గాన గంధర్వులు, దివగంత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి తృతీయ వర్ధంతి పురస్కరించుకుని భగవాన్ బోయినపల్లి గారి ఆధ్వర్యంలో Bhagavan’s Soulful presents 'SPB Lives On' పేరుతో అక్టోబర్ 7, 2023 తేదీన సంస్మరణ సంగీత కార్యకమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం యూకేలోని లండన్‌లో నోవర్ హిల్ హైస్కూల్‌లో నిర్వహించారు. ఇదే కార్యక్రమం 2022లో భగవాన్ 'సోల్‌ఫుల్ ప్రెజెంట్' పేరుతో నిర్వహించిన ‘ట్రిబ్యూట్ టు ది లెజెండ్' కార్యక్రమం ఘన విజయం సాధించింది.
అదే స్ఫూర్తితో ఎస్పీబీ గారి స్మృతికి చిహ్నంగా ఇలా ప్రతి యేటా నివాళులర్పించాలనే ఉద్యేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 300 మందికి పైగా విచ్చేశారు. ఈ సంగీత కార్యక్రమం భగవాన్ బోయినపల్లి గారీ ఉపన్యాసంతో మొదలైంది. తొలుత భగవాన్ గారు గాన గంధర్వని కీర్తిని ప్రశంసిస్తూ సంగీతాన్ని ప్రారంభించగా, చిన్నారులు భరతనాట్యంతో ఆ కార్యక్రమానికి మరింత శోభ తెచ్చారు.
ఈ కార్యక్రమంలో బహుముఖ గాయనీ గాయకులు నాలుగు గంటలకు పైగా బాలు గారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పాడిన సూపర్ హిట్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించారు. ఈ సంగీత కార్యక్రమాన్ని ఇంతలా జయప్రదం చేసిన గాయనీగాయకులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. దసరా పంగుడ ముందే వచ్చిందా అన్నంత రీతీలో వైభవంగా జరగడమే గాక అతిథుల విందు భోజనాలతో కుటుంబ వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా పలువురు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భగవాన్ బోయన్‌పల్లి గారిని అభినందించగా, మరికొందరూ ఇలా ప్రతి ఏటా నిర్వహించాలన్నా ఆయన సంకల్పాన్ని వేన్నోళ్ల కొనియాడారు.
(చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..)
Comments
Please login to add a commentAdd a comment