హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల పోలీసు స్టేషన్ ప్రారంభానికి ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. ఐటీ కారిడార్‌లోని టీసీఎస్, టాటా ఏరోస్పేస్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ ఐటీ సంస్థల, వాటిల్లోని ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. సుమారు రూ.2.5 కోట్లతో ఈ మోడల్ పోలీస్ స్టేషన్‌ను నిర్మించారు. ఈనెల 12వ తేదీన ప్రారంభం కానుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మూడంతస్తుల భవనంలో అన్ని హంగులతో నిర్మించారు. ఇక్కడ పోలీస్‌స్టేషన్ ఉండడం వల్ల ఐటీ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో రక్షణ ఉంటుంది. ఏదైనా ఘటన జరిగితే ఇబ్రహీంపట్నం వెళ్లాల్సివచ్చేది. ఇప్పుడు ఆ అవసరం ఉండదు. భవిష్యత్తులో ఆదిబట్ల ప్రాంతానికి మరిన్ని ఐటీ సంస్థలు రానుండటంతో భద్రత విషయంలో ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటూ ఈ స్టేషన్‌ను నిర్మించారు.
ఆదిబట్ల పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
Published Sun, Jun 11 2017 6:22 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
Advertisement
Advertisement