక్షిత కె.మూర్తి, డీసీపీ సుదర్శన్‌గౌడ్, హోంమంత్రికి స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఐజీ నాగిరెడ్డి, రామగుండం సీఐ సాగర్, ఎస్సై శీలం ప్రమోద్‌రెడ్డి, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, తహసీల్దార్ పుప్పాల హన్మంతరావు, గ్రామ సర్పంచులు శశికళ, పద్మ, ఎంపీటీసీ పద్మ, రాజయ్య, వైస్ ఎంపీపీ పవన్, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గౌరవ వందనం స్వీకరించిన నాయిని.. పాలకుర్తి : హోంమంత్రికి గురువారం పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లో కేశోరాం ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అంతర్గాంలో నూతనంగా నిర్మించనున్న పీఎస్ నిర్మాణం ప్రారంభోత్సవానికి వచ్చిన హోంమంత్రి కేశోరాం అతిథి గృహంలో బస చేశారు. కాగా ప్లాంట్ హెడ్ రాజేశ్‌గర్గు, మేనేజర్ కేఎన్‌రావులు ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌లున్నారు. మంత్రికి ఘన స్వాగతం.. జ్యోతినగర్ : మంత్రి నాయిని ఎన్టీపీసీ పీటీఎస్ అతిథి గృహంలో పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. గురువారం ‘ఖని’లో పలు శంకుస్థాపనల నేపథ్యంలో ఎన్టీపీసీ రామగుండం పీటీఎస్ జ్యోతిభవన్ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు గౌరవందనం చేశారు. ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి హోంమంత్రికి స్వాగతం పలికారు. సారయ్య, సత్యనారాయణ, రమేశ్‌బాబు, గట్టయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశం గౌడ్‌కు పీటీఎస్ అతిథి గృహంలో పెద్దపల్లి అభివృద్ధి ఫోరం అధ్యక్షుడు పెద్దం పేట శంకర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం తెలిపారు. చెన్న య్య, డాక్టర్ విజయభాస్కర్, సింగం సత్త య్య, పలువురు గౌడ సంఘం ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
ఆదిబట్ల పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల పోలీసు స్టేషన్ ప్రారంభానికి ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. ఐటీ కారిడార్‌లోని టీసీఎస్, టాటా ఏరోస్పేస్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ ఐటీ సంస్థల, వాటిల్లోని ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. సుమారు రూ.2.5 కోట్లతో ఈ మోడల్ పోలీస్ స్టేషన్‌ను నిర్మించారు. ఈనెల 12వ తేదీన ప్రారంభం కానుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడంతస్తుల భవనంలో అన్ని హంగులతో నిర్మించారు. ఇక్కడ పోలీస్‌స్టేషన్ ఉండడం వల్ల ఐటీ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో రక్షణ ఉంటుంది. ఏదైనా ఘటన జరిగితే ఇబ్రహీంపట్నం వెళ్లాల్సివచ్చేది. ఇప్పుడు ఆ అవసరం ఉండదు. భవిష్యత్తులో ఆదిబట్ల ప్రాంతానికి మరిన్ని ఐటీ సంస్థలు రానుండటంతో భద్రత విషయంలో ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటూ ఈ స్టేషన్‌ను నిర్మించారు. -
సరి‘హద్దు’ల సంగతేంటి?
- నూతన ఠాణాలకు దిక్సూచీలు ఎక్కడ? - ఐదు నెలలు గడిచినా వెలువడని ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన పోలీస్స్టేషన్ల సరిహద్దులను ఇప్పటివరకు గుర్తించలేదు. పాత పోలీస్స్టేషన్ల పరిధి నుంచి కొన్ని గ్రామాలు, ప్రాంతాలను విడదీసి నూతన పోలీస్‌స్టేషన్ కిందకు తీసుకు వచ్చారు. అయితే వీటిని గుర్తిస్తూ సంబంధిత నూతన పోలీస్‌స్టేషన్‌కు సరిహద్దు కేంద్రాలను ఉత్తర్వులుగా జారీ చేయాలి. ఆ పోలీస్‌స్టేషన్ కిందకు వచ్చే గ్రామాలు, వాటి వివరాలు పొందుపరుస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలి. 5 నెలలు గడిచినా ఇప్పటివరకు ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో పాత పోలీస్స్టేషన్ల పేరు మీదే నూతన ఠాణాల అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. దీని వల్ల భవిష్యత్‌లో కేసుల విచారణలో న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయని పోలీస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు విభాగాల మధ్య.. 92 నూతన పోలీస్స్టేషన్లను కొత్త జిల్లాల్లో భాగంగా ఏర్పాటు చేశారు. దసరా నుంచి కార్యక్రమాలు ప్రారంభించిన ఈ పోలీస్ స్టేషన్లకు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అథారిటీ కూడా కల్పించలేదు. సరిహద్దు రేఖలు, కేసు నమోదు అధికారం లేకపోవడంతో పేరుకే పోలీస్ ఠాణాగా ఉందని ఎస్పీలు ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ సమస్యపై హోంశాఖ–న్యాయశాఖ సమన్వయంతో ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే హోంశాఖ నుంచి సంబంధిత సరిహద్దు–ఎఫ్ఐఆర్ అధికార ఉత్తర్వుల ఫైలును న్యాయశాఖకు పంపారని ఉన్నతాధికారులు తెలిపారు. అయితే న్యాయశాఖలోనే నోటిఫికేషన్ కోసం ఫైలు పెండింగ్‌లో ఉందని స్పష్టం చేశారు. రెండు విభాగాల మధ్య సమన్వయ లోపం వల్లే అధికారిక ఉత్తర్వులు రావడం లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఉత్తర్వులు వెలువడేలా కృషి చేయాలని ఎస్పీలు, కమిషనర్లు కోరుతున్నారు.