తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ 'టీ-పాడ్' నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డాలస్ ప్రాంతీయులు, అన్ని స్థానిక, తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజల్వన, గణపతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
టీ-పాడ్ 2024 అధ్యక్షురాలిగా కన్నయ్యగారి రూప, కార్యదర్శిగా అన్నమనేని శ్రీనివాస్, కోశాధికారిగా గణపవరపు బాలాలు ఎన్నికయ్యారు. ఫౌండేషన్ కమిటీ అధ్యక్షుడిగా జానకిరాం, ఉపాధ్యక్షుడిగా అజయ్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా బుచ్చి రెడ్డిలు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి సభ్యులు అభినందనలు తెలిపారు.
టీ-పాడ్ తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించడమే కాకుండా జట్టు సభ్యులకు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడానికి వేదిక అయిందని సంస్థ అధ్యక్షురాలు పేర్కొన్నారు. టీ-పాడ్ ఏర్పాటు చరిత్ర, అనేక సంవత్సరాలుగా నిర్వహించిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు వివరించారు.
తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం.. బతుకమ్మ, దసరా సంబరాలను వాటి సిగ్నేచర్ స్టైల్‌లో నిర్వహించడం గురించి వివరించారు. చివరగా ఈ ఏడాది టీపాడ్ చేపట్టాల్సిన కార్యక్రమాలపై నూతన కార్యవర్గం చర్చించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ప్రాంతీయ, జాతీయ సంస్థల నాయకులు.. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment