music event
-
ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు..తమన్ మ్యూజిక్ షో అదుర్స్ (ఫొటోలు)
-
యూకేలో గాన గంధర్వునికి ఘనంగా సంగీత నివాళి!
గాన గంధర్వులు, దివగంత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి తృతీయ వర్ధంతి పురస్కరించుకుని భగవాన్ బోయినపల్లి గారి ఆధ్వర్యంలో Bhagavan’s Soulful presents 'SPB Lives On' పేరుతో అక్టోబర్ 7, 2023 తేదీన సంస్మరణ సంగీత కార్యకమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం యూకేలోని లండన్‌లో నోవర్ హిల్ హైస్కూల్లో నిర్వహించారు. ఇదే కార్యక్రమం 2022లో భగవాన్ 'సోల్‌ఫుల్ ప్రెజెంట్' పేరుతో నిర్వహించిన ‘ట్రిబ్యూట్ టు ది లెజెండ్' కార్యక్రమం ఘన విజయం సాధించింది. అదే స్ఫూర్తితో ఎస్పీబీ గారి స్మృతికి చిహ్నంగా ఇలా ప్రతి యేటా నివాళులర్పించాలనే ఉద్యేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 300 మందికి పైగా విచ్చేశారు. ఈ సంగీత కార్యక్రమం భగవాన్ బోయినపల్లి గారీ ఉపన్యాసంతో మొదలైంది. తొలుత భగవాన్ గారు గాన గంధర్వని కీర్తిని ప్రశంసిస్తూ సంగీతాన్ని ప్రారంభించగా, చిన్నారులు భరతనాట్యంతో ఆ కార్యక్రమానికి మరింత శోభ తెచ్చారు. ఈ కార్యక్రమంలో బహుముఖ గాయనీ గాయకులు నాలుగు గంటలకు పైగా బాలు గారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పాడిన సూపర్ హిట్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించారు. ఈ సంగీత కార్యక్రమాన్ని ఇంతలా జయప్రదం చేసిన గాయనీగాయకులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. దసరా పంగుడ ముందే వచ్చిందా అన్నంత రీతీలో వైభవంగా జరగడమే గాక అతిథుల విందు భోజనాలతో కుటుంబ వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా పలువురు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భగవాన్ బోయన్‌పల్లి గారిని అభినందించగా, మరికొందరూ ఇలా ప్రతి ఏటా నిర్వహించాలన్నా ఆయన సంకల్పాన్ని వేన్నోళ్ల కొనియాడారు. (చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..) -
ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్‌ను ఆపేసిన పోలీసులు.. వీడియో వైరల్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. పూణెలో నిర్వహించిన మ్యూజిక్షోను అర్ధాంతంరగా అడ్డుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం రాత్రి పుణెలో ఆర్ రెహమాన్ మ్యూజిక్ కాన్సర్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇక రెహమాన్ తన బృందంతో కలిసి హుషారైన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చదవండి: (బ్రేకప్ అయినా ఇంకా నేనే కావాలని కోరుకుంటున్నాడు: నటి) ఎంతో ఉత్సాహాంగా ఈవెంట్ జరుగుతుండగా పోలీసులు స్టేజ్‌పైకి వెళ్లి ప్రోగ్రాంను మధ్యలోనే ఆపేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాత్రి 10గంటల వరకే షోకు అనుమతి ఉందని, సమయం మించిపోవడంతో ప్రోగ్రాంను ఆపేయాలంటూ రెహమాన్ టీంను కోరారు. రెహమాన్ చివరిగా ఓ పాట పాడి కార్యక్రమాన్ని ముగించారు. కాగా ఈ విషయంపై పూణె పోలీసులు వివరణ ఇస్తూ.. రెహమాన్ మేం వెళ్లే సమయానికి చివరి పాట పాడుతున్నారు. డెడ్‌లైన్ ముగియడంతో షోను ఆపేయాలను కోరాం. ఆయన కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు అంటూ పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై రెహమాన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిబంధనల ప్రకారం షోను ఆపేయాలంటే నిర్వాహకులతో మాట్లాడాలి.. అంతేకానీ ఇలా స్టేజ్‌పైకి ఎక్కి అవమానించకూడదు అంటూ కామెంట్స చేస్తున్నారు. చదవండి: (రజనీకాంత్ సినిమాకు ఆ కండీషన్ పెట్టిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్) Pune! Thank you for all the love and euphoria last night! Was such a roller coaster concert! No wonder Pune is home to so much classical music! We shall be back soon to sing with you all again! #2BHKDinerKeyClub @heramb_shelke @btosproductions EPI pic.twitter.com/UkBn09FwLj — A.R.Rahman (@arrahman) May 1, 2023 Extremely disappointing of #PunePolice to shut down #ARRahman ‘s concert in #Pune at 10.14PM. While the rule of 10pm cutoff is understood, this is nt how a visiting artist of his stature should hav been treated. He was almost on his finale song when this happened👇🏻cc @CPPuneCity pic.twitter.com/HYEor4wiYX — Irfan (@IrfanmSayed) April 30, 2023 Pune police stop AR Rahman concert midway citing court-mandated 10 pm deadline Read More: https://t.co/syWW1efdqq pic.twitter.com/jSZYm7chZt — Express PUNE (@ExpressPune) May 1, 2023 -
సింగర్ పై నోట్ల వర్షం..!
అహ్మదాబాద్: గుజరాతీ సంప్రదాయంతో మరో సింగర్ వివాదంలో చిక్కుకున్నాడు. వల్సాద్ జిల్లాలోని వాపి పట్టణంలో ఓ సాంస్కృతిక కార్యక్రమానికి ఫోక్ సింగర్ కీర్తిధన్ గధ్వి హాజరయ్యాడు. స్వామి నారాయణ్ కాంప్లెక్స్ లో తన పాటలతో అక్కడి వారిలో ఉత్సాహాన్ని నింపాడు. అయితే ఆయన పాడటం మొదలుపెట్టింది తరవాయి.. వారిపై నోట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. దీంతో ఆయనకు కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. తొలిసారిగా 2015లో జామ్ నగర్లో ఓ ఈవెంట్లో రూ. 4 కోట్ల నగదు రాబట్టి వెలుగులోకి వచ్చాడు కీర్తిధన్. సింగర్ కీర్తిధన్ గధ్వి, ఆయన బృంధంపై ఈవెంట్ ముగిసేవరకూ రూ.100, రూ.500 నోట్లు, కొందరైతే రూ.50, రూ.10 నోట్లను చల్లుతూనే ఉన్నారు. డబ్బులు ఇలా చల్లడం ఏంటి, అవి ఎవరిస్తున్నారు, వారికి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. అసలు ఆ డబ్బుతో మీరు ఏం చేస్తారన్న ప్రశ్నలు ఆయనను చుట్టుముట్టాయి. లక్షల్లో రూపాయలు ఆయనపై కురిపించగా.. నగదు ఎంతో లెక్క మాత్రం తెలపలేదు. ఓవైపు ఏంతో మంది చేతికి డబ్బులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఇలా నోట్లను చల్లుతున్నారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగర్ కీర్తిధన్ నోట్ల వర్షంపై స్పందిస్తూ.. 'ఇలా చేయడమన్నది గుజరాతీ సంప్రదాయంలో ఓ భాగం. ఈ నగదును సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తాను. డబ్బు దొరికింది కదా అని వృథా చేసే ప్రసక్తే లేదు. మంచి కార్యక్రమాలకు ఖర్చు చేస్తాం' అని చెప్పాడు. గతేడాది దక్షిణ గుజరాత్ లో ఓ సింగర్ నవరాత్రి ఉత్సవాలలో కచేరీ పెట్టగా.. దాదాపు రూ.40 లక్షల నగదును ఆయనపై కురిపించడం అప్పట్లో వివాదాస్పదమైంది. నోట్ల రద్దు తర్వాత కొత్త రూ.500, రూ.2000 నోట్లను విచ్చలవిడిగా చల్లుతూ ఈవెంట్ నిర్వహించడంపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. తాజాగా సింగర్ కీర్తిధన్ ఈవెంట్లోనూ ఇలాగే నోట్లవర్షం కురిపించడంపై విమర్శలు తలెత్తుతున్నాయి.